Begin typing your search above and press return to search.

చదువు చెప్పే సర్కారీ టీచర్ ...లవ్వర్ కోసం ఆమె భర్తను ఏసేశాడు

మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకున్న హత్యకు సంబంధించిన వివారాల్ని జిల్లా ఎస్పీ వెల్లడించారు.

By:  Tupaki Desk   |   4 April 2025 10:08 AM IST
Govt Teacher Hires Hitmen to Kill Lover Husband
X

వివాహేతర సంబంధంలో భాగంగా ప్రియురాలిని సొంతం చేసుకోవటం కోసం ప్రియుడు ఆమె భర్తను చంపే ఉదంతాలు కొన్నిసార్లు.. ప్రియుడు కోసం భర్తను హతమార్చే భార్యల ఉదంతాలు ఈ మధ్యన ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ అరాచక కాండకు కొనసాగింపుగా తాజాగా వెలుగు చూసిన ఉదంతం షాకింగ్ గా మారింది. ఎందుకంటే ప్రియురాలు భర్తను చంపేసిన వ్యక్తి మరెవరో కాదు.. పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పే ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు కావటమే. ఇప్పటివరకు భర్తలను అడ్డుతొలగించే భార్యల ఉదంతాల్లో నిందితులు ప్రైవేటు వ్యక్తులు కావటం చూశాం. ప్రభుత్వ టీచరే ఇంతటి దారుణానికి పాల్పడటం మాత్రమే తెలుగు రాష్ట్రాల్లో ఇదే తొలిసారిగా చెబుతున్నారు. అసలేం జరిగిందంటే..

మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకున్న హత్యకు సంబంధించిన వివారాల్ని జిల్లా ఎస్పీ వెల్లడించారు. దంతాలపల్లి జ్యోతిబా పులే బాలుర గురుకుల పాఠశాలలో హెల్త్ సూపర్ వైజర్ గా పని చేస్తున్నాడు పార్థసారధి. భార్య స్వప్నతో కలిసి కొత్తగూడెంలో నివాసం ఉంటున్నారు. ఇదిలా ఉండగా.. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం నెల్లిపాక గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు విద్యాసాగర్ తో 2016లో స్వప్నకు పరిచయమైంది.

కాలక్రమంలో అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ వ్యవహారం కాస్తా బయటకు పొక్కింది. దీంతో స్వప్న భర్త పార్థసారధి పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు.అయినప్పటికీ ఇద్దరు మారలేదు. దీంతో.. దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఇదిలా ఉండగా నెల రోజుల క్రితం కొత్తగూడెం పట్టణానికి చెందిన వినయ్ కుమార్.. శివశంకర్.. వంశీ.. లవరాజులతో ఒక డీల్ కుదుర్చుకున్నాడు విద్యా సాగర్.

తాను చెప్పినట్లుగా పార్థసారధిని చంపేస్తే.. రూ.5 లక్షలు సుపారీ ఇస్తానని చెప్పాడు. దీనికి ఓకే చెప్పిన ఈ టీం పార్థసారధిని లేపేసే ప్లాన్ చేశారు. మార్చి 28న ఉగాది పండుగ సెలవులకు భద్రాచలానికి వచ్చాడు విద్యాసాగర్. భర్తను లేపేసేందుకు ఇదే సరైన సమయంగా భావించిన స్వప్న.. ఈ సమాచారాన్ని ప్రియుడు పార్థసారధికి సమాచారం ఇచ్చింది. దీంతో.. సుపారీ గ్యాంగ్ ను రంగంలోకి దించాడు.

ఒక వాహనాన్ని గ్యాంగ్ కు ఇచ్చి పార్థసారధిని లేపేయాలని ఆదేశించాడు. దీంతో అతడ్ని వెంబడించిన గ్యాంగ్.. శివారులో అతడ్ని అడ్డగించి ఇనుప రాడ్లతో దాడి చేసి హత్యకు పాల్పడ్డారు. పార్థసారధి సోదరి ఇచ్చిన ఫిర్యాదులో రంగంలోకి దిగారు పోలీసులు. తన అన్న మరణంపై తనకున్న అనుమానాల్నిపోలీసులకు ఆమె చెప్పారు. ఈ దిశగా కేసు విచారించిన వేళ.. అసలు విషయాలు వెలుగు చూశాయి. టెక్నాలజీ సాయంతో ఆధారాల్ని సేకరించినట్లుగా పోలీసులు వెల్లడించారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. ప్రియురాలి భర్తను సుపారీ ఇచ్చి మరీ లేపేసిన సర్కారీ టీచరు ఉదంతం ఇప్పుడు షాకింగ్ గా మారింది.