గుంటూరు.. మంటెత్తుతున్న పాలిటిక్స్ ..!
గుంటూరు రాజకీయాలు ఘాటెక్కాయి. ఒకరకంగా చెప్పాలంటే.. గుంటూరు మిర్చిని తలపిస్తున్నాయి. ఎం డాకాలం.. అందునా పోటెత్తుతున్న ఎండలకు తోడు ఈరాజకీయాల వేడి.. గుంటూరు జిల్లాను కుదిపేస్తోం ది. ఒకరంటే ఒకరికి పడడం లేదు.
By: Tupaki Desk | 23 April 2025 9:00 PM ISTగుంటూరు రాజకీయాలు ఘాటెక్కాయి. ఒకరకంగా చెప్పాలంటే.. గుంటూరు మిర్చిని తలపిస్తున్నాయి. ఎం డాకాలం.. అందునా పోటెత్తుతున్న ఎండలకు తోడు ఈరాజకీయాల వేడి.. గుంటూరు జిల్లాను కుదిపేస్తోం ది. ఒకరంటే ఒకరికి పడడం లేదు. ఒకరంటే.. ఒకరు ఆమడ దూరం. ఇదీ.. గుంటూరు రాజకీయాల పరిస్థి తి. గుంటూరు పరిధిలో మంగళగిరిని పక్కన పెడితే.. తెనాలి, గుంటూరు వెస్ట్, ఈస్ట్ సహా.. ఇతర నియోజక వర్గాల్లో టీడీపీ, జనసేనలు విజయం దక్కించుకున్నాయి.
అయితే.. కలసి ఉంటే కలదు సుఖం అన్న సూత్రాన్ని పక్కన పెట్టిన నాయకులు.. ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట. ముఖ్యంగా కేంద్ర మంత్రి, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌పై మెజారిటీ ఎమ్మెల్యేలు గుస్సాగా ఉన్నారు. పోనీ.. వారైనా కలిసి ఉన్నారా? అంటే.. లేదు. ఎక్కడ కలుసుకుంటే.. వారి వారి లోపాలు బయటకు వస్తాయోనని.. నాయకులు భావిస్తున్నారు. గుంటూరు ఈస్ట్, వెస్ట్‌లలో కొత్త నాయకులు విజయం దక్కించుకున్నారు.
ఇక, తెనాలిలో జనసేన గెలుపు గుర్రం ఎక్కింది. ఒకరకంగా అందరూ కూటమి పార్టీ నాయకులే. కానీ, ఒకరి తో ఒకరు మాట్లాడరు. ఒకరి వ్యవహారాల్లో ఒకరు తలదూర్చరు. అయితే.. ఇది మంచిదే కదా? అనే చర్చ ఉంది. కానీ, అసలు విషయం ఎవరు ఎవరినియోజకవర్గంలో వేలు పెడితే.. వారి వారి లోపాలు బయటకు వస్తున్నాయన్న బెంగ ఉంది. దీంతో కొన్ని రోజులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నా.. తర్వాత.. సర్దుకు పోయారు.
కానీ, ప్రజలను గుర్తించే విషయంలో మాత్రం.. ఎవరికి వారే అన్నట్టుగా దూరంగా ఉంటున్నారు. తెనాలిలో నే ఉంటున్నా.. మంత్రిని కలుసుకునేందుకు ప్రజలకు అవకాశం ఉండదు. ఇక, గుంటూరు వెస్ట్‌లో గల్లా మాధవి.. తాను చెప్పిందే వినాలనే టైపు. అంతేకాదు.. నియోజకవర్గంలో పర్యటిస్తున్నారన్న పేరే కానీ.. సమస్యలు పరిష్కరించలేక పోతున్నారట. అదేసమయంలో వెస్ట్ లో ఇప్పటికీ తాగునీటి సమస్య ఉంది. కానీ, ఇక్కడ ఎమ్మెల్యే వారికి ఆ సమస్య పరిష్కరించేందుకు సమయం చిక్కడం లేదట. మొత్తంగా చూస్తే.. గుంటూరు రాజకీయాలు.. ఘాటుగా సాగుతున్నాయి.
