Begin typing your search above and press return to search.

వారమంతా ఇలానే: అంతకంతకూ దూకుడుగా బంగారం ధరలు

ఆకాశమే హద్దు అన్నట్లుగా బంగారం ధరలు దూసుకెళుతున్నాయి. గడిచిన వారం రోజులుగా ఇలాంటి పరిస్థితే నెలకొంటున్నాయి

By:  Tupaki Desk   |   9 April 2024 6:01 AM GMT
వారమంతా ఇలానే: అంతకంతకూ దూకుడుగా బంగారం ధరలు
X

ఆకాశమే హద్దు అన్నట్లుగా బంగారం ధరలు దూసుకెళుతున్నాయి. గడిచిన వారం రోజులుగా ఇలాంటి పరిస్థితే నెలకొంటున్నాయి. ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పది గ్రాముల బంగారం ధర రూ.71,700కు చేరుకోవటం తెలిసిందే. దేశీయంగానే కాదు అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు సరికొత్త తీరాలకు చేరుతున్నాయి. దీనికి అంతర్జాతీయంగా కూడా చోటు చేసుకుంటున్న పరిణామాలు కూడా కారణమని చెబుతున్నారు.

అమెరికా ఫెడ్ వడ్డీరేట్లు తగ్గించవచ్చన్న అంచనాలు.. ఈజీ మనీ.. ద్రవ్యోల్బణం భయాలు.. సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు.. భౌగోళిక ఉద్రిక్తల నడుమ బంగారంలోపెట్టుబడులే సేఫ్ అన్నట్లుగా సెంటిమెంట్ నడుస్తోంది. దీనికి తోడు బంగారం డిమాండ్ తోడైంది. దీంతో.. బంగారం ధర మహా దూకుడుగా ముందుకు వెళుతోంది. అంతర్జాతీయ మార్కెట్ లోనూ బంగారం ధర భారీగా పెరుగుతోంది.

ఔన్స్ ధర (31.1 గ్రాములు) ధర జూన్ తో ముగిసే కాంట్రాక్టు ఒక దశలో భారీగా పెరుగుతోంది. క్రితం ముగింపుతో పోల్చితే 27 డాలర్లు పెరిగింది. మొత్తంగా 2,372డాలర్లకు చేరుకుంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు బంగారం పది గ్రాములకు రూ.7700 పెరిగినట్లుగా చెబుతున్నారు. మరోవైపు ఫ్యూచర్స్ మార్కెల్.. మల్టీ కమోడిటీ ఎక్సైంచ్ లో బంగారం విలువ పది గ్రాములకు రూ.71,080కు చేరుకుంది. సోమవారం రాత్రి నాటికి గత ముగింపుతోపోల్చితే రూ.158 లాభపడి రూ.70,794 వద్ద ట్రేడ్ కావటం గమనార్హం.

మొత్తంగా బంగారం ధర కొత్త రికార్డుల్ని క్రియేట్ చేస్తున్న పరిస్థితి. ఇదెంత వరకు ఉంటుందన్నది అర్థంకావట్లేదని బంగారు వర్తకులు చెప్పటం గమనార్హం. మరోవైపు వెండి సైతం కొత్త గరిష్ఠాలను చూసింది. సోమవారం కేజీకి రూ.800 పెరిగి.. రూ.84 వేల స్థాయికి చేరుకుంది. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ లో కేజీ వెండి ధర (మే కాంట్రాక్ట్) ఒక దశలో రూ.82,109కు చేరింది. సోమవారం రాత్రి 9గంటల సమయానికి రూ.81,805 వద్ద ట్రేడ్ కావటం గమనార్హం. మొత్తంగా బంగారం.. వెండి పోటాపోటీగా దూసుకెళుతున్న పరిస్థితి.