Begin typing your search above and press return to search.

పెళ్లికూతురుకు బదులు ఆమె తల్లి.. వరుడికి షాక్ లగా..

ఉత్తరప్రదేశ్‌లోని మేరఠ్ జిల్లాలో ఓ వివాహం ఊహించని మలుపు తిరిగి అందరిని షాక్‌కు గురిచేసింది.

By:  Tupaki Desk   |   20 April 2025 2:00 PM IST
Groom Shocked as Bride’s Mother Replaces Daughter
X

ఉత్తరప్రదేశ్‌లోని మేరఠ్ జిల్లాలో ఓ వివాహం ఊహించని మలుపు తిరిగి అందరిని షాక్‌కు గురిచేసింది. పెళ్లిపీటల వద్ద వరుడు ఎదురుచూస్తుండగా వధువు స్థానంలో ఆమె తల్లి వధువు వేషంలో కూర్చుని ఉండటం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన నేరుగా పోలీస్ స్టేషన్‌ దాకా వెళ్ళింది.

- వధువుకి బదులుగా తల్లి?

మేరఠ్‌కు చెందిన 22 ఏళ్ల మొహమ్మద్‌ అజీంకు, శామలీ జిల్లాకు చెందిన 21 ఏళ్ల మంతశా అనే యువతితో వివాహం నిశ్చయమైంది. వివాహ వేడుకలు సంప్రదాయబద్ధంగా సాగుతుండగా, నిఖా సమయంలో వధువు పేరును ‘తాహిరా’గా ప్రకటించారు. ఈ విషయం గమనించిన వరుడు అజీంకు అనుమానం వచ్చి, వెంటనే వధువు ముసుగు తొలగించి చూసాడు. అయితే మంతశా స్థానంలో ఆమె 45 ఏళ్ల తల్లి కూర్చుని ఉండటాన్ని చూసి అజీం అవాక్కయ్యాడు.

- మోసపోయిన వరుడు.. బెదిరింపులు

ఈ మోసం వెనుక తన అన్నా-వదినలు ఉన్నారని అజీం ఆరోపించాడు. వారే వధువు కుటుంబంతో కలసి తనను ఈ వివాహ మాయాజాలంలో నెట్టినట్టు తెలిపాడు. అంతే కాకుండా ఈ వివాహానికి అభ్యంతరం తెలుపితే తనపై లైంగిక ఆరోపణలతో కేసు పెడతామని బెదిరించినట్టు చెప్పాడు.

అజీం తన వేదనను వెల్లడిస్తూ, ఈ వివాహం కోసం ఇప్పటికే రూ.5 లక్షల వరకు ఖర్చు చేశానని పేర్కొన్నాడు. మోసానికి గురైన తాను న్యాయం కోరుతూ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఈ వివాహం వెనుక ఉన్న అసలు కారణాలు, వాస్తవాలు తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.

ఈ విచిత్ర ఘటన గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. పెళ్లిపీటలపై ఇంతటి మోసం జరిగిందని వినడం ఇదే తొలిసారి అని పలువురు స్పందిస్తున్నారు.