Begin typing your search above and press return to search.

పరాకాష్ఠ: కెనడాను వదిలి వెళ్లండంటూ హిందువులకు వార్నింగ్

ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా ఒక అభివృద్ధి చెందిన దేశం ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న వైనం షాకింగ్ గా మారింది

By:  Tupaki Desk   |   21 Sep 2023 4:27 AM GMT
పరాకాష్ఠ: కెనడాను వదిలి వెళ్లండంటూ హిందువులకు వార్నింగ్
X

ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా ఒక అభివృద్ధి చెందిన దేశం ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న వైనం షాకింగ్ గా మారింది. చాటుమాటు వ్యవహారంగా సాగే తీరుకు భిన్నంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఒక ఎత్తు అయితే.. ఇలాంటి తీరును ఖండించాల్సిన దేశాలు వేచి చూసే ధోరణిని అనుసరించటం గమనార్హం. ఖలిస్థాన్ అనుకూల నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు గురి కావటం.. అదంతా భారత్ ఏజెంట్లు చేసిన పని అంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు చేయటం తెలిసిందే. ఇరు దేశాల దౌత్య అధికారుల్నిబహిష్కరించిన వైనం ఒక ఎత్తు అయితే.. కెనడాలోని హిందువులు.. హిందూ మూలాలు ఉన్న వారంతా దేశం విడిచి వెళ్లిపోవాలంటూ సిక్కు ఉగ్ర సంస్థ (ఈ సంస్థను భారత్ బ్యాన్ చేసింది) ప్రతినిధి వార్నింగ్ ఇస్తూ వీడియోను విడుదల చేయటం షాకింగ్ గా మారింది.

''మీరు భారత్ కు మద్దతు ఇస్తున్నారు. ఖలిస్థాన్ అనుుకూల సిక్కుల మాటలు.. వ్యక్తీకరణ అణిచివేతకు మద్దతు ఇస్తున్నారు. ఇండో -హిందువులంతా కెనడాను విడిచి పెట్టండి'' అంటూ సిక్కుస్ ఫర్ జస్టిస్ సంస్థకు చెందిన లీగల్ సెల్ కౌన్సెల్ న్యాయవాది గురుపత్వంత్ పన్నూన్ ఒక వీడియోను విడుదల చేయటం సంచలనంగా మారింది.ఈ సంస్థను 2019లోనే భారత్ బ్యాన్ చేసింది. అంతేకాదు.. తాజా ప్రకటన చేసిన పన్నూన్ ను సైతం గతంలోనే భారత్ ఉగ్రవాదిగా ప్రకటించింది.

ఈ వార్నింగ్ పై మౌనం వహిస్తూ ఉండటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ఒక ఖలిస్తానీ హిందువులను బెదిరిస్తే అందరూ కళ్లు మూసుకొని మరోలా చూస్తున్నారని.. అదే ఒక శ్వేతజాతి అధిపత్యవాది బెదిరించి ఉంటే.. అల్లర్లు ఏ రీతిలో ఉండేవో ఊహించుకోవాలని కామెంటేటర్ రూపా సుబ్రమణ్య స్పందించారు. మొత్తంగా చూస్తే.. ఉగ్రవాద మూలాలు ఉన్న వారంతా ఇలాంటి వార్నింగ్ లు ఇచ్చేసే వరకు వెళ్లారంటే వారి బరితెగింపు ఎంత ఎక్కువగా ఉందో అర్థమవుతుందని చెప్పాలి.