Begin typing your search above and press return to search.

నేను శ్రీకృష్ణుడి గోపికను.. స్టార్‌ హీరోయిన్‌ హాట్‌ కామెంట్స్‌!

హేమమాలిని.. పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్‌ ‘డ్రీమ్‌ గర్ల్‌’గా దేశాన్ని ఒక ఊపు ఊపారు ఆమె.

By:  Tupaki Desk   |   19 April 2024 7:35 AM GMT
నేను శ్రీకృష్ణుడి గోపికను.. స్టార్‌ హీరోయిన్‌ హాట్‌ కామెంట్స్‌!
X

హేమమాలిని.. పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్‌ ‘డ్రీమ్‌ గర్ల్‌’గా దేశాన్ని ఒక ఊపు ఊపారు ఆమె. స్టార్‌ హీరోయిన్‌ గా నాటి అగ్ర హీరోలందరితో కలిసి నటించారు. ప్రముఖ హీరో ధర్మేంద్రను వివాహం చేసుకున్న హేమమాలినికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిలో ఇషా డియోల్‌ హీరోయిన్‌ గా పలు సినిమాల్లో నటించారు.

ప్రస్తుతం హేమమాలిని ఉత్తరప్రదేశ్‌ లోని మధుర నుంచి బీజేపీ అభ్యర్థిగా పార్లమెంటుకు పోటీ చేస్తున్నారు. ఇప్పటికే 2014, 2019 ఎన్నికల్లో ఆమె ఎంపీగా విజయం సాధించారు. అంతకుముందు 2003 నుంచి 2009 వరకు బీజేపీ తరఫున రాజ్యసభ సభ్యురాలిగానూ వ్యవహరించారు.

ఈ నేపథ్యంలో మూడోసారి మధుర నుంచి విజయం సాధించి హ్యాట్రిక్‌ కొట్టాలని హేమమాలిని భావిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ఆమె ఉధృత ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా హేమమాలిని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను శ్రీకృష్ణుడి గోపికనన్నారు. శ్రీకృష్ణుడి 16 వేల మంది గోపికల్లో ఒకరిగా తనను తాను అభివర్ణించుకుంటానన్నారు.