Begin typing your search above and press return to search.

ఏ క్షణమైనా నన్ను కాల్చేయొచ్చు... గుండెలుమెలిపెట్టే మెసేజ్!

ఇజ్రాయెల్ – హమాస్ భీకర యుధ్దం తీవ్ర విషాదాన్ని మిగులుస్తోంది. హృదయాల్ని మెలిపెట్టే ఘటనలు ఎనో వెలుగు చూస్తున్నాయి

By:  Tupaki Desk   |   12 Oct 2023 5:30 PM GMT
ఏ క్షణమైనా నన్ను కాల్చేయొచ్చు... గుండెలుమెలిపెట్టే మెసేజ్!
X

ఇజ్రాయెల్ – హమాస్ భీకర యుధ్దం తీవ్ర విషాదాన్ని మిగులుస్తోంది. హృదయాల్ని మెలిపెట్టే ఘటనలు ఎనో వెలుగు చూస్తున్నాయి. వెలుగులోకి వస్తోన్న ఒక్కో విషాదం గుండెల్ని పిండేస్తున్నాయి. మానవత్వం దాదాపు కనుమరుగైపోయిన రోజుల్లో ఉన్నామనే సంకేతాలను ఈ యుద్ధం ఇస్తుందనిపిస్తుంది. ఈ సమయంలో ఇజ్రాయేల్ కు చేందిన ఒక యువ సైనికురాలు తన కుటుంబ సభ్యులకు పంపిన మెజేస్ ఇప్పుడు చాలా మందితో కంటతడి పెట్టిస్తోంది.

అవును... ఇజ్రాయెల్‌ పౌరులపై హమాస్‌ ఉగ్రవాదులు జరిపిన దాడులు మిగిల్చిన గుండెలను పిండేసే సంఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో హమాస్‌ మూకలు అమాయకుల పట్ల పాశవికంగా ప్రవర్తించిన తీరు యావత్‌ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఈ సమయంలో తన ప్రజలను కాపాడేందుకు హమాస్ ముష్కరులతో పోరాడిన ఓ ఇజ్రాయెలీ సైనికురాలు రక్తమోడుతూ ఉండగా కుటుంబానికి పంపిన ఓ మెసేజ్ ను స్థానిక మీడియా ప్రచురించింది.

ఉగ్రవాదులు చుట్టూ ఉండగా.. అప్పటికే తలకు బుల్లెట్ గాయమైన ఆ ఇజ్రాయెలీ సైనికురాలు తన చివరి క్షణాలను కుటుంబ సభ్యులతో పంచుకోవాలని భావించింది. ఇందులో భాగంగా... "నా మీద కాల్పులు జరిగాయి.. మీ గురించి చాలా బాధపడుతున్నాను.. నా తలకు తీవ్ర గాయమైంది" అని మెసేజ్ చేసింది. కాసేపటి తర్వాత మరో మెసేజ్ ను కూడా ఆమె నుంచి ఇచ్చింది.

"ఉగ్రదాడిలో నా తలకు తీవ్ర గాయాలయ్యాయి. అయినా తప్పించుకుని వారి కంటపడకుండా గోలాని బ్రిగేడ్‌ ప్రాంతంలో దాక్కొని మీకు ఈ మెసేజ్‌ పంపుతున్నాను. తీవ్రంగా గాయపడ్డ ఒక సైనికుడు కూడా నాతో ఉన్నాడు. నాకు కొంత దూరంలో ఓ ఉగ్రవాది పౌరుడిని హత్య చేస్తున్నాడు. నాకు సమీపంలోనే మరో ఉగ్రవాది తిరుగుతున్నాడు.. అతడు నాపై కాల్పులు జరపవచ్చు" అని ఆమె వెల్లడించారు.

ఆ తర్వాత ఆమె ఫోన్ మూగబోయింది.. ఆమె నుంచి మరో మెసేజ్ రాలేదు.. ఆ తరువాత తీవ్రంగా గాయపడిన అమెను బ్రెజిలై మెడికల్ సెంటర్‌ లో ఆసుపత్రిలో చేర్చారని తెలుస్తుంది. అయినప్పటికీ ఫలితం లేదని అంటున్నారు. ఈ సమయంలో... తన మేనకోడలు ప్రాణాలు కోల్పోయిన్నట్లు భావిస్తున్నామని సైనికురాలి అత్తయ్య ఇలుక్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా... ఇజ్రాయెల్ సైన్యంలోని 77వ బెటాలియన్‌ లో సైనికురాలిగా పనిచేస్తున్న 19 ఏళ్ల కార్పొరల్ నామా బోని.. ఏడు నెలల క్రితమే అక్కడి సైన్యంలో చేరిందని తెలుస్తుంది. ఈ క్రమంలో ఒక వారం క్రితం ఆమె పుట్టిన రోజును జరుపుకున్నట్లు తెలుస్తుంది. ఆమె త్వరలో వస్తుందని కోరుకున్న కుటుంబ సభ్యులకు చివరకు విషాదమే మిగిలింది.