Begin typing your search above and press return to search.

లవర్‌తో అడ్డంగా దొరికిన భార్య.. నీకు నేవీ ఆఫీసర్ గతే పట్టుద్ది.. భర్తను బెదిరించిన భార్య, ప్రియుడు!

అందుకని మౌసం తన భార్యతో కలిసి గురుగ్రామ్‌లోని బసాయి ఎన్‌క్లేవ్‌లో ఉంటున్నాడు. మొదట్లో అంతా బాగానే సాగింది.

By:  Tupaki Desk   |   9 April 2025 11:13 AM IST
లవర్‌తో అడ్డంగా దొరికిన భార్య.. నీకు నేవీ ఆఫీసర్ గతే పట్టుద్ది.. భర్తను బెదిరించిన భార్య, ప్రియుడు!
X

ఈ మధ్య పెళ్లిళ్లు అవుతున్నాయి కానీ.. ఆ తర్వాత ప్రేమ వ్యవహారాలు మాత్రం ఆగడం లేదు. కొందరైతే మరీ దారుణంగా.. పెళ్లయ్యాక కూడా పాత ప్రేమను కొనసాగిస్తూ.. అడ్డు వచ్చిన భర్తలను సైతం చంపడానికి వెనుకాడట్లేదు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన రెండు దారుణాలు ఇంకా మర్చిపోకముందే.. ఇప్పుడు హర్యానాలో అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. తన ప్రియుడితో రాసలీలలు చేస్తూ భర్తకు దొరికిపోయిన భార్య.. ఏకంగా తన భర్తనే చంపేస్తామని బెదిరించింది. అసలు ఏం జరిగిందో తెలుసా?

గురుగ్రామ్‌లో ఒక క్యాబ్ డ్రైవర్‌కు తన భార్యకు మధ్య గొడవలు జరిగాయి. అసలు విషయం ఏంటంటే.. ఖర్మాన్ గ్రామానికి చెందిన మౌసం అనే అతను క్యాబ్ డ్రైవర్‌గా పనిచేసుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రెండేళ్ల కిందట అతనికి పంజాబ్‌కు చెందిన ఒక అమ్మాయితో పరిచయం అయింది. అది ప్రేమగా మారడంతో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కానీ వీళ్ల పెళ్లిని ఇరువైపుల వాళ్లు ఒప్పుకోలేదు.

అందుకని మౌసం తన భార్యతో కలిసి గురుగ్రామ్‌లోని బసాయి ఎన్‌క్లేవ్‌లో ఉంటున్నాడు. మొదట్లో అంతా బాగానే సాగింది. కానీ కొన్నాళ్లకు మౌసం భార్యకు వాళ్ల ఊరిలోని నవీన్ అనే వ్యక్తితో మళ్లీ పరిచయం ఏర్పడింది. అది కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది. రెండు రోజుల కిందట.. అంటే సోమవారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో మౌసం డ్యూటీ నుంచి ఇంటికి వచ్చాడు. కానీ ఇంట్లో అతని భార్య కనిపించలేదు.

దాంతో మౌసం తన భార్య ఎక్కడికి వెళ్లిందో అని వెతుక్కుంటూ టెర్రస్‌పైకి వెళ్లాడు. అక్కడ అతని భార్య నవీన్‌తో చాలా క్లోజ్‌గా ఉండటం చూశాడు. "ఇక్కడ ఏం చేస్తున్నారు?" అని అడిగాడు. అంతే నవీన్ రెచ్చిపోయాడు. తన దగ్గర ఉన్న గన్‌ తీసి మౌసం తలకు గురి పెట్టాడు. అంతేకాదు.. తుపాకీతో మౌసం తల మీద కొట్టాడు. "మా విషయంలో జోక్యం చేసుకుంటే.. మీరట్‌లోని నేవీ ఆఫీసర్‌కు పట్టిన గతే పడుతుంది. చంపి డ్రమ్‌లో పడేస్తాం" అని బెదిరించి అక్కడి నుంచి పారిపోయారు.

మౌసం భార్య, నవీన్ వెళ్లిపోయాక చుట్టుపక్కల వాళ్లు టెర్రస్‌పైకి వచ్చి మౌసంను కిందకు తీసుకొచ్చారు. వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. మౌసం కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని అతని భార్యను, నవీన్‌ను పట్టుకోవడానికి గాలిస్తున్నారు.