Begin typing your search above and press return to search.

ఎన్నికల కమిషన్ తో జత కట్టిన గూగుల్... వాటికి చెక్!

అవును... సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘంతో గూగుల్ జతకట్టింది.

By:  Tupaki Desk   |   12 March 2024 12:30 PM GMT
ఎన్నికల కమిషన్  తో జత కట్టిన గూగుల్... వాటికి చెక్!
X

ప్రస్తుతం విపరీతంగా ప్రాచుర్యంలోకి వచ్చిన టెక్నాలజీతో ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో.. తదనుగుణంగా సమస్యలు కూడా వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల డీప్ ఫేక్ వీడియోలు కూడా హల్ చల్ చేస్తుండటం మరో పెద్ద సమస్యగా మారింది. ఈ సమయంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల కమిషన్ తో గూగుల్ జతకట్టింది. ఈ సందర్భంగా ప్రజల్లోకి తప్పుడు సమాచారం, నిబంధనలకు విరుద్ధమైన సమాచారం వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోనుంది.

అవును... సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘంతో గూగుల్ జతకట్టింది. ఇందులో భాగంగా... ప్రధానంగా తప్పుడు సమాచారం వ్యాపించకుండా అడ్డుకునేందుకు కొన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపింది. ఇదే సమయంలో అధీకృత సమాచారం మాత్రమే ప్రజల్లోకి వెళ్లేలా చూడటంతో పాటు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి క్రియేట్ చేసే వీడియోలకు లేబుల్ వేయాలని నిర్ణయించినట్లు తెలిపింది.

తాజాగా ఈ విషయాలపై తీసుకున్న నిర్ణయాలను, ఎన్నికల కమిషన్ తో జతకట్టడాన్ని తన బ్లాగ్ పోస్ట్ లో వెల్లడించింది గూగుల్. ఇందులో భాగంగా... ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి రూపొందించే కంటెంట్ ను గుర్తించడం సులభతరం చేసినట్లు తెలిపిన గూగుల్... డీప్ ఫేక్, మార్ఫింగ్ వీడియోను కట్టడి చేసినట్లు పేర్కొంది. ఈ క్రమంలో ఏఐతో క్రియేట్ చేసిన కంటెంట్ కు యూట్యూబ్ లో లేబుల్ వేయడం ప్రారంభించినట్లు వెల్లడించింది.

ఇదే క్రమంలో... ఓటరుగా ఎలా నమోదు చేసుకోవాలి.. ఓటు ఏ విధంగా వేయాలి మొదలైనటువంటి సమాచారాన్ని సులువుగా తెలుసుకోవచ్చని.. ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఈ సమాచారం లభిస్తుందని గూగుల్ పేర్కొంది. ఇదే సమయంలో... గూగుల్, యూట్యూబ్ సెర్చ్ లో ఎన్నికలకు సంబంధించి వార్తలు, సమాచారం ఆధీకృత వేదికల నుంచి మాత్రమే డిస్ ప్లే అయ్యేలా కూడా చర్యలు తీసుకున్నట్లుగా గూగుల్ తెలిపింది.