Begin typing your search above and press return to search.

హరిహర వీరమల్లుని టీడీపీ తొక్కేసిందా ?

ఏపీలో రాజకీయాలు సినిమాలు బలంగా పెనవేసుకుంటున్న నేపథ్యం కనిపిస్తోంది. దాంతో ఒక దాని ప్రభావం మరో దాని మీద పడుతోంది.

By:  Tupaki Desk   |   29 July 2025 12:16 AM IST
హరిహర వీరమల్లుని టీడీపీ తొక్కేసిందా ?
X

ఏపీలో రాజకీయాలు సినిమాలు బలంగా పెనవేసుకుంటున్న నేపథ్యం కనిపిస్తోంది. దాంతో ఒక దాని ప్రభావం మరో దాని మీద పడుతోంది. అయితే ఈ విధంగా కలిపి చూడడం వల్ల రాజకీయ రంగం సంగతేమో కానీ సినిమాలకు దెబ్బ పడుతోంది. సినిమాలకు అన్ని సెక్షన్లూ కావాలి. అదే రాజకీయం అయితే ఒక ప్రత్యేక ఓటు బ్యాంక్ ని తెచ్చుకుని ఆ మీదట న్యూట్రల్ ఓటర్లను ఎవరు ఆకట్టుకుంటారో వారు అధికారంలోకి వస్తారు. కానీ సినిమాలు అలా కాదు. అన్ని వర్గాలూ ఓటేస్తేనే సినిమా క్లీన్ హిట్ గా నిలుస్తుంది.

హరిహరతో మరింతగా :

రాజకీయం ఇపుడు బాగా పురి విప్పుకుంది. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీర మల్లుతో అది మరింత రుజువు అయింది. పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ మాత్రమే కాదు జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి. దాంతో ఆయన అధికారం అందుకున్నాక వచ్చిన తొలి మూవీ ఇది. దాంతో అంచనాలు ఆకాశాన్ని అంటాయి. అంతే కాదు ఈ మూవీ హిట్ అయి తీరుతుందని అంతా ఆశలు పెట్టుకున్నారు. దాంతో సినిమాకు విడుదలకు ముందే మంచి హైప్ వచ్చేసింది. అయితే బెనిఫిట్ షోల నుంచే సినిమా మీద వ్యతిరేకత మొదలైంది. దానికి కారణం ఎవరు ఏమిటి అన్నదే చర్చగా ఉంది. సాధారణంగా ఏ సినిమాకు అయినా వీకెండ్ కలెక్షన్లు బాగా ఉంటాయి. కానీ పనిగట్టుకుని హరిహర వీర మల్లుని ఇబ్బందులు పెట్టారని అదంతా రాజకీయమని జనసేన వర్గాలు అంటున్నాయి.

కూటమి మద్దతుగా నిలిచినా :

మరో వైపు చూస్తే పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీర మల్లుకి కూటమి పార్టీలు పూర్తి మద్దతు ప్రకటించారు. నా అన్న సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేసే వీర మల్లు మంచి హిట్ కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరుకుంటూ ట్వీట్ చేశారు. గతంలో బాబు ఎపుడూ ఇలా చేయలేదు. దాంతో వీరమల్లుకు సీఎం లెవెల్ లోనే మద్దతు దక్కింది అని అనుకున్నారు. ఇక బీజేపీ ఏపీ కొత్త ప్రెసిడెంట్ పీవీఎన్ మాధవ్ అయితే విశాఖలో ఒక థియేటర్ లో సినిమాను స్వయంగా చూశారు. ఇలా మిత్ర పక్షాలు సహకరిస్తే వైసీపీ నుంచి వ్యతిరేకత సోషల్ మీడియాలో వచ్చింది అని జనసేన వర్గాలు మండిపడ్డాయి. అయితే ఇదంతా తెలుగు నాట మాత్రమే జరిగిన చూసిన నాటకం.

అక్కడ ఫుల్ సపోర్టు ఎందుకు లేదు :

ఇక ప్రవాసంలో తెలుగు సినిమాలకు మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. అమెరికాలో అయితే డాలర్ల వర్షమే కురుస్తోంది. అందులో పవన్ లాంటి బిగ్ స్టార్ సినిమా అంటే దాని రిజల్ట్ తో సంబంధం లేకుండా వీకెండ్స్ లో బ్రహ్మాండంగా కలెక్షన్లు వస్తాయని అంతా అంచనా వేశారు ఒక విధంగా చూస్తే కలెక్షన్ల సునామీయే అని అనుకున్నారు. కానీ కట్ చేస్తే యూఎస్ లోనే సీన్ సితార్ అయింది అని అంటున్నారు. దానికి కారణాలు ఏమిటి అంటే ఆసక్తికరమైన విషయాలే వెలుగు చూస్తున్నాయట. వీరమల్లుని గట్టిగా తొక్కేసింది టీడీపీనే అని ఎన్నారై జనసేన అభిమానులు అంటున్నారుట.

