Begin typing your search above and press return to search.

లాన్‌ లో ఎదురుచూస్తున్న గవర్నర్‌.. వదిలేసి వెళ్లిపోయిన విమానం!

వీఐపీ లాన్‌ నుంచి గహ్లోత్‌ టర్మినల్‌ 2కు చేరుకునేలోపే విమానం హైదారాబాద్‌ కు టేకాఫ్‌ అయినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

By:  Tupaki Desk   |   28 July 2023 3:05 PM GMT
లాన్‌ లో ఎదురుచూస్తున్న గవర్నర్‌.. వదిలేసి వెళ్లిపోయిన విమానం!
X

గవర్నర్‌ ఎయిర్‌ పోర్టులో ఉండగానే.. లాన్‌ లో ఎదురుచూస్తున్న కూడా ఆయన్ను వదిలేసి ఎయిర్‌ ఏషియా విమానం టేకాఫ్‌ అయ్యింది. దీంతో గవర్నర్‌ కార్యాలయం పోలీసుల కు ఫిర్యాదు చేసింది. దీంతో మేటర్ సీరియస్ అయ్యింది.. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రం, బెంగళూరు లో జరిగింది.

బెంగళూరు లోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. ఇందులో భాగంగా దేశీయ విమానయాన సంస్థ ఎయిర్‌ ఏషియా సిబ్బంది.. ప్రొటో కాల్‌ ఉల్లంఘన కు పాల్పడ్డారని తెలుస్తోంది. కర్ణాటక గవర్నర్‌ థావర్‌ చంద్‌ గహ్లోత్‌ ఎయిర్‌ పోర్టు లాన్‌ లో ఎదురుచూస్తున్నా.. ఆయనను వదిలేసి విమానాన్ని టేకాఫ్‌ చేశారు.

వివరాళ్లోకి వెళ్తే... కర్ణాటక గవర్నర్‌ థావర్‌ చంద్‌ గహ్లోత్‌, హైదరాబాద్‌ కు వెళ్లేందుకు గురువారం మధ్యాహ్నం బెంగళూరు ఎయిర్‌ పోర్టుకు చేరుకున్నారు. ఈ సమయం లో ఆయన లగేజీ ని సిబ్బండి ఎయిర్‌ ఏషియా విమానం లో ఎక్కించారు. ఇంత లోనే విమానం టేకాఫ్ అయిపోయింది.

అవును... వీఐపీ లాన్‌ నుంచి గహ్లోత్‌ టర్మినల్‌ 2కు చేరుకునేలోపే విమానం హైదారాబాద్‌ కు టేకాఫ్‌ అయినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. గవర్నర్‌ టర్మినల్‌ వద్ద బోర్డింగ్‌ గేట్‌ కు చేరుకోవడం ఆలస్యం అవడం వల్లే విమానం వెళ్లిపోయిందని సదరు వర్గాలు చెబుతున్నాయంట.

దీంతో ఎయిర్‌ ఏషియా సిబ్బంది నిర్వాకం పై గవర్నర్‌ ప్రొటోకాల్‌ అధికారులు ఎయిర్‌ పోర్టు పోలీసు స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన కారణంగా గవర్నర్ గహ్లోత్ సుమారు గంటన్నర తర్వాత మరో విమానం లో హైదరాబాద్‌ కు చేరుకున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

ఇదిలా ఉండగా... ఈ ఘటన పై విమానయాన సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. "గవర్నర్‌ కు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు తెలియజేస్తున్నాం.. దీని పై దర్యాప్తు చేపట్టాం.. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.." అని ఆ ప్రకటన లో పేర్కొంది. ఇదే సమయం లో... "గవర్నర్‌ కార్యాలయంతో మా సంబంధాల ను మేం ఎల్లప్పుడూ గౌరవిస్తాం" అని వెల్లడించింది.