Begin typing your search above and press return to search.

70ఏళ్ల తర్వాత మందుబాబులకు గుడ్ న్యూస్... సౌదీ కీలక నిర్ణయం!

అవును... సౌదీ అరేబియా సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తుంది.

By:  Tupaki Desk   |   26 Jan 2024 12:30 AM GMT
70ఏళ్ల తర్వాత మందుబాబులకు గుడ్  న్యూస్... సౌదీ కీలక నిర్ణయం!
X

1852లో నిషేధించిన మద్యం ఇప్పుడు అందుబాటులోకి రానుంది! ఇస్లాంకు కంచుకోట అయిన సౌదీలో సుమారు 70ఏళ్ల తర్వాత ఈ సంచలన నిర్ణయం తెరపైకి వచ్చింది. దీంతో.. ఇన్నేళ్ల తర్వాత సౌదీలో తిరిగి మద్యం అందుబాటులోకి రానుంది. ఈ క్రమంలో రియాద్‌ లో మద్యం దుకాణాలను ఏర్పాటు చేయడానికి అనుమతి ఇస్తున్నట్లు సౌదీ అరేబియా తెలిపింది. కాకపోతే కొన్ని కండిషన్స్ పెట్టింది!

అవును... సౌదీ అరేబియా సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా... ఆ దేశ రాజధాని రియాద్‌ లో తన మొదటి ఆల్కహాల్ షాపు తెరవడానికి సిద్ధమవుతోంది. ఈ సమయంలో... మద్యం కావాలనుకునే కస్టమర్లు మొబైల్ యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. అదేవిధంగా... విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి క్లియరెన్స్ కోడ్‌ ను పొందాలి.

ఇస్లాంలో మద్యం సేవించడం నిషేధం కావడంతో తాజా నిర్ణయంతో అది కొందరికి మాత్రమే అందుబాటులో ఉండనుందని తెలుస్తుంది. పర్యాటకం, వ్యాపారం కోసం వచ్చే వారి కోసం మద్యం షాపులు ఓపెన్ చేయడానికి సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ నేతృత్వంలోని ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో క్లియర్ కావాల్సిన ఎన్నో సందేహాలు ఇంకా మిగిలే ఉండటం గమనార్హం.

ఇందులో భాగంగా.. రాయబార కార్యాలయాలు, దౌత్యవేత్తలకు మాత్రమే మద్యం అందుబాటులో ఉంటుంది. అయితే... సౌదీలో ఉన్న ముస్లిమేతర ప్రవాసులకు షాపుకు వెళ్లి మద్యం తీసుకోవచ్చా లేదా అనే విషయం మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కారణం... సౌదీ అరేబియాలో మిలియన్ల మంది ప్రవాసులు నివసిస్తున్నారు.

అయితే వారిలో ముఖ్యంగా తెలంగాణ నుంచి భారీగా హిందు, ముస్లింలు సౌదీ వెళ్తుంటారు. మరి వీరికి మద్యం అమ్ముతారా లేదా అనేది కూడా క్లారిటీ రావాల్సి ఉంది. కాగా... ఇప్పటి వరకు దౌత్య సిబ్బంది కోసం సీల్డ్ ప్యాకేజీలలో మద్యం సౌదీకి దిగుమతి అయ్యేది.

సౌదీలో మద్యాన్ని ఎందుకు నిషేధించారు?:

వాస్తవానికి ఇస్లాంలో మద్యాన్ని నిషిద్ధంగా ప్రస్తావించారు. అయితే... 1852లో సౌదీలో మద్యాన్ని నిషేధించడం వెనుక కూడా ఒక పెద్ద స్టోరీనే ఉందని చెబుతారు! ఇందులో భాగంగా... మద్యం సేవిస్తున్న సమయంలో జరిగిన ఓ గొడవలో.. అప్పటి సౌదీ రాజు అబ్దుల్ అజీజ్ కుమారుడు ప్రిన్స్ మిషారీ.. బ్రిటీష్ దౌత్యవేత్త సిరిల్ ఉస్మాన్‌ ను జెడ్డాను కాల్చి చంపారట. దీంతో... నాటి నుంచీ మద్యంపై దేశంలో పూర్తిగా నిషేధం విధించారని చెబుతారు!!