Begin typing your search above and press return to search.

దూకుడు తగ్గేదేలే... 70ఏళ్లు దాటిన దేశాధినేతలు వీరే!

రిటైర్మెంట్ వయసులేని ఉద్యోగాల్లో రాజకీయం ఒకటి అని అంటారు.

By:  Tupaki Desk   |   8 Oct 2023 5:25 AM GMT
దూకుడు తగ్గేదేలే... 70ఏళ్లు దాటిన దేశాధినేతలు వీరే!
X

రిటైర్మెంట్ వయసులేని ఉద్యోగాల్లో రాజకీయం ఒకటి అని అంటారు. అది ఉద్యోగమా అని అంటే కాదని చెప్పలేం. జీతం తీసుకుని చేసే ప్రతీ పనీ ఉద్యోగమే అనేది ఇక్కడ పలువురి లాజిక్. ఆ సంగతి అలా ఉంచితే... రాజకీయాల్లో సాధారణంగా తొలితరంలో కురువృద్ధులే హై పొజిషన్స్ లో ఉంటుంటారు. దానికి కారణం... సుమారు 40, 50 ఏళ్ల సుధీర్ఘ పోరాటం అనంతరం వారిని ఆయా పదవులు వరిస్తుండటం.

ఇదే క్రమంలో... వారి తర్వాతి తరం వారు మాత్రం ఆ మైలేజ్ ని అందిపుచ్చుకుంటే.. చిన్న వయసులోనే పెద్ద పెద్ద హోదాల్లో, పెద్ద పెద్ద పదవుల్లో ఆసీనులవుతారు. ఈ క్రమంలో 92 ఏళ్ల వయసులోనూ పదవుల్లో కొనసాగిన వారూ ఉన్నారు.. 19ఏళ్లకే దేశాధినేతలు అయినవారూ లేకపోలేదు.

అవును... 1971లో 19 సంవత్సరాల వయస్సులో హైతీకి చెందిన జీన్-క్లాడ్ డువాలియర్, దేశాధినేతగా ఎంపికైన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర కెక్కగా... జింబాబ్వే మాజీ అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే ప్రస్తుతం 92 సంవత్సరాల వయస్సులో ప్రపంచంలోనే అత్యంత పురాతన క్రియాశీల దేశాధినేతగా చరిత్ర సృష్టించారు.

ఇదే సమయంలో యునైటెడ్ కింగ్‌ డమ్‌ కు చెందిన ఎలిజబెత్ - II, 96 ఏళ్ల వయసులో పరిపాలించిన ప్రపంచంలోనే అత్యంత పురాతన పాలక చక్రవర్తిగా రికార్డులకెక్కారు! ఈ నేపథ్యంలో... 70 ఏళ్లు పైబడిన దేశాధినేతలు ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు.. ఏయే దేశాలలో ఉన్నారు అనేది చూద్దాం...!

ఈ లిస్ట్ లో ప్రస్తుతం ఇజ్రాయేల్ పై యుద్ధం ప్రకటించి.. తమను తాము రక్షించుకోవడం పాలస్థీనీయుల హక్కు అని చెబుతున్న పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్ వయసు ప్రస్తుతం 85 సవత్సరాలు. కాగా... యుద్ధం ఎదుర్కొంటున్న ఇజ్రాయేల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ వయసు 73 ఏళ్లు!

ఇక ఈ లిస్ట్ లో ఇరాన్ అధినేత అలీ ఖమేనీ వయసు 84 సంవత్సరాలు కాగా.. ప్రస్తుతం ఉన్న అధినేతల్లో పాలస్తీనా ప్రధాని తర్వాత రెండో అతిపెద్ద దేశాధినేతగా ఉన్నారు. అనంతరం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా 84 వయసులో ఇదే స్థానంలో కొనసాగుతున్నారు.

ఇక బ్రెజిల్ అధ్యక్షుడు లులా డ సిల్వా 77 ఏళ్ల వయసులోనూ, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం 76 ఏళ్ల వయసులోనూ పదవుల్లో కొనసాగుతున్నారు. ఇదే క్రమంలో... ఈ ఏడాది ఆగస్టు 14వరకూ పాకిస్థాన్ కు ప్రధానిగా ఉన్న షెహబాజ్ షరీఫ్ వయసు 72 ఏళ్లు కాగా... నైజీరియా అధ్యక్షుడు బొలా టినుబు వయసు 71ఏళ్లు!

కాగా... భారతదేశం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వయసు 73ఏళ్లు. 17 సెప్టెంబరు 1950లో గుజరాత్ లో జన్మించిన ప్రధాని మోడీ... ఆ రాష్ట్రానికి సుమారు 10ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం రెండో దఫా... భారత్ కు ఎన్డీయే కూటమి నుంచి ప్రధానిగా ఉన్నారు.