Begin typing your search above and press return to search.

ఎన్నికల్లో రాముడు.. కృష్ణుడు.. చివరకు ఏమయ్యారు?

కాగా, గోవిల్‌ కు ముందు మహాభారతంలో శ్రీ కృష్ణుడి పాత్ర పోషించిన నితీష్‌ భరద్వాజ్‌ కూడా ఎన్నికల బరిలో దిగారు. భరద్వాజ్ బీజేపీలో చేరారు.

By:  Tupaki Desk   |   16 April 2024 3:30 PM GMT
ఎన్నికల్లో రాముడు.. కృష్ణుడు.. చివరకు ఏమయ్యారు?
X

భారతీయుల జీవితంలో ఓ భాగం రామాయణం, మహాభారతం. రాముడు, కృష్ణుడు ఇక్కడివారికి నిత్యం కొలుచుకునే దేవుళ్లు. ఇక మూడు దశాబ్దాల కిందట దూరదర్శన్ లో ప్రసారమైన రామాయణ, మహాభారతాలు ఒక తర పిల్లలను ఉర్రూతలూగించాయనే చెప్పాలి. వాటిలోని కథలు, ఉప కథలు.. అందులోని మంచి-చెడు ఇప్పటికీ వారిపై ప్రభావం చూపుతున్నాయి. ఇక రామాయణ, మహాభారతాల్లో రాముడు, కృష్ణుడి పాత్రలు పోషించిన నటులు ఎవరా? అని ఆ రోజుల్లో అందరూ ఆరా తీసేవారు. మీడియా, టెక్నాలజీ అంతగా లేని కాలం కాబట్టి ఎవరో చెబితే.. 'రాముడిగా చేసింది ఫలానా నటుడు' అని తెలిసింది. కాలక్రమంలో మీడియా టెక్నాలజీ పెరగడంతో వారెవరో.. నిజ జీవితంలో ఎలా ఉంటారో అందరికీ స్పష్టమైంది.

కత్తెర పరిశ్రమల నగరంలో..ఈ ఎన్నికల్లో పలువురు సినీ నటులు అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. కత్తెర పరిశ్రమలకు కేంద్రమైన ఉత్తర ప్రదేశ్ లోని మేరఠ్ సీటు నుంచి బీజేపీ అభ్యర్థిగా ఇలానే బరిలో దిగారు టీవీ సీరియల్‌ రామాయణంలోని రాముడు పాత్ర పోషించిన అరుణ్‌ గోవిల్‌. కొద్ది రోజుల కిందట కీలక వ్యాఖ్యలు చేశారు గోవిల్. కాగా, గోవిల్‌ కు ముందు మహాభారతంలో శ్రీ కృష్ణుడి పాత్ర పోషించిన నితీష్‌ భరద్వాజ్‌ కూడా ఎన్నికల బరిలో దిగారు. భరద్వాజ్ బీజేపీలో చేరారు. చురుకైన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. అధికార ప్రతినిధిగా కూడా వ్యవహరించారు.

అయితే రాజకీయాల నుంచి కొద్ది కాలానికే తప్పుకొన్నారు. 1996 లోక్‌సభ ఎన్నికల్లో జార్ఖండ్‌ లోని జంషెడ్‌పూర్ నుంచి బీజేపీ టిక్కెట్‌పై పోటీ చేసి, విజయం సాధించారు. 1999 ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌ రాజ్‌గఢ్ నియోజకవర్గానికి మారారు. అప్పటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ సోదరుడు లక్ష్మణ్ సింగ్ చేతిలో నితీష్ భరద్వాజ్ ఓడిపోయారు.

రాముడు, కృష్ణుడు ఇద్దరూ ఒకే పార్టీలో రాముడు, కృష్ణుడిగా కోట్లాది భారతీయులను ఉర్రూతలూగించిన నటులు ఇద్దరూ.. హిందూ సంప్రదాయాలకు పెద్ద పీట వేసే బీజేపీ నుంచే ఎన్నికలకు దిగడం గమనార్హం. భావజాల పరంగానో, లేక పౌరాణిక పాత్రల ప్రభావమో.. వాటి ద్వారా వచ్చిన పేరుతో సులువుగా గెలవొచ్చనే ఆలోచనతోనే వీరు బీజేపీలో చేరారని భావించవచ్చు. అందులోనూ ఇద్దరూ ఉత్తరాది రాష్ట్రాలనుంచే పోటీ చేయడం గమనార్హం.