Begin typing your search above and press return to search.

ప్రశ్నిస్తే అంతలా ఇరిటేట్ అయితే ఎలా హరీశ్?

తాజాగా ఒక ప్రముఖ టీవీ చానల్ కొందరు జర్నలిస్టులను వేదికగా చేసి.. వారితో ప్రశ్నలు అడిగే కార్యక్రమాన్ని మొదలు పెట్టింది

By:  Tupaki Desk   |   15 Nov 2023 6:05 AM GMT
ప్రశ్నిస్తే అంతలా ఇరిటేట్ అయితే ఎలా హరీశ్?
X

ప్రజాప్రతినిధులుగా.. ప్రజాసేవ కోసమే జీవితాన్ని అంకితం చేసే నేతలకు ప్రశ్నలు మామూలే. మారిన కాలానికి తగ్గట్లు.. ప్రశ్నించేందుకు గళం విప్పేందుకు వెనుకాడని పరిస్థితి ఉంది. ఇలాంటివేళ.. ఓపికగా సమాధానాలు ఇవ్వాలే తప్పించి ఇరిటేట్ కాకూడదు. ఈ చిన్న లాజిక్ ను మంత్రి హరీశ్ రావు ఎందుకు మిస్ అవుతున్నారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. మిగిలిన రోజుల సంగతి ఎలా ఉన్నా.. కీలకమైన ఎన్నికలు ముంగిట్లోకి వచ్చి.. మరో రెండు వారాల్లో ప్రజలు తమ తీర్పును ఈవీఎంలో నిక్షిప్తం చేసే వేళలో.. అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని మంత్రి హరీశ్ రావు మిస్ అవుతున్నట్లుగా కనిపిస్తోంది.

తాజాగా ఒక ప్రముఖ టీవీ చానల్ కొందరు జర్నలిస్టులను వేదికగా చేసి.. వారితో ప్రశ్నలు అడిగే కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. ఈ ప్రోగ్రాం సక్సెస్ కావటంతో ఇదే తరహాలో కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నాయి పలు చానళ్లు. తాజాగా ఒక చానల్ నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి హరీశ్ హాజరయ్యారు. ఆయన్నుప్రశ్నలు అడిగే క్రమంలో.. డబుల్ బెడ్రూం ఇళ్లకు సంబంధించిన కీలక ప్రశ్న ఒకటి ఆయనకు ఎదురైంది.

''డబుల్ బెడ్రూం ఇళ్లు చాలా వరకు బీఆర్ఎస్ కార్యకర్తలకు.. వారి అనుచరులకు.. ఎక్కువ మొత్తంలో కేటాయింపులు జరుగుతున్నాయి. జీడిమెట్లలో ఉన్న చారికి కూడా ఇల్లు రాలేదు. అతడో పేద వ్యక్తి. ఇలాంటి చాలామందికి ఇళ్లు రాలేదన్న భావన ఉంది'' అన్న ప్రశ్నను ఒకరు అడగ్గా.. అంతలోనే హరీశ్ పక్కనే ఉన్న మరో జర్నలిస్టు అందుకొని సంపద పెంచి పేదలకు పంచాలన్న ఆలోచన గ్రౌండ్ లెవల్ లో నీరుకారిపోతోంది' అంటూ వ్యాఖ్యానించినంతనే.. అలా స్లీపింగ్ కామెంట్లు చేయొద్దన్నహరీశ్ అంతలోనే ఆగ్రహాన్ని తెచ్చేసుకున్నారు. ఇలా మీ అభిప్రాయాన్ని చెప్పొద్దన్న హరీశ్ కు.. ఇది ప్రజల అభిప్రాయమండి అంటూ సదరు మహిళా జర్నలిస్టు నోటి నుంచి మాటకుతీవ్రంగా ఇరిటేట్ అయ్యారు.

అంతే.. అప్పటివరకు ఉన్న కూల్ నెస్ మిస్ అయి.. మీ సొంత అభిప్రాయాన్ని పట్టుకొని ప్రజల అభిప్రాయమంటూ చెప్పటం అన్ ఫెయిర్ అన్న హరీశ్ మాటలకు తగ్గని మహిళా జర్నలిస్టు.. అది గ్రౌండ్ లెవల్ లో ఉన్న రియాలిటీ అంటూ కామెంట్ చేశారు. దీంతో మరింత ఇరిటేట్ అయిన హరీశ్.. 'మీరేమైనా కాంగ్రెస్ పార్టీకి పని చేస్తున్నారా?'అని వ్యాఖ్యానించారు. దీనికి సదరు మహిళా జర్నలిస్టు బదులిస్తూ.. 'నో' అని రిప్లై ఇచ్చారు. మీరు కాంగ్రెస్ ఏజెంట్ గా వ్యవహరిస్తున్నారా? అంటూ తీవ్రంగా ప్రశ్నించగా.. అంతే ధీటుగా సదరుమహిళా జర్నలిస్టు.. 'మేం ప్రజలపక్షాన ఉన్నాం' అని బదులివ్వటంతో హరీశ్ పూర్తిగా బరస్ట్ అయ్యారు.

అంతే.. హరీశ్ తీవ్రంగా మండిపడుతూ వ్యాఖ్యలు చేయటం.. అక్కడున్న ఇతరులు సైతం మహిళా జర్నలిస్టుకు మద్దతుగా గళం విప్పటంతో గందరగోళం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఆగ్రహాపూరితంగా హరీశ్ మాట్లాడిన మాటలు విస్మయానికి గురి చేసేలా మారాయి. కీలకమైన ఎన్నికల వేళలో.. కూల్ నెస్ ను విడిచి.. ఇంతలా ఇరిటేట్ కావాల్సిన అవసరం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది. ఒకవైపు కేటీఆర్ పలు మీడియా సంస్థలకు.. సోషల్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ.. సెటిల్డ్ గా మాట్లాడటం.. తప్పులు జరిగితే ఒప్పుకోవటం ద్వారా అందరిని సమాధాన పరుస్తున్న కేటీఆర్ శైలికి భిన్నంగా హరీశ్ తీరు ఉందంటున్నారు. బావను చూసి నేర్చుకోరాదు హరీశా? అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఫైనల్ ట్విస్టు ఏమంటే.. హరీశ్ ఫైరింగ్ కు చెందిన యూట్యూబ్ లింక్ మిస్ కావటం.. డిలీట్ అయిన క్లిప్ ఇదేనంటూ ఒకచిట్టి వీడియోవాట్సాప్ లో వైరల్ కావటం గమనార్హం.