Begin typing your search above and press return to search.

సీఎం బావ‌నే జైలుకు పంపించేంత రేంజ్‌!!

ఆయ‌నే జార్ఖండ్ సీఎం, యువ నాయ‌కుడు హేమంత్ సొరేన్‌. ప్ర‌స్తుతం ఈడీ వ‌ర్సెస్ సీఎం హేమంత్ వ్య‌వ‌హారంలో ఈ లేడీ లీడ‌ర్ స్టోరీ దేశ‌వ్యాప్తంగా హ‌ల్చ‌ల్ చేస్తోంది.

By:  Tupaki Desk   |   31 Jan 2024 3:15 AM GMT
సీఎం బావ‌నే జైలుకు పంపించేంత రేంజ్‌!!
X

ఏపీలో త‌న సొంత అన్న వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ చీఫ్‌గా ఉన్న ష‌ర్మిల నిప్పులు చెరుగుతున్న విష‌యం తెలిసిందే. అంతేకాదు.. వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు, కుటుంబ వ్య‌వ‌హారాలు కూడా తెర మీదికి వ‌స్తున్నాయి. దీంతో అంద‌రూ బుగ్గ‌లు నొక్కుకుంటున్నారు. ఇదేం రాజ‌కీయం.. సొంత అన్న‌నే రోడ్డున ప‌డేస్తారా? ఏదైనా ఉంటే నాలుగు గోడ‌ల మ‌ధ్య కోర్టు హాళ్ల‌లోనూ తేల్చుకోవాలి.. కానీ! అని వ్యాఖ్య లు వినిపిస్తున్నాయి.

కానీ, ష‌ర్మిల‌ను మించిన మ‌రో నాయ‌కురాలు వ్య‌వ‌హారం తాజాగా తెర‌మీదికి వ‌చ్చింది. రాజ‌కీయాలు రాజ కీయాలే.. అన్న‌ట్టుగా.. ష‌ర్మిల‌ను మించిన రేంజ్‌లో ముఖ్యమంత్రి, త‌న భర్త‌కు అన్న అయిన నాయ‌కుడిని ఆ నాయ‌కురాలు జైలుకు పంపించే రేంజ్‌లో చ‌క్రం తిప్పింది. ఏక్ష‌ణ‌మైనా.. స‌ద‌రు సీఎంను అరెస్టు చేయ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. ఆయ‌నే జార్ఖండ్ సీఎం, యువ నాయ‌కుడు హేమంత్ సొరేన్‌. ప్ర‌స్తుతం ఈడీ వ‌ర్సెస్ సీఎం హేమంత్ వ్య‌వ‌హారంలో ఈ లేడీ లీడ‌ర్ స్టోరీ దేశ‌వ్యాప్తంగా హ‌ల్చ‌ల్ చేస్తోంది.

ఎవ‌రీమె..

జార్ఖండ్ మాజీ సీఎం శిబు సొరేన్‌కు ముగ్గురు కుమారులు. హేమంత్‌, దుర్గ‌, వ‌సంత్‌. వీరంతా రాజ‌కీయా ల్లోనే ఉన్నారు. అయితే.. 2009లో అనుమానాస్ప‌ద స్థితిలో దుర్గ మృతి చెందాడు. అప్ప‌టికి ఆయ‌న ఎమ్మెల్యే. ఆయ‌న ఆలోచ‌న అంతా సీఎం సీటుపై ఉండేది. త‌న తండ్రి త‌ర్వాత‌.. సీఎం కావాల‌ని.. లేదా డిప్యూటీ సీఎం కావాల‌ని బావించారు. ఇలా.. ఆయ‌న ఆలోచ‌న‌లో ఉండ‌గాన హ‌ఠాత్తుగా మ‌ర‌ణించారు. ఈయ‌న ప్లేస్‌లో ఆయ‌న స‌తీమ‌ణి సీత రంగప్ర‌వేశం చేశారు.

సీఎం సీటు కోస‌మే.. త‌న భ‌ర్త‌ను కుటుంబ స‌భ్యులు ముఖ్యంగా హేమంత్ చంపించార‌ని ఆమె ఆరోపించా రు. ఇలా మొద‌లైన వివాదం.. కాస్తా.. ఆమె ఎమ్మెల్యేగా మార‌డం.. హేమంత్‌ను ఢీ అంటే ఢీ అనేలా రాజ‌కీ యాలు చేయ‌డం.. ఈ క్ర‌మంలో బీజేపీకి న‌మ్మిన బంటుగా ఉండ‌డంతో హేమంత్‌కు ఎప్ప‌టిక‌ప్పుడు.. సెగ‌లు పెరుగుతూ వ‌చ్చాయి. సొంత త‌మ్ముడి భార్య‌..పెడుతున్న రాజ‌కీయ సెగ‌తో హేమంత్ అల్లాడి పోయారు. ఇలా.. 2021లో వెలుగు చూసిన భూకుంభ‌కోణం.. మ‌నీలాండ‌రింగ్ కేసుల‌పై సీతే మొత్తం కూపీలాగి.. కేంద్రానికి ఫిర్యాదు చేయ‌డం అప్ప‌ట్లో క‌ల‌క‌లం రేపింది. ప్ర‌స్తుతం ఆ కేసుల్లోనే సీఎం హేమంత్ ఏక్ష‌ణ‌మైనా అరెస్ట‌య్యే అవ‌కాశం ఉంది. ఇదీ.. సంగ‌తి!