Begin typing your search above and press return to search.

బాలయ్యను అన్నేసి మాటలు అనేసిన గోరంట్ల మాధవ్

వెనుకా ముందు చూసుకోకుండా మాట్లాడేసే విషయంలో వైసీపీ నేతల దూకుడు మరో లెవల్ అన్నట్లుగా ఉంటుంది

By:  Tupaki Desk   |   16 Nov 2023 4:11 AM GMT
బాలయ్యను అన్నేసి మాటలు అనేసిన గోరంట్ల మాధవ్
X

వెనుకా ముందు చూసుకోకుండా మాట్లాడేసే విషయంలో వైసీపీ నేతల దూకుడు మరో లెవల్ అన్నట్లుగా ఉంటుంది. సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ.. నందమూరి బాలక్రిష్ణను ఉద్దేశించి ఒక మాట అనే విషయంలో ఒకటికి పదిమార్లు ఆలోచించే పరిస్థితి. ఆ మాటకు వస్తే.. ఇప్పటివరకు బాలయ్యను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసిందే లేదు. అందుకు భిన్నంగా తాజాగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

తాజాగా మాట్లాడిన గోరంట్ల మాధవ్.. బాలక్రిష్ణ రెండుసార్లు గెలిచినప్పటికీ హిందూపురం నియోజకవర్గానికి ఏం చేశారు? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా అనూహ్య రీతిలో బాలయ్యపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. ''రాత్రి అయితే ఫుల్ బాటిల్ తాగుడు తప్ప మరేమీ లేదు'' అని వ్యాఖ్యానించారు. అక్కడితో ఆగని గోరంట్ల.. మరింత దూకుడుగా వ్యాఖ్యానించాడు.

బాలయ్య రాజకీయాల్ని ప్రస్తావించి.. ఆయన ప్రజలకు ఎంత అన్యాయం చేశాడన్న విషయాన్ని చెప్పే ప్రయత్నంలో.. సినిమాల ప్రస్తావన చేశారు. బాలయ్య సినిమాలు హిట్ అయినా ఫట్ అయినా డైరెక్టర్లను కొట్టటం చేస్తారని ఆరోపించారు. అంతేకాదు.. బీసీ ఆడబిడ్డ అయిన కురబ దీపికను గెలిపిస్తారో.. ఆడవాళ్లను హీనంగా మాట్లాడిన బాలక్రిష్ణను గెలిపిస్తారా? అని ప్రశ్నించటం షాకింగ్ గా మారింది. బాలయ్యపై ఇంత వరకు.. ఈ స్థాయిలో ఒత్తిడి రావటం లేదు. మరి.. గోరంట్ల మాధవ్ షాకింగ్ వ్యాఖ్యలపై బాలయ్య బాబు ఇప్పటివరకు రియాక్టు కాకపోవటం గమనార్హం.