Begin typing your search above and press return to search.

వైసీపీ మేనిఫెస్టోపై బీజేపీ నేత ఆసక్తికర వ్యాఖ్యలు!

ఈ నేపథ్యంలో బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు స్పందించారు. వైసీపీ మేనిఫెస్టోపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా జగన్ మేనిఫెస్టోకు క్రెడిబిలిటీ రావడానికి గల కారణాన్ని విశ్లేషించారు.

By:  Tupaki Desk   |   1 May 2024 6:26 AM GMT
వైసీపీ మేనిఫెస్టోపై బీజేపీ నేత ఆసక్తికర  వ్యాఖ్యలు!
X

వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఇటీవల 2024 ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో సుమారు 99% అమలుచేసినట్లు చెప్పిన జగన్... ఆ సంక్షేమ పథకాలను మరింత మెరుగుపరిచి, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వీలైనంత త్వరగా పూర్తిచేస్తామని తెలిపారు.

మరోపక్క... బీజేపీ పాత్ర లేకుండానే టీడీపీ - జనసేన పార్టీలు ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు స్పందించారు. వైసీపీ మేనిఫెస్టోపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా జగన్ మేనిఫెస్టోకు క్రెడిబిలిటీ రావడానికి గల కారణాన్ని విశ్లేషించారు.

ఇందులో భాగంగా... సీఎం జగన్ మేనిఫెస్టో స్టేటస్కోలా ఉండడంతో క్రెడిబిలిటీ వచ్చిందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ అన్నారు. ఇదే క్రమంలో... సీఎం జగన్ ఉండాలా..? లేదా..? అనే ఫ్యాక్టర్‌ పైనే ఏపీ ఎన్నికలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ఇదే క్రమంలో... ఏపీ, తెలంగాణల్లో జరగనున్న ఎన్నికల ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ క్రమంలో... ఏపీలో ఎన్డీయేకు 110 కి పైగా అసెంబ్లీ, 18-20 లోక్ సభ స్థానాలు వస్తాయని తమ పార్టీ అంతర్గత సర్వేలో తేలిందని చెప్పిన జీవీఎల్ నరసింహారావు... తెలంగాణలో బీజేపీకి 9-10 ఎంపీ సీట్లు వస్తాయని చెప్పారు. ఇదే క్రమంలో... దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ బలంగా ఉందని, గతంలో కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుందని చెప్పుకొచ్చారు.

ఇక ప్రత్యేకంగా ఏపీలో బీజేపీ గెలిచే స్థానాలపైనా స్పందించిన జీవీఎల్... ఏపీలో బీజేపీ 5 ఎంపీ, 5 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుస్తుందని జోస్యం చెప్పారు. ఇదే క్రమంలో... గాజు గ్లాసు స్వతంత్రులకు కేటాయించటంతో కొంత గందరగోళం నెలకొందని తెలిపారు. జనసేన పోటీలో ఉన్న చోటే గాజు గ్లాసు గుర్తు అనే విషయం ఈసీ నిబంధనల ప్రకారమే తీసుకున్న నిర్ణయంగా జీవీఎల్ తెలిపారు!