Begin typing your search above and press return to search.

పుతిన్ మోదీ మధ్య... ఆ మొక్క లెక్కే వేరు....

రష్యాధ్యక్షుడు పుతిన్...భారత్ ప్రధాని నరేంద్ర మోదీ కూర్చొని మాట్లాడుతున్న సందర్భంలో అందరి దృష్టి వారి మధ్య ఆకర్షకంగా నిలిచిన ఓ మొక్కపైనే మళ్ళింది.

By:  Tupaki Desk   |   6 Dec 2025 9:46 AM IST
పుతిన్ మోదీ మధ్య... ఆ మొక్క లెక్కే వేరు....
X

రష్యాధ్యక్షుడు పుతిన్...భారత్ ప్రధాని నరేంద్ర మోదీ కూర్చొని మాట్లాడుతున్న సందర్భంలో అందరి దృష్టి వారి మధ్య ఆకర్షకంగా నిలిచిన ఓ మొక్కపైనే మళ్ళింది. ప్రత్యేకంగానూ అనిపించింది. ఇంతకూ ఈ మొక్కను మధ్యన ఎందుకుంచారు? దానివల్ల ప్రయోజనం ఉందా? కేవలం అలంకరణ కోసమేనా? ఇన్ని ప్రశ్నలు సందర్శకుల్లో కలిగాయి. అయితే మొక్కే కదా అని అనుకోలేమండోయ్...దానికీ ఓ లెక్కుంది. ఇరుదేశాల మధ్య శాంతి సౌహర్డ్రాలు నెలకొనడానికి ఈ మొక్క చాలా దోహదపడుతుందట...ఇరు దేశాల నడుమ శాంతి పవనాలు వీచాలని...ప్రగతి పథంలో దోస్త్ మేరా దోస్త్ అంటూ చెట్టాపట్టాలేసుకుని ముందుకు సాగిపోవాలని ఆకాంక్షిస్తూ ఆమొక్కను ఇరు దేశాల నేతల మధ్యన అందంగా అలంకరించినట్లు తెలుస్తోంది.

ఇంతకూ ఆ మొక్కపేరు హెలికోనియా. పుతిన్ మోదీ ఆసీనులైన సీట్ల మధ్యన మిలమిల మెరిసిపోతూ చూపరులను ఆకట్టుకుంటున్న ఆమొక్క కథాకమామీషు ఏంటని నెటిజన్లు సెర్చ్ చేయడం ప్రారంభించారు. హెలికోనియా మొక్కను ఎందుకు పెంచుతారు? దీని లక్షణమేంటి? మనీ ప్లాంట్ లాగా ఇదో పీస్ ప్లాంట్ అని తెలుస్తోంది. ఈ మొక్క ఎక్కడుంటే అక్కడ ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. ప్రస్తుతం రష్యా భారత్ దేశాల నడుమ ఇప్పటికే సుహృద్ వాతావరణం ఉన్నా అది మరింత బలపడాలని...రెండు దేశాలు శాంతికాముక దేశాలుగా ప్రపంచానికి సందేశమివ్వాలన్న సదాశయంతో ఆ మొక్కకు అంతటి ప్రాధాన్యం కల్పించారు.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్...భారత్ ప్రధాని నరేంద్రమోదీ కలుసుకున్నప్పుడు వారిరువురి నడుమ ప్రోటోకాల్ కు సంబంధించి కరచాలనం, ఆత్మీయ ఆలింగనం, ఇరు దేశాధినేతల నోట విశేష ప్రకటనల్ని ఆశించడం సహజం. కానీ ఈసారి పుతిన్ పర్యటనలో ఈ హెలికోనియా మొక్కకూడా సముచిత స్థానాన్ని సాధించింది. ఎరుపు, పచ్చ వన్నెలతో నిఠారుగా నిలుచున్న హెలికోనియా మొక్క కేవలం అలకంరణ కోసమే కాదు...ఇది సానుకూల పవనాలను సృష్టిస్తుంది. ఈ మొక్క ఉన్నచోట పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అభివృద్ధి ఎదుగుదల ఉంటుంది. వ్యక్తుల నడుమ సమతుల్యత కనిపిస్తుంది. కొత్త సంభాషణలు చోటు చేసుకుంటాయి.

అయితే పుతిన్...మోదీ కలుసుకున్న ఆ గదిలో కనిపించే ఏ వస్తువు కూడా యాదృచ్చికంగా ఉన్నది కాదు. అక్కడి మొక్కలు, పూలు, ఆ గదిలో రంగు, ఆసనాల స్థానాలు, నేపథ్య అలంకరణ అన్నీ కూడా ఆ సందర్భానికి అనువుగా ఉండేలా ఇంటీరియర్ డెకొరేటర్ చూసుకున్నారు. ఆ అలకంరణలో హెలికోనియా మొక్క సముచిత స్థానం సాధించుకుంది. రష్యా...భారత్ సమావేశం సానుకూలంగా ఉండబోతోందని, ఇరు దేశాల భాగస్వామ్యం ప్రగతి పథాన దూసుకెళుతుందని సింబాలిక్ గా తెలుస్తోంది.

హెలీకోనియాను కేవలం మొక్కే కదా అనుకోకండి...దీనికీ చాలా చరిత్ర ఉంది.