Begin typing your search above and press return to search.

కాబోయే భార్య లెహంగాకు తూట్లు.. షాపులో వార్నింగులు.. వీడియో వైరల్!

అవును... మహారాష్ట్రలోని ఓ మహిళ తన పెళ్లి కోసం రూ.32,000 విలువైన లెహంగాను కొనుగోలు చేసింది. అనంతరం.. ఇంటికి వెళ్లిన తర్వాత ఆ డ్రెస్ పై అభిప్రాయాన్ని మార్చుకుంది.

By:  Tupaki Desk   |   23 July 2025 10:58 AM IST
కాబోయే భార్య లెహంగాకు తూట్లు.. షాపులో వార్నింగులు.. వీడియో వైరల్!
X

పెళ్లి దుస్తుల విషయంలో జరిగిన ఓ షాపింగ్ వ్యవహారం, అనంతరం జరిగిన పరిణామాలకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. అంటే... కోట్లలో షాపింగ్ జరిగిందా.. లేక, అత్యంత సింపుల్ గా కానిచ్చేశారా? అనుకుంటే పొరపాటే... ఈ షాపింగ్ లో కాబోయే పెళ్లికొడుకు ఆగ్రహం.. బట్టలపై కత్తి పోట్లకు కారణమైంది!

అవును... మహారాష్ట్రలోని ఓ మహిళ తన పెళ్లి కోసం రూ.32,000 విలువైన లెహంగాను కొనుగోలు చేసింది. అనంతరం.. ఇంటికి వెళ్లిన తర్వాత ఆ డ్రెస్ పై అభిప్రాయాన్ని మార్చుకుంది. దీంతో వాపసు కోసం ప్రయతించగా.. షాపు యాజమాన్యం నుంచి ఆశించని సమాధానం వచ్చింది. దీంతో.. ఆమెకు కాబోయె భర్త కత్తికి పనిచెప్పాడు.

వివరాళ్లోకి వెళ్తే... మేఘన తన పెళ్లి కోసం ఓ లెహంగ కొనుగోలు చేసింది.. అయితే ఇంటికి వెళ్లిన తర్వాత తిరిగి షాప్ కు ఫోన్ చేసి, తనకు అది సూట్ కాలేదని, దాన్ని తిరిగి ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపింది. అయితే షాపు వాళ్లు మాత్రం.. డబ్బు వాపసుకు బదులుగా ఒక క్రెడిట్ నోట్ ఇస్తామని, ఆ నోట్ ని ఉపయోగించి రెండు నెలల్లోపు షాపు వేరే ఏదైనా కొనవచ్చని చెప్పారు.

దీంతో... ఒక నెల తర్వాత ఆమె మళ్ళీ ఇటీవల ఆ షాపుని సందర్శించింది. ఈ క్రమంలో... ఒక సేల్స్‌ మ్యాన్ ఆమెకు స్టాక్ క్లియరెన్స్ సేల్ నిర్వహిస్తున్నట్లు తెలియజేసి, నెక్స్ట్ మంత్ తిరిగి రమ్మని కోరాడు. ఈ సమయంలో... విషయం తెలుసుకున్న ఆమెకు కాబోయే భర్త సుమిత్ షోరూమ్‌ లోకి వచ్చి డబ్బు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకు షాపు మేనేజర్ నిరాకరించాడు.

దీంతో... జూలై 19న కత్తితో దుకాణంలోకి ప్రవేశించిన సుమిత్... ఆ లెహంగాను ముక్కలుగా చేసి, ఆపై బ్లౌజ్‌ ను ఎత్తి, చిరిగిన దుస్తులపై విసిరి, దాడి చేసి అక్కడ నుంచి వెళ్లిపోయాడు! దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ సందర్భంగా... బెదిరింపులకు దిగాడు. ఇందులో భాగంగా... 'మిమ్మల్ని కూడా ఇలాగే చీల్చివేస్తా' అంటూ ఫైర్ అయ్యాడు.

దీంతో ఆ షోరూమ్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతను కత్తి తీసుకొచ్చి లెహంగాను చించేశాడని.. ఆ సంఘటనను చూసి స్టోర్ లోని ఇతర కస్టమర్లు ఆందోళన చెందారని తెలిపారు. ఈ సందర్భంగా తమను రూ.3 లక్షలు డిమాండ్ చేశాడని, ఈ షోరూమ్ గురించి గూగుల్ లో బ్యాడ్ రివ్యూస్ రాస్తానని బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.

దీంతో.. రంగంలోకి దిగిన పోలీసులు సుమిత్ ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు. దీనిపై స్పందించిన బజార్ పేట్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇనిస్పెక్టర్ సూరజ్ సింగ్ స్పందిస్తూ... డబ్బులు తిరిగి ఇవ్వననేసరికి కోపంలో అలా చేసినట్లు సుమిత్ అంగీకరించాడని తెలిపారు.