కూతుర్ని బాయ్ ఫ్రెండ్ కు అప్పజెప్పిన మాజీ బీజేపీ మహిళా నేత
తన కూతురికి జరిగిన దారుణం గురించి తండ్రి బయటకు చెప్పటం షాకింగ్ గా మారింది. దీనిపై పోలీసులు స్పందించి అనామిక శర్మ..
By: Tupaki Desk | 6 Jun 2025 10:23 AM ISTఇలాంటి ఘోరాల గురించి చెప్పేందుకు కూడా మనసు రాని దుస్థితి. వినేందుకు అరాచకంగా అనిపించే ఇలాంటి పని ఒక మహిళా నేత చేశారన్న సమాచారం షాక్ కు గురి చేస్తుంది. హరిద్వార్ లో వెలుగు చూసిన ఈ దారుణ రే*ప్ ఉదంతం సంచలనంగా మారింది. బీజేపీ మాజీ మహిళా నేత అనామిక శర్మకు సుమిత్ పట్వాల్ అనే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. తన కుమార్తెను రే*ప్ చేసేలా అతడ్ని.. అతడి స్నేహితుడ్ని ప్రోత్సహించిన వైనం వెలుగు చూసింది.
తన కూతురికి జరిగిన దారుణం గురించి తండ్రి బయటకు చెప్పటం షాకింగ్ గా మారింది. దీనిపై పోలీసులు స్పందించి అనామిక శర్మ.. ఆమె బాయ్ ఫ్రెండ్ తో పాటు.. అతడి స్నేహితుడిపైనా పోక్సోతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితురాలు.. ఆమె బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఒక హోటల్లో ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాయ్ ఫ్రెండ్ స్నేహితుడ్ని వేరుగా పోలీసులు అరెస్టు చేశారు.
ఈ ఏడాది జనవరి నుంచి మార్చి మధ్యలో బాధితురాలైన బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే.. బాలిక తండ్రిని చంపేస్తామని చెప్పటంతో ఈ విషయం కొంతకాలంగా బయటకు రాలేదు. హరిద్వార్.. ఆగ్రా.. బృందావన్‌లో బాలికపై అఘాయిత్యాలకు పాల్పడినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. భర్త నుంచి విడిపోయిన ఈ అనామిక శర్మ బాయ్ ఫ్రెండ్ తో ఉంటోంది. ఇదిలా ఉండగా.. గతంలో ఆమె హరిద్వార్ జిల్లా బీజేపీ మహిళా మోర్చాకే నాయకత్వం వహించారని.. గత ఏడాది ఆగస్టు నుంచి ఆమెను పార్టీ నుంచి తీసేసినట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. కూతుర్నిబాయ్ ఫ్రెండ్ కు అప్పజెప్పిన ఈ ఘోరం ఇప్పుడు షాకింగ్ గా మారింది.