అవునా నిజమేనా :

ఈ విషయం మీదనే ఇపుడు తీవ్ర స్థాయిలో చర్చ సాగుతోంది. అమెరికాలో సినిమాను తొక్కేసింది టీడీపీ వారే అని జనసేన అనుమానించడం వెనక మ్యాటర్ ఏముంది అన్నదే కూడా అంతా ఆలోచిస్తున్నారు. సాధారణంగా అమెరికాలోని తెలుగు వారు టీడీపీ అభిమానులు ప్రతీ సినిమాకు తప్పనిసరిగా వెళ్తారు అని చెబుతున్నారు. సినిమాలే వారికి అక్కడ సరదా. తెలుగు నేటివిటీని మిస్ కాకూడదని కూడా ప్రతీ సినిమాను దాదాపుగా వారు వీకెండ్స్ లో చూస్తూంటారు. కానీ వీరమల్లు విషయంలో తేడా కొట్టిందని అంటున్నారు. టీడీపీకి చెందిన అభిమానులు ఎవరూ అక్కడ వీరమల్లు థియేటర్ల వైపు తొంగి చూడలేదు అని ఎన్నారై జనసేన అభిమానులు చెబుతున్నారు.

అందుకే అలా జరిగిందా :

హరిహర వీరమల్లు థియేటర్లు బోసి పోవడం వెనక రెగ్యులర్ గా మూవీస్ చూసే సినీ గోయర్స్ కానీ టీడీపీ పక్కా అభిమానులు కానీ వెళ్లకపోవడమే కారణం అని జనసేన ఫ్యాన్స్ అంటోంది. వీరమల్లుని తెలుగు నాట బాయ్ కాట్ చేయండి అంటూ హ్యాష్ ట్యాగ్ తో ఒక సోషల్ మీడియా ఉద్యమం నడిపారు. కానీ యూఎస్ లో అలాంటిది ఏదీ లేకుండా మూవీని ఎవరికి వారుగా కావాలనే బాయ్ కాట్ చేశారా అన్న చర్చ నడుస్తోంది. ఇలా ఎందుకు పవన్ మిత్రుడే కదా. కూటమిలో ఉన్నారు కదా అంటే రాజకీయ లెక్కలు వేరేగా ఉంటాయి అని అంటున్నారు. బహుశా ఆ కారణాలతోనే ఇలా చేశారా అన్న డౌట్స్ వ్యక్తం చేసే వారు కూడా ఉన్నారుట.

విషయం అంతా అదేనా :

ఏపీ రాజకీయాల్లో మూడవ శక్తిగా జనసేన మెల్లగా ఎమెర్జ్ అవుతోంది. 2024లో కేవలం 21 సీట్లకు పరిమితం అయినా జనసేనాని వ్యూహాలు వేరేగా ఉన్నాయి. ఆ బలాన్ని వచ్చే ఎన్నికలకు ఇంతకు ఇంతా పెంచుకుని ఏదో నాటికి ఏపీలో అధికారం హస్తగతం చేసుకోవాలన్న సుదీర్ఘమైన ప్లాన్ అయితే జనసేన అధినాయకత్వం లో ఉంది చంద్రబాబు తరువాత టీడీపీలో చూస్తే లోకేష్ ఉన్నారు. కూటమికి ఎవరు నాయకత్వం వహించాలి అంటే అపుడు పోటీగా పవన్ వస్తారు అన్నది కూడా ఉండే ఉంటుంది అని అంటున్నారు. పవన్ ఇమేజ్ అంతా సినీ బలమే. రాజకీయంగా ఆయన ఇంకా తనదైన ముద్ర అయితే వేసుకోలేదు. కానీ టీడీపీ వైసీపీ అలా కాదు, వారికి రాజకీయంగా బలమైన ముద్ర ఉంది. అందుకే ఉంటే లోకేష్ అటు వైపు జగన్ ఉండాలి మధ్యలో మూడవ పార్టీ రేసులోకి రాకూడదు అన్న లెక్కలు అంచనాల మధ్యనే పవన్ కొత్త సినిమాను ప్రోత్సహించలేదా అన్నది చర్చగా ఉంది. ఈ అనుమానాల వెనక రాజకీయమే కారణం అంటున్నారు. ఏపీలో రాజకీయం ఎపుడూ రెండు పార్టీలు ఇద్దరు నాయకుల మధ్యనే సాగింది అవతల వైపు వైసీపీ ఉంది. జగన్ ఉన్నారు. అలా ఉండడం వల్ల టీడీపీకి పోయేది ఏమీ లేదు. కానీ కూటమిలో ఉంటూ ఇమేజ్ పెరిగితే మాత్రం పవన్ తో ప్రమాదమే అన్న ముందస్తూ ఆలోచనల వల్లనే యూఎస్ లో ఆయన మూవీని తొక్కేశారు అన్న చర్చ అయితే ఉంది. చూడాలి మరి అసలు విషయం ఏమిటో.