Begin typing your search above and press return to search.

ఎల్ఐసీలో అదిరిపోయే ప్లాన్..వృద్ధాప్యం కోసం ఇప్పటినుంచే!

ప్రభుత్వ ఇన్సూరెన్స్ భీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) తన కస్టమర్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది.

By:  Tupaki Desk   |   17 Sep 2023 12:10 PM GMT
ఎల్ఐసీలో అదిరిపోయే ప్లాన్..వృద్ధాప్యం కోసం ఇప్పటినుంచే!
X

ప్రభుత్వ ఇన్సూరెన్స్ భీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) తన కస్టమర్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. ఇందులో భాగంగా "ఎల్ఐసీ న్యూ పెన్షన్ ప్లస్" పేరుతో మరో ప్లాన్ తీసుకొచ్చింది. ఇది నాన్ పార్టిసిపేటింగ్, యూనిట్ లింక్డ్, ఇండివిజ్యువల్ పెన్షన్ ప్లాన్. ఇందులో రెండు రకాల ఆప్షన్స్ ఉన్నాయి. వాటిలో ఒకటి రెగ్యులర్ ప్రీమియం కాగా, మరొకటి సింగిల్ ప్రీమియం!

అవును... వద్ధాప్యంలో పెన్షన్ పొందడానికి ఇప్పటి నుంచే పొదుపు చేయాలనుకునేవారికి ఉపయోగపడేలా ఎల్.ఐ.సీ ఒక సరికొత్త పెన్షన్ ప్లాన్ ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ లో చేరడానికి 25 ఏళ్ల నుంచి 75 ఏళ్ల వయస్సు ఉండాలి. పాలసీ టర్మ్ 10 ఏళ్ల నుంచి 52 ఏళ్ల వరకు ఉంటుంది. ఈ పాలసీలో ఐదేళ్లు లాకిన్ పీరియడ్ ఉంటుంది. ఐదేళ్ల తర్వాత యూనిట్స్‌ ను కొంత విత్‌ డ్రా చేసుకునే సౌలభ్యం ఉంటుంది.

రెగ్యులర్ ప్రీమియం పాలసీ విషయానికొస్తే... ఉదాహరణకు 30 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి 42 ఏళ్ల టర్మ్ ఎంచుకుంటే.. 42 ఏళ్లు ప్రీమియం చెల్లించాలి. అంటే... ప్రతి ఏడాది రూ.30,000 ప్రీమియం చెల్లించారని అనుకుంటే... మెచ్యూరిటీ నాటికి 4 శాతం వార్షిక రిటర్న్స్ ప్రకారం రూ.21,83,069 రిటర్న్స్, రూ.2,55,397 యాన్యుటీ లభిస్తుంది. అంటే నెలకు దాదాపు రూ.21,000 పెన్షన్ లభిస్తుంది.

ఇక 8 శాతం వార్షిక రిటర్న్స్ ప్రకారం చూసుకుంటే... రూ.59,92,991 రిటర్న్స్, రూ.7,06,928 యాన్యుటీ లభిస్తుంది. అంటే ప్రతి నెలా రూ.58,000 పెన్షన్ లభిస్తుంది.

మరొపక్క సింగిల్ ప్రీమియం పాలసీ విషయానికొస్తే... 30 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి 42 ఏళ్ల పాలసీ టర్మ్ ఎంచుకున్నారని అనుకుంటే... సింగిల్ ప్రీమియం రూ.1,00,000 చెల్లించాలి. మెచ్యూరిటీ నాటికి 4 శాతం వార్షిక రిటర్న్స్ ప్రకారం రూ.3,69,948 రిటర్న్స్, రూ.42,808 యాన్యుటీ లభిస్తుంది. అంటే నెలకు సుమారు రూ.3,500 పెన్షన్ లభిస్తుంది.

అదే 8 శాతం వార్షిక రిటర్న్స్ ప్రకారం అయితే... రూ.14,55,283 రిటర్న్స్, రూ.1,70,253 యాన్యుటీ లభిస్తుంది. అంటే ప్రతి నెల రూ.14 వేల పెన్షన్ పొందవచ్చన్నమాట. ఒకవేళ ఈ ప్లాన్ కొనసాగుతున్న సమయంలో మరణిస్తే.. పాలసీ వ్యాల్యూ ను బట్టి నామీనికి అమౌంట్ ఇస్తారు.

వీటిలో సింగిల్ ప్రీమియం ఆప్షన్‌ లో కనీసం రూ.1,00,000 ఇన్వెస్ట్ చేయాల్సి ఉండగా... రెగ్యులర్ ప్రీమియం ఆప్షన్‌ లో నెలకు రూ.3,000.. మూడు నెలలకు రూ.9,000.. ఆరు నెలలకు రూ.16,000.. ఏడాదికి రూ.30,000 చొప్పున చెల్లించాలి. గరిష్టంగా ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు!