Begin typing your search above and press return to search.

జీవన కాల గరిష్ఠానికి బంగారం ధరలు

ఇప్పటివరకు నమోదైన ధరల్లో ఇదే అత్యధికంగా చెప్పాలి. రోజులో పది గ్రాములకు వెయ్యి రూపాయిలు అదనంగా పెరిగింది

By:  Tupaki Desk   |   22 March 2024 5:08 AM GMT
జీవన కాల గరిష్ఠానికి బంగారం ధరలు
X

బంగారం ధరలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. గురువారం రాత్రి 11.30 గంటల వేళలో బంగారం ధర తన జీవన కాల గరిష్ఠానికి చేరి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.68,450కు చేరుకుంది. ఈ మొత్తం పన్నులతో సహా. ఇప్పటివరకు నమోదైన ధరల్లో ఇదే అత్యధికంగా చెప్పాలి. రోజులో పది గ్రాములకు వెయ్యి రూపాయిలు అదనంగా పెరిగింది.

అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు బంగారం గిరాకీని అంతకంతకూ పెంచేసుకుంటూ పోతోంది. దీంతో బంగారం ధర అంతకంతకూ ఎక్కువ అవుతోంది. వడ్డీ రేట్లలో ఈ ఏడాది మూడుసార్లు కోత ఉంటుందని ఫఎడ్ సంకేతాలు ఇవ్వటం తెలిసిందే. దీంతోడాలర్ అమ్మకాలు ఎక్కువ అయ్యాయి. ఈ పరిణామం బంగారం ధర మరింత పెరగటానికి అవకాశాన్ని ఇచ్చింది.

ఇప్పుడే ఇంతలా ఉంటే రాబోయే రోజుల్లో బంగారం ధర ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అయితే..రాబోయే రోజుల్లో బంగారం ధర కొంత పెరిగినా.. మరింత జోరు అయ్యే అవకాశాలు తక్కువన్న మాట వినిపిస్తోంది. దేశంలో జరుగుతున్నసార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గిరాకీ పెద్దగా ఉందన్న మాట వినిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో నగదు.. బంగారం రవాణా విషయంలో తనిఖీలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి.

దీంతో.. బంగారం విషయంలో ఆచితూచి అన్నట్లు అడుగులు వేసే వీలుంది. మే 10న అక్షయ త్రతీయ కావటంతో ఆ రోజున బంగారం డిమాండ్ ఎక్కువ ఉంటుందని.. ఆ రోజు మళ్లీ ధర పెరుగుతుందంటున్నారు. బంగారంతో పాటు.. వెండి ధర కూడా పెరిగింది. తాజాగా కిలో వెండి రూ.76,050కు చేరింది. ముందు రోజుతో పోలిస్తే ఒకే రోజులో కిలో వెండికి రూ.1100 వరకు పెరిగినట్లుగా వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.