Begin typing your search above and press return to search.

గుమ్మలూరికి గుంతకల్లు రెడ్ సిగ్నల్...!

దాంతో కర్నూల్ జిల్లాను దాటి అనంతపురంలోని గుంతకల్లులో మాజీ మంత్రిని పోటీ చేయించాలని చూస్తోంది. ఈ సీటు గుమ్మలూరుకి ఇస్తున్నారు అని ప్రచారం మొదలవగానే అక్కడ టీడీపీలో మంటలు రేగుతున్నాయి.

By:  Tupaki Desk   |   6 March 2024 1:53 PM GMT
గుమ్మలూరికి గుంతకల్లు రెడ్ సిగ్నల్...!
X

వైసీపీకి గుడ్ బై కొట్టి టీడీపీలో చేరి పక్క జిల్లాలో టికెట్ సంపాదించుకున్న మాజీ మంత్రి గుమ్మలూరి జయరాం కి గుంతకల్లు రెడ్ సిగ్నల్ చూపిస్తోంది. ఆయనది కర్నూల్ జిల్లా ఆలూరు నుంచి 2014, 2019లలో రెండు సార్లు వైసీపీ నుంచి గెలిచిన గుమ్మలూరి జయరాం ఈసారి అలూరు టికెట్ ఇవ్వనందుకు నిరసనగా వైసీపీని వీడారు.

ఆయనకు టీడీపీ ప్లేస్ మెంట్ చూపించింది. కానీ అలూరులో అయితే కాదు. అక్కడ టీడీపీకి అభ్యర్ధులు ఉన్నారు. దాంతో కర్నూల్ జిల్లాను దాటి అనంతపురంలోని గుంతకల్లులో మాజీ మంత్రిని పోటీ చేయించాలని చూస్తోంది. ఈ సీటు గుమ్మలూరుకి ఇస్తున్నారు అని ప్రచారం మొదలవగానే అక్కడ టీడీపీలో మంటలు రేగుతున్నాయి.

పక్క జిల్లా నుంచి వచ్చే నాన్ లోకల్ కి మేము సపోర్ట్ చేయమని టీడీపీ నేతలు అంటున్నారు. గుంతకల్లు టీడీపీ ఆఫీసు ఎదుట తముళ్ళు అందోళన చేశారు. తమ ఆగ్రహాన్ని వెళ్ళగక్కారు. టీడీపీ అధినాయకత్వం తీరు పట్ల భగ్గుమంటున్నారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ గుంతకల్లు సీటుని మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ కి ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వేరే వారికి ఇస్తే మద్దతు ఇచ్చే సమస్య లేదని అంటున్నారు. వలసవాదులకు చోటు అసలు లేదు అని వారు నినదిస్తున్నారు.

ఇక గుంతకల్లు అసెంబ్లీ నియోజకవర్గం గురించి చూస్తే కనుక ఇది కాంగ్రెస్ కి స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న సీటు. 2009లో ఇక్కడ నుంచి మధుసూదన్ గుప్తా గెలిచారు. 2014లో మాత్రం టీడీపీ నుంచి ఆర్ జితేంద్ర గౌడ్ గుంతకల్లు నుంచి ఎమ్మెల్యేగా నెగ్గారు. 2019లో వైసీపీ నుంచి వై వెంకటరామి రెడ్డి గెలిచారు. ఈసారి వైసీపీ అభ్యర్ధిని మార్చుతుంది అని అంటున్నారు.

టీడీపీలో జితేంద్ర గౌడ్ అయిదేళ్ళుగా పార్టీని నమ్ముకుని ఉన్నారు. ఈ నేపధ్యంలో ఆయనకే మరోసారి టికెట్ వస్తుందని ఆయన అనుచరులు ఆశించారు. టీడీపీలో ఆశావహులు చాలా మంది ఉన్నారు. ఎవరూ కాకుండా వైసీపీలో నిన్నటిదాకా మంత్రిగా చేసి ఆరోపణలు ఉన్న పక్క జిల్లాకు చెందిన వారిని దిగుమతి చేస్తామంటే తాము ఒప్పుకోమని తమ్ముళ్ళు తెగేసి చెబుతున్నారు.

తాను లోకల్ అని గుమ్మలూరు జయరాం ఒక వైపు చెబుతున్నారు. తనకు గుంతకల్లుతో అనుబంధం ఉందని ఆయన అంటున్నారు. తాను గెలిచి తీరుతాను అని ఆయన విశ్వాసం వ్యక్తం చేస్తూంటే ఆదికి ముందే ఇలా టీడీపీలో మంటలు పుట్టడంతో గుమ్మలూరికి రెడ్ సిగ్నల్ పడిందని అంటున్నారు. అయితే జనసేన నుంచి కూడా ఈ సీటుని ఆశిస్తున్న వారు ఉన్నారు.

2019లో జనసేన తరఫున పోటీ చేసిన మధుసూదన్ గుప్తా కూడా టికెట్ కోసం చూస్తున్నారు అని టాక్. మొత్తం మీద గుమ్మలూరు 2009లో ప్రజారాజ్యం తరఫున రాజకీయ అరంగేట్రం చేశారు. తొలిసారి పోటీ చేసి ఓడారు. వైసీపీలో రెండు సార్లు గెలిచి మంత్రి కూడా అయ్యారు. ఇపుడు ఆయన జిల్లా మారుతున్నారు. పార్టీ మారుతున్నారు. సీటు మారుతున్నారు. మరి ఆయన రాజకీయం ఎలా ఉంటుందో గుంతకల్లు ఆయనకు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాల్సి ఉంది.