Begin typing your search above and press return to search.

విశాఖ గ్రేట‌ర్‌పై.. కూట‌మి ప‌ట్టు.. 27 టార్గెట్‌!

మ‌రోవైపు.. విశాఖ న‌గ‌ర పాలక సంస్థ మేయ‌ర్ మేయ‌ర్‌పై కూట‌మి అవిశ్వాసం ప్ర‌క‌టించాయి. దీనికి సంబంధించి విశాఖ క‌లెక్ట‌ర్ నోటిఫికేష‌న్ కూడా ఇచ్చారు.

By:  Tupaki Desk   |   13 April 2025 3:32 PM IST
విశాఖ గ్రేట‌ర్‌పై.. కూట‌మి ప‌ట్టు.. 27 టార్గెట్‌!
X

గ్రేట‌ర్ విశాఖ ప‌ట్నం మునిసిప‌ల్ కార్పొరేష‌న్ పై ప‌ట్టు పెంచుకునే దిశ‌గా కూట‌మిపార్టీలు అడుగులు వ‌డి వ‌డిగా వేస్తున్నాయి. గ‌త 2021లో జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లో వైసీపీ ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకుంది. అప్ప ట్లో వైసీపీ నేత‌.. అప్ప‌టి రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి చ‌క్రం తిప్పారు. పాద‌యాత్ర తో వైసీపీ విజ‌యానికి కార‌ణ‌మ‌య్యారు. ఈ క్ర‌మంలోనే బ‌ల‌మైన టీడీపీ కంచుకోట‌లో కూడా వైసీపీ పాగా వేసేలా చేశారు.

అయితే.. కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. స్థానిక సంస్థ‌ల‌పై దృష్టి పెట్టిన నేప‌థ్యంలో కొన్ని మునిసిపాలిటీల‌ను కూడా ద‌క్కించుకుంది. ఈ క్ర‌మంలో విశాఖ‌ప‌ట్నం న‌గ‌ర పాల‌క సంస్థ‌ను కూడా ద‌క్కించుకునేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంది. దీంతో వైసీపీ నుంచి వ‌చ్చే వారికి రెడ్ కార్పెట్ ప‌రిచింది. ఇలా... ఇప్ప‌టి వ‌ర‌కు 70 మంది కార్పొరేట‌ర్ల మ‌ద్ద‌తు కూట‌మికి ద‌క్కింది.

మ‌రోవైపు.. విశాఖ న‌గ‌ర పాలక సంస్థ మేయ‌ర్ మేయ‌ర్‌పై కూట‌మి అవిశ్వాసం ప్ర‌క‌టించాయి. దీనికి సంబంధించి విశాఖ క‌లెక్ట‌ర్ నోటిఫికేష‌న్ కూడా ఇచ్చారు. ఈ నెల 27వ తేదీని గ‌డువుగా విధించారు. దీంతో అటు కూట‌మి, ఇటు వైసీపీ కూడా.. త‌మ త‌మ కార్పొరేట‌ర్ల‌ను కాపాడుకునే ప్ర‌య‌త్నం చేశాయి. అయిన‌ప్ప‌టికీ.. కొందరు వైసీపీకార్పొరేట‌ర్లు.. అధిష్టానానికి చెప్ప‌కుండానే ఫిరాయింపులు చేస్తున్నారు. దీంతో ఇప్పుడు కూట‌మికి 70 మంది మ‌ద్ద‌తు చేకూరిన‌ట్టు అయింది.

మ‌రో న‌లుగురు కార్పొరేట‌ర్లు వ‌స్తే.. అవిశ్వాసం పాస్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని నాయ‌కులు చెబుతున్నా రు. ఇదిలావుంటే.. విశాఖ‌లో ఎందుకు ఇలా చేస్తున్నార‌న్న సందేహం రావొచ్చు. విశాఖ‌ను కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. ఇక్క‌డ అనేక అభివృద్ధి ప‌నులు చేప‌ట్టాల్సి ఉంది. ఈ నేప‌థ్యంలో వైసీపీ నేతృత్వంలోని కార్పొరేష‌న్ స‌హ‌క‌రించ‌డం లేద‌ని అధికారులు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే మేయ‌ర్‌పై అవిశ్వాసం ప్ర‌క‌టించారు. దీనికి సంబంధించిన ఎన్నిక ఈ నెల 27న జ‌ర‌గ‌నుంది.