Begin typing your search above and press return to search.

టాయిలెట్ నుండి కోర్టు విచారణకు హాజరైన వ్యక్తికి ₹1 లక్ష జరిమానా!

విచారణ సమయంలో టాయిలెట్‌లో ఉన్నట్లు కనిపించడం, న్యాయ వ్యవస్థ పరువును దిగజార్చే చర్యగా కోర్టు పరిగణించింది. దీంతో సామన్ అబ్దుల్‌కు ₹1 లక్ష జరిమానా విధించింది.

By:  Tupaki Desk   |   23 July 2025 6:41 PM IST
టాయిలెట్ నుండి కోర్టు విచారణకు హాజరైన వ్యక్తికి ₹1 లక్ష జరిమానా!
X

గుజరాత్ హైకోర్టులో ఇటీవల ఒక ఆశ్చర్యకర సంఘటన చోటు చేసుకుంది. సామన్ అబ్దుల్ అనే వ్యక్తి వర్చువల్ విచారణకు... అది కూడా టాయిలెట్ నుంచి హాజరయ్యాడు. ఇది కోర్టు గౌరవాన్ని హరించే పని అని భావించిన న్యాయమూర్తి నిర్జర్ ఎస్. దేశాయ్ నేతృత్వంలోని ధర్మాసనం, ఆయనపై కఠినంగా స్పందించింది.

కోర్టు గౌరవానికి భంగం: ₹1 లక్ష జరిమానా

విచారణ సమయంలో టాయిలెట్‌లో ఉన్నట్లు కనిపించడం, న్యాయ వ్యవస్థ పరువును దిగజార్చే చర్యగా కోర్టు పరిగణించింది. దీంతో సామన్ అబ్దుల్‌కు ₹1 లక్ష జరిమానా విధించింది. అంతేగాకుండా ఒక నెల పాటు కమ్యూనిటీ సేవ చేయాలని కూడా ఆదేశించింది.

కోర్టు వ్యాఖ్యలు తీవ్రంగా

ఈ ఘటనపై స్పందించిన న్యాయమూర్తి దేశాయ్, "కోర్టు గౌరవాన్ని మరుగుదొడ్డికి లాగినట్లు ఉంది" అని తీవ్రంగా విమర్శించారు. వర్చువల్ హాజరులైనా సరే, కోర్టు అనేది గౌరవనీయమైన సంస్థ అని, అక్కడ ఉండే ప్రవర్తన కూడా గౌరవప్రదంగా ఉండాల్సిందేనని అన్నారు.

వర్చువల్ విచారణల్లో కూడా మర్యాద అవసరం

ఈ తీర్పు, న్యాయ వ్యవస్థపై ప్రజలు కనబరిచే గౌరవాన్ని రుజువు చేసేలా ఉంది. వర్చువల్ విధానాలు సౌకర్యవంతమైనవైనా, న్యాయప్రక్రియ పవిత్రతను, నిబంధనలను పాటించాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తికీ ఉంది. కోర్టులో ఎలా ప్రవర్తించాలి, ఎలాంటి దుస్తులు ధరించాలి, ఎక్కడి నుంచే విచారణకు హాజరవ్వాలో స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నా, వాటిని కొంతమంది నిర్లక్ష్యం చేస్తుంటారు.

ఈ సంఘటన, కోర్టు విచారణలను తేలికగా తీసుకునే వారికి స్పష్టమైన హెచ్చరిక. న్యాయ వ్యవస్థను గౌరవించడం, విచారణల పట్ల మర్యాద చూపించడం ప్రతి పౌరుడి బాధ్యత. ఈ తీర్పు, వర్చువల్ కోర్టుల్లో కూడా క్రమశిక్షణను పాటించాల్సిన అవసరాన్ని ప్రజలకు గుర్తు చేస్తోంది.