ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!
GTA 6పై గేమింగ్ అభిమానుల్లో ఉన్న క్రేజ్ అమ్మకాల అంచనాల్లో కనిపిస్తోంది. ఈ గేమ్ ప్రారంభ విక్రయాలు, ప్రీ ఆర్డర్లు కలిపి 2.36 బిలియన్ డాలర్లు (సుమారు రూ.21,950 కోట్లు) దాటినట్లు అంచనాలు వెలువడ్డాయి. అయితే ఇది విడుదలైన 24 గంటల్లో వచ్చిన అమ్మకాలు కాదు. గేమ్ తయారీ బడ్జెట్ బిలియన్ డాలర్లకు పైగా ఉండొచ్చని ప్రచారం జరుగుతున్నా, రాక్‌స్టార్ అధికారికంగా వెల్లడించలేదు. 2013లో వచ్చిన GTA 5 సృష్టించిన సంచలనాన్ని GTA 6 అధిగమిస్తుందా అన్న ఆసక్తి నెలకొంది.
By: Tupaki Desk | 20 Nov 2026 1:09 PM ISTGTA 6 కోసం గేమింగ్ అభిమానులు ఎంతకాలంగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ గేమ్‌పై ఉన్న అంచనాలు విడుదలకు ముందే భారీగా పెరిగాయి. ఇప్పుడు ఆ క్రేజ్ అమ్మకాల రూపంలో కనిపిస్తోంది. విడుదలైన తొలి రోజుకు సంబంధించిన అంచనాల ప్రకారం GTA 6 విక్రయాలు 2.36 బిలియన్ డాలర్లను దాటాయి. మన కరెన్సీలో చెప్పాలంటే దాదాపు రూ.21,950 కోట్లు.
ఈ లెక్కలు చూస్తే గేమ్‌కు ఉన్న డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. హాలీవుడ్లో భారీ అంచనాల మధ్య విడుదలయ్యే సినిమాలు కూడా తొలి రోజున ఈ స్థాయి వసూళ్లు సాధించడం చాలా అరుదు. GTA 6 మాత్రం గేమింగ్ మార్కెట్లో తనకంటూ ప్రత్యేకమైన రికార్డు సృష్టించింది.
అయితే ఈ రూ.21 వేల కోట్ల లెక్కలో ప్రీ ఆర్డర్ విక్రయాలు కూడా ఉన్నాయి. అంటే గేమ్ విడుదలైన తర్వాత 24 గంటల్లోనే ఈ మొత్తం వచ్చిందని భావించకూడదు. ఇది ఇప్పటివరకు నమోదైన మొత్తం ప్రారంభ విక్రయాల అంచనా.
ఇక ఈ గేమ్ తయారీకి పెట్టిన ఖర్చు కూడా చర్చనీయాంశంగా మారింది. బడ్జెట్ బిలియన్ డాలర్లకు పైగా ఉండొచ్చని ప్రచారం జరుగుతున్నా.. రాక్‌స్టార్ మాత్రం అధికారికంగా ఖర్చు వివరాలు వెల్లడించలేదు.
2013లో వచ్చిన GTA 5 ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన ప్రభావం తెలిసిందే. ఇప్పుడు దానికి మించిన అంచనాలతో GTA 6 మార్కెట్లోకి వచ్చింది. మొదటి రోజు అమ్మకాలే ఈ స్థాయిలో ఉంటే, రాబోయే నెలల్లో ఈ గేమ్ ఎంతటి వ్యాపారం చేస్తుందో చూడాలి.
