Begin typing your search above and press return to search.

ప్రపంచంలోనే సంతోషకర దేశం ఫిన్ ల్యాండ్.. భారత్ స్థానం ఏంటో తెలుసా?

మనిషి సంతోషంగా జీవించాలని అనుకుంటాడు. అందుకనుగుణంగా తన జీవన విధానం ఏర్పాటు చేసుకుంటాడు.

By:  Tupaki Desk   |   20 March 2024 6:20 AM GMT
ప్రపంచంలోనే సంతోషకర దేశం ఫిన్ ల్యాండ్.. భారత్ స్థానం ఏంటో తెలుసా?
X

మనిషి సంతోషంగా జీవించాలని అనుకుంటాడు. అందుకనుగుణంగా తన జీవన విధానం ఏర్పాటు చేసుకుంటాడు. ఈనేపథ్యంలో రోజు తన దైనందిన జీవితం సుఖంగా ఉండాలని కోరుకుంటాడు. ఈక్రమంలో ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా ఫిన్ ల్యాండ్ గుర్తింపు పొందింది. వరసగా ఏడో సంవత్సరం కూడా టాప్ లో నిలిచి ఆశ్చర్యపరుస్తోంది. మరి ఆ దేశంలో ఎందుకు సంతోషంగా ఉంటారో తెలుసుంటే మనం కూడా అదే బాటలో పయనించవచ్చు కదా అనుకోవడం మామూలే.

డెన్మార్క్, ఐస్ ల్యాండ్, స్వీడన్, ఇజ్రాయెల్ దేశాలు టాప్ 5లో నిలిచాయి. అఫ్గనిస్తాన్ మాత్రం చివరన నిలిచింది. 143వ స్థానానికి పడిపోయింది. ఆస్ట్రేలియా 10, యూకే 20, అమెరికా 23, జర్మనీ 24, చైనా 64, రష్యా 70వ స్థానాల్లో ఉన్నాయి. మనదేశం 126వ ర్యాంకును కలిగి ఉంది. పాకిస్థాన్ 108వ స్థానాన్ని ఆక్రమించింది. ఇలా పలు దేశాలు వాటి సమర్థతను చాటాయి.

ఫిన్ ల్యాండ్ ఎందుకు సంతోషకర దేశంగా మారిందంటే దేశ తలసరి ఆదాయం, సామాజిక మద్దతు, స్వేచ్ఛ, సమానత్వం వంటి అంశాలు ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. అమెరికా, జర్మనీ లాంటి దేశాలు 20 స్థానాల కంటే కిందకు పడిపోయాయి. కోస్టారికా, కువైట్ దేశాలు టాప్ 20లోకి వచ్చాయి. అఫ్గనిస్తాన్, లెబనాన్, జోర్డాన్ ప్రజలు సంతోషాన్ని కోల్పోయినట్లు తెలుస్తోంది.

ఫిన్ ల్యాండ్ ప్రజలు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండటానికి వారి పనులే కారణంగా చెబుతున్నారు. జీవితంలో ఎలా విజయం సాధించాలనే విషయాలపై వారికి అవగాహన ఎక్కువ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో 30 ఏళ్ల కంటే తక్కువ వయసు వారిలో సంతోషం తగ్గినట్లు తేలింది. 143 దేశాలపై జరిపిన పరిశోధనలో ఈ విషయాలు తెలిశాయి.

సంతోషకర స్థాయిలో అసమానత ఐరోపాలో మినహా ప్రపంచ వ్యాప్తంగా పెరిగిందని తేలింది. ఇది ఆందోళనకరంగా మారుతోంది. తూర్పు ఐరోపాలో అన్ని వయసుల వారిలో సంతోషం పెరిగింది. పశ్చిమ ఐరోపాలో ఒకే రకమైన ఆనంద స్థాయిలను అనుభవిస్తున్నట్లు తెలుస్తోంది. పెద్ద వారితో పోలిస్తే తక్కువ వయసు వారే సంతోషంగా ఉన్నట్లు చెబుతున్నారు.