Begin typing your search above and press return to search.

మంత్రి గుమ్మలూరు జయరాం బర్తరఫ్...!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రివర్గం నుంచి మంత్రి గుమ్మలూరు జయరాం ని బర్తరఫ్ చేశారు. ఈ మేరకు గవర్నర్ కార్యాలయం నుంచి ఒక ప్రకటన వెలువడింది.

By:  Tupaki Desk   |   5 March 2024 4:13 PM GMT
మంత్రి గుమ్మలూరు జయరాం బర్తరఫ్...!
X

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రివర్గం నుంచి మంత్రి గుమ్మలూరు జయరాం ని బర్తరఫ్ చేశారు. ఈ మేరకు గవర్నర్ కార్యాలయం నుంచి ఒక ప్రకటన వెలువడింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూచనల మేరకు ఆయనను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేస్తున్నట్లుగా ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

రాజ్యాంగం లోని ఆర్టికల్ 164 (1) ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా గవర్నర్ ఆఫీస్ పేర్కొంది. మంత్రి జయరాం బర్తరఫ్ ని చేస్తూ తీసుకున్న నిర్ణయం వెంటనే అమలులోకి వస్తుందని కూడా వెల్లడించింది. ఇదిలా ఉండగా గుమ్మలూరు జయరాం కర్నూల్ జిల్లా ఆలూరు నుంచి వైసీపీ తరఫున రెండు సార్లు గెలిచారు. వైసీపీ అధికారంలోకి రాగానే ఆయనకు మంత్రివర్గంలో అవకాశం ఇచ్చారు. ఇక ఆయన మీద 2021లో ఆరోపణలు విపక్షాల నుంచి వచ్చినా మంత్రివర్గంలో కొనసాగించారు. 2022లో జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆయన మంత్రి పదవి పోతుందని వార్తలు వచ్చినా చివరికి ఆయనను కొనసాగించడం విశేషం.

ఇదిలా ఉంటే ఆయనను ఈసారికి కర్నూల్ నుంచి ఎంపీగా పోటీ చేయమని వైసీపీ అధినాయకత్వం కోరింది. దానికి గుమ్మలూరు జయరాం అంగీకరించలేదు కొన్నాళ్ళ పాటు ఆయన రాజకీయంగా అజ్ఞాతవాసం చేశారు. గత నెలలో జరిగిన మంత్రి వర్గ సమావేశానికి ఆయన హాజరు కాలేదు.

ఈ నేపధ్యంలో ఆయన తన రాజకీయ భవిష్యత్తుని చూసుకున్నారు. టీడీపీలో చేరి అనంతపురం జిల్లా గుంతకల్లు నుంచి శాసనసభకు పోటీ చేస్తున్నట్లుగా వెల్లడించారు. దాంతో ఆయన మీద వైసీపీ హై కమాండ్ చర్యలకు ఉపక్రమించింది.

ఇదిలా ఉంటే ఒక మంత్రి మీద బర్తరఫ్ యాక్షన్ కి దిగడం విభజన ఏపీలో ఇదే తొలిసారి. అంతకు ముందు ఉమ్మడి ఏపీలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కలిశారు అని చితూరు వైసీపీ ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు మీద కూడా అనర్హత వేటు వేసేందుకు వైసీపీ సిద్ధంగా ఉందని అంటున్నారు. ఎవరు పార్టీ లైన్ దాటినా స్పేర్ చేయకూడదు అన్నదే పార్టీ విధానంగా కనిపిస్తోంది.