గుంటూరు వెస్ట్‌లో కలెక్షన్ కింగ్‌లు.. !
రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే గల్లా మాధవి భర్త.. కొందరి భూములను కబ్జా చేశారని.. ఇతర రియల్ ఎస్టేట్‌వ్యాపారులకు అనుమతులు రాకుండా అడ్డుకుంటున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
By: Tupaki Desk | 27 April 2025 12:30 PMగుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో ఏ పనికావాలన్నా.. చేతులు తడపాల్సిందేనా? .. ఎవరు పని చేయించు కోవాలన్నా.. డబ్బులు ఇవ్వాల్సిందేనా? అంటే.. టీడీపీ నాయకులే ఔనని చెబుతున్నారు. ఇక్కడ కలెక్షన్ కింగ్‌లు పెరిగిపోయినట్టు గత రెండు మాసాలుగా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. పైకి మాత్రం ఏమీ ఉండదు. ఎవరూ కనిపించరు. కానీ.. జరగాల్సిన అవినీతి మాత్రం జరుగుతోందని చెబుతున్నారు.
గత ఎన్నికల్లో గల్లా మాధవి ఇక్కడ నుంచి తొలిసారి విజయం దక్కించుకున్నారు. ఆమె తొలి నాలుగు మాసాలు ఉదయాన్నే లేచి తన స్కూటీపై నియోజకవర్గంలో ఒంటరిగా తిరుగుతూ.. సమస్యలు పరిష్క రించేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో ఆమెకు మంచి పేరు వచ్చింది. కానీ.. తర్వాత తర్వాత.. తీరు మారిందని కూటమిలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అమరావతి రాజధాని పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే.
దీంతో అనేక సంస్థలు.. ఒక్క అమరావతిలోనే కాకుండా.. గుంటూరులోని పలు ప్రాంతాల్లో సంస్థలను ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు వస్తున్నాయి. కానీ, గుంటూరు వెస్ట్‌లో పెట్టాలంటే.. మాత్రం భయ పడుతున్న పరిస్థితి వచ్చిందని టాక్. ఈ విషయంపై మంత్రి నారా లోకేష్‌కు కూడా ఫిర్యాదులు అందాయ ని చెబుతున్నారు. వీటిని ఆయన వ్యక్తిగతంగా తీసుకుని.. ఎమ్మెల్యేను హెచ్చరించారని పార్టీ నాయకులు చెబుతున్నారు.
ఇదిలావుంటే.. ఎమ్మెల్యే భర్త రాజకీయాలపై అనుకూల మీడియాలోనే పుంఖాను పుంఖాలుగా కథనాలు వస్తున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే గల్లా మాధవి భర్త.. కొందరి భూములను కబ్జా చేశారని.. ఇతర రియల్ ఎస్టేట్‌వ్యాపారులకు అనుమతులు రాకుండా అడ్డుకుంటున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇక, ఇప్పుడు.. ఏపని చేయాలన్నా.. చేతులు తడపకుండా పనులు కావడం లేదని అంటున్నారు. మొత్తంగా చూస్తే.. గుంటూరు వెస్ట్.. వరెస్ట్‌గా మారుతోందని స్థానిక నేతలే చెబుతున్నారు.