హెచ్ 1బీ ఉద్యోగులు సో లక్కీ....
అన్ని కష్టాలు ఆ బిడ్డకే అన్నట్లు హెచ్1బీ వీసా ఉద్యోగులు అంటే అమెరికాలోనే కాదు ప్రపంచం మొత్తం అందరూ అయ్యోపాపం అనే దిక్కుమాలిన దుస్థితి దాపురించింది.
By: Tupaki Desk | 23 Dec 2025 4:05 PM ISTఅన్ని కష్టాలు ఆ బిడ్డకే అన్నట్లు హెచ్1బీ వీసా ఉద్యోగులు అంటే అమెరికాలోనే కాదు ప్రపంచం మొత్తం అందరూ అయ్యోపాపం అనే దిక్కుమాలిన దుస్థితి దాపురించింది. అమెరికాలో జరిగే ప్రతి ఉపద్రవానికి కర్త కర్మ క్రియ కేవలం హెచ్ 1బీ వీసా ఉద్యోగులే అన్నట్లు వ్యవహరిస్తున్నాడు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. వీసా రావాలంటే లక్ష డాలర్లు కట్టాల్సిందే అని ఒక రూలు...అమెరికాలో పుట్టే ఇమ్మిగ్రెంట్ పిల్లలకు బర్త్ రైట్ ఎందుకివ్వాలి అంటూ మరో రూల్. హెచ్ 1బీ వీసాకు దరఖాస్తు చేసుకున్న వారి సోషల్ మీడియా ఖాతాలు స్క్రీనింగ్ చేసే వెట్టింగ్ కార్యక్రమం అంటూ మరో రూల్...ఇలా తనకు తోచిన నిబంధనలు పెడుతున్న ట్రంప్ కు తాళం వేస్తూ అక్కడి అధికారులు పెద్ద కంపెనీల్లో ఒక్క హెచ్1బీ వీసా ఉద్యోగి...పది మది అక్రమ వలసదారులతో సమానమని మరో అవాకు చవాకులు పేలాడు. ఇన్ని ఇబ్బందుల మధ్య తాజాగా గూగుల్ కంపెనీ మాత్రం హెచ్1బీ వీసా ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది.
టెక్ దిగ్గజం గూగుల్ కంపెనీ తన సంస్థలో తాత్కాలిక వీసాపై పనిచేస్తూ గ్రీన్ కార్డు కోసం నిరీక్షిస్తున్న విదేశీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. వచ్చే ఏడాది నుంచి సంస్థలో పనిచేసే హెచ్ 1బీ ఉద్యోగులకు గ్రీన్ కార్డ్ స్పాన్సర్ షిప్ ప్రోగ్రామ్ వేగవంతం చేయనున్నట్లు ప్రకటించింది. ఉద్యోగులకు తమ అఫీషియల్ మెయిల్ ద్వారా ఈ సమాచారం ఇంటర్నల్ గా సర్క్యులేట్ చేసినట్లు సమాచారం అందుతోంది. 2026లో అర్హత గలిగిన ఉద్యోగుల దరఖాస్తు ప్రక్రియను వేగవంతం చేయనుంది. ప్రోగ్రామ్ ఎలక్ట్రానిక్ రివ్యూ మేనేజ్ మెంట్ (PREM) అర్హత సాధించిన ఉద్యోగలకు వచ్చే ఏడాది తొలి మూడు నెలల్లోనే గూగుల్ ఇమ్మిగ్రేషన్ చట్ట సంస్థల నుంచి పిలుపు వస్తుందని గూగుల్ తన ఇంటర్నల్ మెమోలో తెలిపినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని గూగుల్ సంస్థ ఆధికారకంగా ప్రకటించలేదు.
అమెరికా ఉపాధి కోసం గ్రీన్ కార్డుల జారీ ప్రక్రియలో PREM కీలక పాత్ర పోషిస్తుంది. చాలా టెక్ కంపెనీలు ఈ విధానాన్ని అవలంభిస్తుంటాయి. తాత్కాలిక వీసాపై ఉద్యోగం చేస్తూ గ్రీన్ కార్డు కోసం నిరీక్షిస్తున్న వారికి ఈ PREM గట్టెక్కడం చాలా ముఖ్యం. దీని ఆమోదం లభిస్తేనే ఉద్యోగి తన గ్రీన్ కార్డు ప్రక్రియలో ముందంజ వేయగలరు. అయితే
PREM ప్రక్రియ అంత సులువు కాదు. మొదట సంబంధిత ఉద్యోగిని తమ కంపెనీలో నియమించుకోవడం వల్ల అమెరికా స్థానిక వర్కర్లపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపబోదన్న అంశాన్ని కంపెనీలు ధ్రువీకరించాలి. అలాగే ఈ ఉద్యోగానికి సరిపడా నైపుణ్యం గల వ్యక్తి అమెరికాలో అందుబాటులో లేనందున విధిలేని పరిస్థితుల్లో విదేశీ ఉద్యోగిని నియమించుకోవాల్సి వస్తోందని నిరూపించాలి. అయితే కంపెనీలు అంత తేలిగ్గా తాత్కాలిక వీసా ఉద్యోగి పక్షాన నిలిచి గ్రీన్ కార్డు కోసం పోరాడ్డం చాలా కష్టం
కంపెనీలు లేఆఫ్ చేస్తున్న సమయాల్లో PREM ద్వారా తమ ఉద్యోగుల నియమాకాన్ని సమర్థించుకోవడం, వారికి గ్రీన్ కార్డు అవసరమని వాదించడం ఇబ్బందే. అసలే గూగుల్ 2023 జనవరిలో ప్రపంచ వ్యాప్తంగా వేలాది సంఖ్యలో ఉద్యోగుల్ని ఫైర్ చేసింది. అమెజాన్, మెటా లాంటి దిగ్గజ సంస్థలు ఇదే బాటను పట్టాయి. ఈ సందర్భంలో అవి PREM ప్రక్రియను పక్కన పెట్టేశాయి. 2026 నుంచి గూగుల్ ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని భావిస్తోంది. అయితే దీనికి దరఖాస్తు చేసుకోడానికి చాలా షరతులున్నాయి. అన్నిటికీ మించి ఎక్కడో రిమోట్ నుంచి పనిచేస్తున్న వారు గ్రీన్ కార్డ్ స్పాన్సర్ ప్రోగ్రామ్ క అనర్హులు. గూగుల్ ఆఫీసుకు నిరంతరం వచ్చి పనిచసే ఉద్యోగులకే ఈ అవకాశం లభిస్తోంది.అలాగే సీనియార్టీ కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. మొత్తమ్మీద ఎలాగోలా PREM గట్టెక్కితే గ్రీన్ కార్డు దక్కే అవకాశాలున్నాయి. మరి గూగుల్ లోని హెచ్1బీ ఉద్యోగులు ఈ అవకాశాన్ని ఎంతమాత్రం వినియోగించుకుంటారో వేచి చూడాలి.
