Begin typing your search above and press return to search.

పొత్తుల మీద లెటెస్ట్ డెసిషన్ అంటే అదేనా జీవీఎల్...!?

ఏపీ రాజకీయాలు వేడెక్కి ఉన్న వేళ అంతా సర్దుకుంటున్న వేళ బీజేపీ గొంతు సవరిస్తోంది. ఏపీలో పొత్తుల మీద లేట్ కావచ్చు కానీ లేటెస్ట్ గా డెసిషన్ ఉంటుంది అన్నదే ఇపుడు బీజేపీ మాట.

By:  Tupaki Desk   |   24 Dec 2023 3:30 PM GMT
పొత్తుల మీద లెటెస్ట్ డెసిషన్ అంటే అదేనా జీవీఎల్...!?
X

ఏపీ రాజకీయాలు వేడెక్కి ఉన్న వేళ అంతా సర్దుకుంటున్న వేళ బీజేపీ గొంతు సవరిస్తోంది. ఏపీలో పొత్తుల మీద లేట్ కావచ్చు కానీ లేటెస్ట్ గా డెసిషన్ ఉంటుంది అన్నదే ఇపుడు బీజేపీ మాట. ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మీడియాతో మాట్లాడుతూ ఏపీలో పొత్తుల మీద కేంద్రం సరైన టైం లో నిర్ణయం తీసుకుంటుంది అని అంటున్నారు.

అయితే కాస్తా లేట్ కావచ్చేమో కానీ లేటెస్ట్ గానే డెసిషన్ అని ఊరిస్తున్నరు. మరి ఆ లేటెస్ట్ డెసిషన్ ఏంటి అన్నది ఆయన వివరించలేదు, అయితే తమతో పొత్తులో ఉన్న జనసేన వెళ్ళి టీడీపీతో పొత్తు పెట్టుకోవడమే కాదు సీట్లను కూడా సెలెక్ట్ చేసుకుంటోంది. వరస సమీక్షలు పెట్టి మరీ పవన్ కళ్యాణ్ ఎక్కడికక్కడ అభ్యర్థులను డిసైడ్ చేసే పనిలో పడ్డారు.

ఇక చంద్రబాబు పవన్ కలసి యువగళం ముగింపు సభలో పాలుపంచుకున్నారు. ఈ సభ తరువాత మరిన్ని సభలు ఏపీలో వివిధ ప్రాంతాలలో నిర్వహించాలని కూడా నిర్ణయించారు. అంతే కాదు ఉమ్మడి ఎన్నికల ప్రణాళిక అంటున్నారు. ఇలా టీడీపీ జనసేన ముందుకు వెళ్తూంటే బీజేపీ మాత్రం ఏపీ రాజకీయాల మీద ఫోకస్ పెట్టడంలేదు అని అంటున్నారు.

అదే సమయంలో లేట్ అవుతునంది అని ఎంపీ హింట్ ఇస్తున్నారు. అయినా లేటెస్ట్ గానే ఉంటుందని కూడా చెబుతున్నారు. ఆ లేటెస్ట్ డెసిషన్ ఏంటో అంటున్నారు. అంటే చివరి నిముషంలో వచ్చి టీడీపీ బీజేపీ కూటమిలో కలుస్తారా అన్నదే చర్చగా ఉంది. ఏపీ బీజేపీకి అంతకంటే ఆప్షన్ లేదు అని అంటున్నారు. లేకపోతే ఒంటరిగా పోటీ చేయడమే మిగిలింది అని అంటున్నారు.

ఇక బీజేపీ తీరు ఇలా ఉంటే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వెళ్ళి చంద్రబాబుని కలిశారు ఈ ఇద్దరు మధ్య మూడు గంటలకు పైగా చర్చ సాగింది. దీంతో దీని మీద కూడా ఏపీ రాజకీయ పార్టీలు భిన్నంగా రియాక్ట్ అవుతున్నాయి. జీవీఎల్ దీని మీద మాట్లాడుతూ వారి మధ్య ఏమి జరిగింది అన్నది వారిద్దరు చెబితేనే బాగుంటుందని తాను ఏమి చెప్పగలను అంటూ మాట్లాడారు.

అంటే ఆ భేటీ ఆంతర్యం తెలిసినా బీజేపీ పొలిటికల్ కామెంట్స్ చేయకుండా జాగ్రత్త పడింది అనుకోవాలి. అంటే బీజేపీకి టీడీపీ మీద ఏమైనా సాఫ్ట్ కార్నర్ ఉందా అన్న చర్చ కూడా వస్తోంది. ఇక ఆ సమావేశం చంద్రబాబు పీకేల వ్యక్తిగతం అని అంటున్నారు

విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి తానే పార్లమెంట్ లో మాట్లాడుతున్నాను అని కూడా జీవీఎల్ అంటున్నారు. విశాఖ ప్లాంట్ ప్రైవేట్ పరం కాదు అని ఆయన చెబుతున్నా కేంద్రం నుంచి మాత్రం అధికారిక ప్రకటన అయితే రావడంలేదు. మొత్తానికి చూస్తే మాత్రం జీవీఎల్ లేటెస్ట్ గానే ఏపీలో పొత్తులు అంటున్న మాట వెనక మతలబు ఏంటి అన్నది హాట్ టాపిక్ గా ఉంది. అంటే ఏపీలో జనసేన బీజేపీ కలసి ముందుకు వస్తాయా అన్నది కూడా చర్చగా ఉంది.