Begin typing your search above and press return to search.

అపార్ట్ మెంట్ లో పవర్ కట్ గురించి అడిగినందుకు... షాకింగ్ వీడియోలు!

ఒక అపార్ట్ మెంట్ లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అలా అని ఇదే ఫస్ట్ టైమ్ కాదంట. అదేపనిగా పవర్ కట్ అవుతుందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   28 Jun 2025 5:00 AM IST
అపార్ట్  మెంట్  లో పవర్  కట్  గురించి అడిగినందుకు... షాకింగ్  వీడియోలు!
X

ఒక అపార్ట్ మెంట్ లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అలా అని ఇదే ఫస్ట్ టైమ్ కాదంట. అదేపనిగా పవర్ కట్ అవుతుందని అంటున్నారు. దీంతో విసిగిపోయిన నివాసితులు.. మెయింటినెన్స్ సిబ్బందికి, వాచ్ మెన్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు సరికదా... ఫిర్యాదు చేయడానికి వచ్చిన అపార్ట్ మెంట్ వాసులపై కర్రలతో విరుచుకుపడ్డారు. దీనికి సంబంధించిన వీడియోలు షాకింగ్ గా మారాయి.

అవును... గ్రేటర్ నోయిడాలోని ఒక అపార్ట్ మెంట్ లో నివసిస్తున్న వాసులు.. విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ఫిర్యాదు చేశారు. దీంతో.. ఒక్కసారిగా కోపోద్రిక్తులైన మెయింటినెన్స్ సిబ్బంది, గార్డులు.. కర్రలతో అపార్ట్ మెంట్ వాసులపై దాడులు చేశారు. చిన్నా, పెద్ద అనే తేడాలేమీ లేకుండా విరుచుకుపడ్డారు! దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సంఘటన గురువారం రాత్రి జరిగింది.

వివరాళ్లోకి వెళ్తే... నొయిడాలోని ఎకో విలేజ్-1 సొసైటీలోగల హౌసింగ్ కాంప్లెక్స్‌ లో గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో.. నివాసితులు ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలోనే.. వారు మెయింటెనెన్స్ సిబ్బంది వద్దకు ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. అయితే... మెయింటినెన్స్ సిబ్బంది, అపార్ట్ మెంట్ వాసులకు ఎటువంటి వివరాలు అందించలేదు. దీంతో.. ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

దీంతో... వెంటనే మెయింటెనెన్స్ సిబ్బంది, కొంతమంది సెక్యూరిటీ గార్డులు కలిసి అపార్ట్ మెంట్ వాసులతో హింసాత్మకంగా వ్యవహరించారు. ఇందులో భాగంగా వారిపై కర్రలతో విచక్షణారహితంగా దాడులు చేశారు. దీంతో.. పోలీసులు రంగ ప్రవేశం చేసి.. మెయింటినెన్స్ విభాగానికి చెందిన నలుగురిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా స్పందించిన బాధితుల్లో ఒకరు... రెండు మూడు గంటలుగా విద్యుత్ రాలేదని.. మెయింటినెన్స్ సిబ్బంది తమ కాల్స్‌ ను స్వీకరించడం లేదని.. దీంతో, తామే కిందకు దిగామని తెలిపారు. అలా తాము అక్కడికి వెళ్ళేసరికి, మరికొందరు నివాసితులు అప్పటికే వారితో మాట్లాడుతున్నారని తెలిపారు. అప్పటికే ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరుగుతుందని వెల్లడించారు.

ఈ సమయలో తాము మాట్లాడుకుంటుండగా.. మెయింటినెన్స్ సిబ్బందిలోని కొంతమంది సభ్యులు మమ్మల్ని కొట్టడం ప్రారంభించారని బాధిత వ్యక్తి తెలిపారు. ఆ సిబ్బందిలోని ఒక వ్యక్తి నా కాలర్‌ ను పట్టుకున్నాడని, ఆ సమయంలో మరికొందరు నన్ను కర్రలతో కొట్టారని.. చెంపదెబ్బ కూడా కొట్టారని.. శరీరం మొత్తం వాచిపోయిందని వాపోయారు.