Begin typing your search above and press return to search.

గుండె జబ్బులు ఎందుకు పెరుగుతున్నాయి?

దేశంలో గుండెపోట్లు పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే గుండె సంబంధమైన సమస్యలు చాలా వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   13 Dec 2023 8:34 AM GMT
గుండె జబ్బులు ఎందుకు పెరుగుతున్నాయి?
X

దేశంలో గుండెపోట్లు పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే గుండె సంబంధమైన సమస్యలు చాలా వస్తున్నాయి. గుండెపోటుకు మన ఆహారాలే ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. గుండెపోటు రావడానికి దారి తీసే పరిస్థితులు తెలుసుకుంటే ఆందోళన కలిగిస్తోంది. కరోనా వైరస్ వచ్చిన తరువాత చాలా మంది గుండెపోటుకు గురవుతున్నారు. అప్పుడు వేసుకున్న టీకాల వల్ల కూడా గుండెపోట్లు పెరుగుతున్నాయనే ఆందోళనలు కూడా వస్తున్నాయి.

ముసలి వారిలోనే కాకుండా యువత కూడా గుండెపోటుకు బలవుతోంది. 2023లో గుండెపోటుకు గురైన వారి వయసులను పరిశీలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. చిన్న వయసులో ఉన్న వారికి కూడా గుండె జబ్బులు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. గతంలో ముసలి వారికే గుండెపోటు సమస్య వచ్చేది కాలక్రమంలో వయసులో ఉన్న వారిని సైతం గుండెపోటు బాధిస్తోంది.

ఇరవయ్యేళ్ల కంటే తక్కువ వయసున్న వారికి కూడా గుండె పోటు వస్తుందంటే ఆశ్చర్యం వేయక మానదు. 20 ఏళ్ల కుర్రాడు ఓ పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తుండగా గుండెపోటుతో మరణించడం సంచలనం కలిగించింది. మరో ఘటనలో 26 ఏళ్ల కుర్రాడు జిమ్ చేస్తుండగా గుండెపోటుతో మరణించడం గమనార్హం. ఇలా గుండెపోటు కలవరానికి గురి చేస్తోంది.

మన ఆహార అలవాట్లు, జీవన విధానం, అనారోగ్యాలు, జీవన శైలి విధానాల వల్ల కూడా గుండెజబ్బులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, నిద్ర వంటివి కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ నేపథ్యంలో మన అలవాట్లను మార్చుకుని పద్ధతులు మార్చుకుంటే తప్ప గుండె జబ్బుల బారి నుంచి బయట పడమని గుర్తించాలి

గుండె జబ్బుల ముప్పును ముందే గుర్తించవచ్చు. పోషకాహారం తీసుకోవడం వల్ల దాని ప్రమాదం నుంచి రక్షించుకోవచ్చు. మారుతున్న పరిస్థితుల ప్రభావం వల్ల మన ఆరోగ్యం దెబ్బ తింటోంది. ఫలితంగా నూరేళ్లు హాయిగా జీవించాల్సిన శరీరం చిన్న వయసులోనే శుష్కించుకుపోతోంది. ఈ క్రమంలో గుండె పోటు నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.