73 ఏళ్ల వయసులో 51 పుష్ అప్స్... గవర్నర్ ఫిట్ నెస్ వేరే లెవెల్!
ప్రపంచవ్యాప్తంగా నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా యోగా పుట్టిన భారత్ లో దేశవ్యాప్తంగా ఈ వేడుకలు జరుగుతున్నాయి.
By: Tupaki Desk | 21 Jun 2025 5:12 PM ISTప్రపంచవ్యాప్తంగా నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా యోగా పుట్టిన భారత్ లో దేశవ్యాప్తంగా ఈ వేడుకలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తమిళనాడులోనూ ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సమయంలో ఏడు పదుల వయసులో ఉన్న ఆ రాష్ట్ర గవర్నర్ ఫిట్ నెస్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
అవును.. నేడు ప్రధానంగా దేశవ్యాప్తంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విశాఖలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరయ్యారు. మరోవైపు తమిళనాడులోనూ ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా... మధురైలోని ఓ పాఠశాలలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో 10వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. వారితో పాటు రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్.రవి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి ఆయన యోగాసనాలు వేశారు. ఈ క్రమంలోనే ఆపకుండా వేదిక మీద ఆయన 51 పుష్ అప్స్ తీశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.
ఈ సందర్భంగా 73 ఏళ్ల వయసులో ఉన్న ఆ గవర్నర్ ఫిట్ నెస్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ సందర్భంగా ఆయన ఫిట్ నెస్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. వయసు కేవలం నెంబర్ మాత్రమే అనేందుకు తమిళనాడు గవర్నర్ ఒక ఉదాహరణ అంటూ కొనియాడుతున్నారు.
