Begin typing your search above and press return to search.

వైరల్... లష్కరే గురించి షాకింగ్ విషయాలు చెప్పిన మాజీ ఉగ్రవాది!

భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, లష్కరే తోయిబా సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్ గురించి.. ఆ సంస్థ మాజీ ఉగ్రవాది, హఫీజ్ కు గార్డుగా పనిచేసిన నూర్ దహ్రీ "ఎక్స్" వేదికగా కీలక విషయాలు వెల్లడించారు.

By:  Tupaki Desk   |   10 May 2025 2:36 PM IST
Former LeT Militant Exposes Hafiz Saeed’s Deadly Secrets
X

లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ, ఆ సంస్థ అధిపతి హఫీజ్ సయీద్ గురించి షాకింగ్ విషయాలు చెప్పారు ఆ సంస్థలో పనిచేసిన మాజీ ఉగ్రవాది. ఇతడు నేరుగా లష్కరే తోయిబా చీఫ్ కు గార్డుగా పని చేశాడు. ఈ సందర్భంగా ఆ సంస్థ గురించి, ఆ సంస్థ చీఫ్ గురించి, వారితో తనకున్న చేదు అనుభవం గురించి, వారు చేస్తోన్న అకృత్యాల గురించి షాకింగ్ విషయాలు తెలిపారు.

అవును... భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, లష్కరే తోయిబా సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్ గురించి.. ఆ సంస్థ మాజీ ఉగ్రవాది, హఫీజ్ కు గార్డుగా పనిచేసిన నూర్ దహ్రీ "ఎక్స్" వేదికగా కీలక విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా... వేలాదిమంది పాకిస్థానీ పౌరుల మరణాల వెనుక హఫీజ్ సయీద్ హస్తం ఉందని చెబుతూ.. ఆ సంస్థను "డెత్ కల్ట్"గా అభివర్ణించారు.

ప్రస్తుతం సుమారు 10 లక్షల వరకూ మిలిటెంట్లు లష్కరే తోయిబా సంస్థలో ఉన్నారని చెప్పిన నూర్.. రాజకీయ ప్రయోజనాల కోసం హఫీజ్ వేలాదిమంది అమాయకుల్ని పొట్టనబెట్టుకున్నాడని ఆరోపించారు! ఈ నేపథ్యంలో ఆ డెత్ కల్ట్ నుంచి తాను వైదొలగాలని నిర్ణయించుకున్నప్పుడు తనను లష్కరే కమాండర్లు 'పిరికివాడు'గా పేర్కొన్నారని అన్నారు.

ఇదే సమయంలో... లష్కరే తోయిబా మాజీ సభ్యుడిగా తనకు ఎదురైన కష్టాలను వ్యక్తపరుస్తూ... తన దివంగత తల్లి కోరిక మేరకు తాను డాక్టర్ కావాలని అనుకున్నానని.. అయితే, హఫీజ్ సయీద్ ప్రభావంతో తన ఆశయాల్ని నెరవేర్చుకోలేకపోయానని చెప్పారు. యూనివర్శిటీలో చదువుకోవాల్సిన తనను హఫీజ్ తన ప్రభావంతో లష్కరేలో చేరాలని ఎంచుకున్నాడని తెలిపారు.

ఆ సమయంలో సయీద్ శాస్వత నివాసం, ప్రధాన కార్యాలయంగా ఉన్న మురిడ్కేలో అతడిని తాను కాపలాగా ఉండే బాధ్యత చేపట్టానని చెప్పిన నూర్... అప్పుడు అతడు బ్లూ కలర్ టయోటా విగో పికప్ డాట్సన్ లో ప్రయాణించేవాడని తెలిపారు. ఆ కారు వెనుక భాగంగాలో అతడు నిద్రించేందుకు సౌకర్యంగా ఉండేలా ఆల్ట్రేషన్ చేశారని వెల్లడించరు.

ఇక.. హఫీజ్ ప్రసంగాలకు ప్రేరణ పొందిన చాలా మంది యువకులు లష్కరే లో చేరారని.. ట్రైనింగ్ తర్వాత ఆ యువకులు భారత్ లోని కాశ్మీర్, ఆఫ్హనిస్తాన్ కు వెళ్లారని.. అయితే, ఆ ప్రాంతాలకు పంపబడిన చాలా మంది యువకులు తిరిగి రాలేదని నూర్ నొక్కి చెప్పారు. ఈ సమయంలో... నా జీవితంలో హఫీజ్ అవమానకర ముగింపు చూడాలనుకుంటున్నట్లు నూర్ పేర్కొన్నారు.