కొడాలి నాని.. బాబు బూట్లు తుడువ్.. గరంగరం గుడివాడ..ఫ్లెక్సీల రగడ
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా...? నిరుడు జరిగిన ఎన్నికల్లో గుడివాడలో నాని ఓడిపోయారు. నాలుగుసార్లు వరుసగా గెలిచిన ఆయనకు ఇది తొలి పరాజయం.
By: Tupaki Desk | 12 July 2025 8:24 PM ISTఏపీలో మిగతా ఏ నియోజకవర్గంలోనూ లేని రాజకీయ వేడి గుడివాడలో ఉంటుందనడంలో సందేహం లేదు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వంటి నాయకుడు ప్రాతినిధ్యం వహించిన ఈ నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. ఆ పార్టీ పుట్టాక 1989లో తప్ప.. 2009 వరకు టీడీపీ జెండానే ఎగిరింది. 2014, 2019లో మాత్రం వైఎస్సార్‌సీపీ వశమైంది. 2004, 2009లో టీడీపీ తరఫున ఆ తర్వాత రెండుసార్లు వైసీపీ తరఫున గుడివాడలో జయకేతనం ఎగురవేశారు కొడాలి నాని. వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా వ్యవహరించారు. ఏపీ సీఎం చంద్రబాబు ఆయన కుమారుడు లోకేశ్‌ను తీవ్రంగా విమర్శించేందుకు కొడాలి నాని వైసీపీకి ఆయుధంగా మారారు. ఈ క్రమంలో ఆయన చాలా ముందుకెళ్లారు. ఓ దశలో కుప్పంలో 20244లో చంద్రబాబు గెలిస్తే ఆయన బూట్లు పాలిష్ చేస్తానని కూడా సవాల్ విసిరారు.
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా...? నిరుడు జరిగిన ఎన్నికల్లో గుడివాడలో నాని ఓడిపోయారు. నాలుగుసార్లు వరుసగా గెలిచిన ఆయనకు ఇది తొలి పరాజయం. ఇక ఆ తర్వాత నియోజకవర్గానికి దూరమయ్యారు. అనారోగ్యం కూడా తోడవడంతో గుడివాడకు ఏడాది పాట రాలేకపోయారు. ఏడాది తర్వాత.. పది రోజుల కిందట నియోజకవర్గంలో అడుగుపెట్టారు. కాగా, కొన్ని నెలల కిందట కొడాలి నానికి బైపాస్ సర్జరీ జరిగింది. తొలుత హైదరాబాద్ ఆ తర్వాత ముంబైలో చికిత్స పొందారు. డిశ్చార్జి అనంతరం ఆయన ఎక్కడ ఉంటున్నారన్నది తెలియకున్నా.. హైదరాబాద్‌లోనే అని చెబుతున్నారు. ఆ మధ్య ఓ వివాహ కార్యక్రమానికి కూడా హాజరయ్యారు.
నాని ఇటీవల గుడివాడ వచ్చిన క్రమంలో అభిమానులు, వైసీపీ కార్యకర్తలు ఆయనను పలకరిచేందుకు పోటీ పడ్డారు. అప్పటికి హడావుడి ఏమీ లేకున్నా.. ఇప్పుడు మాత్రం గుడివాడలో రాజకీయం గరంగరంగా మారింది. నాని గతంలో చంద్రబాబును ఉద్దేశిస్తూ చేసిన సవాల్‌కు సంబంధించిన ఫ్లెక్సీలు అగ్గి రాజేస్తున్నాయి. దీనికి పోటీగా వైసీపీ కూడా స్పందించడంతో ఫ్లెక్సీ వార్ నడుస్తోంది.
కాగా, డీటీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో.. సవాల్ ప్రకారం కొడాలి నాని ఓడిపోయినందు చంద్రబాబు బూట్లు తుడవాలి అని ఉండగా.. చంద్రబాబు సీఎం అయ్యాక వాగ్దానాలు అమలు చేయని వైనాన్ని గుర్తు చేస్తూ బాబు ష్యూరిటీ మోసాలు గ్యారంటీ పేరుతో పోటీగా వైసీపీ క్యాడర్ ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఇది రెండు పార్టీల నేతల మధ్య ఘర్షణకు దారితీసింది.
