Begin typing your search above and press return to search.

ఎడారిలో ఇరుక్కున్న కార్లు... గూగుల్ మ్యాప్ షార్ట్ కట్ అంట!

ఈ క్రమంలో ఇటీవల లాస్‌ వేగాస్‌ నుంచి లాస్‌ ఏంజెల్స్‌ కు బయల్దేరారు కొందరు వ్యక్తులు. ఈ సమయంలో గూగుల్‌ నావిగేషన్‌ వ్యవస్థ వారికి ఓ షార్ట్‌ కట్‌ ను చూపించింది.

By:  Tupaki Desk   |   25 Nov 2023 2:45 AM GMT
ఎడారిలో ఇరుక్కున్న కార్లు... గూగుల్  మ్యాప్  షార్ట్  కట్  అంట!
X

గూగుల్ మ్యాప్ చెబుతుంది కదా అని ఎంత టెక్నాలజీపై నమ్మకం ఉంటే మాత్రం బ్లైండ్ గా వెళ్లిపోయి ఎన్నో ఇబ్బందులు పడ్డ వ్యక్తుల సంఘటనలు ఇటీవల వరుసగా వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. టెక్ రైట్, టేక్ లెఫ్ట్, గో స్ట్రైట్ అని మాత్రమే వింటూ కామన్‌ సెన్స్‌ ను పూర్తిగా పక్కనపెట్టేస్తే జరిగే అనర్ధాల్లు ఎన్నో ఎన్నెన్నో ఇటీవల జరిగాయి. ఈ క్రమంలో తాజాగా గూగుల్ మ్యాప్ షార్ట్ కట్ చూపించిందని ఎడారిలోకి వెళ్లిపోయి ఇరుక్కున వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది.

అవును... గూగుల్ మ్యాప్ ని బ్లైండ్ గా నమ్మితే జరిగే అనర్ధాలు ఇటీవల చాలానే జరిగిన సంగతి తెలిసిందే. ఇటీవల తమిళనాడుకు చెందిన లారీ రాత్రి చేర్యాల మీదుగా హుస్నాబాద్‌ వెళ్తూ గూగుల్ మ్యాప్ చూపించిందని గౌరవెల్లి జలాశయంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. నార్త్ కరోలినాలో గూగుల్ మ్యాప్ సూచనలను అనుసరిస్తూ కారు నడిపి కూలిపోయిన వంతెనపై నుండి పడి మరణించాడు ఒక వ్యక్తి.

ఈ క్రమంలో ఇటీవల లాస్‌ వేగాస్‌ నుంచి లాస్‌ ఏంజెల్స్‌ కు బయల్దేరారు కొందరు వ్యక్తులు. ఈ సమయంలో గూగుల్‌ నావిగేషన్‌ వ్యవస్థ వారికి ఓ షార్ట్‌ కట్‌ ను చూపించింది. ఇది సేఫ్ అని చెప్పడంతోపాటు.. ఈ మార్గంలో వెళితే 50 నిమిషాల ప్రయాణం కలిసొస్తుందని పేర్కొంది. దీంతో అమెరికాకు చెందిన షెబ్లీ ఎస్లెర్‌, ఆమె సోదరుడు, మరి కొంతమంది అదే రూట్ ని ఫాలో అవ్వడం మొదలుపెట్టారు.

ఇలా ఆ మ్యాప్‌ చూపిన మార్గంలో సీరియస్ గా ప్రయాణించిన వారికి చివరికి చిక్కటి నెవాడా ఎడారి ఎదురైంది. అంటే... గూగుల్ మ్యాప్ అక్కడికి తీసుకెళ్లి వదిలింది. దీంతో మైండ్ లో ఒక్కసారి ఫిక్సయితే బ్లైండ్ గా ఫాలో అయిపోతామన్నట్లుగా సాగిన వీరి ప్రయాణ వాహనాలు ఓ ఇసుక రోడ్డులో కూరుకుపోయాయి. దీంతో ఆందోళన చెంది కాలిఫోర్నియా హైవే పెట్రోల్‌ కు ఫోన్‌ చేసినప్పటికీ... సాయం అందలేదు.

చివరికి ఒక ట్రక్కుకు కాల్‌ చేయడంతో.. అది వీరున్న ప్రాంతానికి వచ్చి వాహనాలను బయటకు లాగి తీసుకెళ్లింది. దీంతో... ఈ ఘటనపై తాము దర్యాప్తు చేస్తున్నట్లు గూగుల్‌ వెల్లడించిందని న్యూయార్క్‌ పోస్టు కథనంలో పేర్కొంది.

వాస్తవానికి వీరు బయలుదేరిన అనంతరం ఎడారి మార్గం వైపు వెళ్తున్న సమయంలో ఓ బురద మార్గంలో నుంచి పర్వతంపైకి వెళుతున్నారు. దీంతో అది గమనించిన ఓ ట్రక్కు డ్రైవర్‌ ఎదురై.. అటువైపు రోడ్డు లేదని చెప్పాడు. కానీ... సాటి మనిషికంటే గూగుల్‌ మ్యాప్‌ ను బలంగా నమ్మిన వీరు ముందుకెళ్లి ఇసుక దారిలో ఇరుక్కుపోయారు.