బంగారం కళకళ.. వెండి విలవిల!
సాధారణంగా బంగారం ధరలు ఎప్పటికప్పుడు పైకి ఎగబాకుతూ ఇటు సామాన్యులను, అటు ధనికులను ఆశ్చర్యపరుస్తున్న విషయం తెలిసిందే.
By: Madhu Reddy | 25 Aug 2025 4:27 PM ISTసాధారణంగా బంగారం ధరలు ఎప్పటికప్పుడు పైకి ఎగబాకుతూ ఇటు సామాన్యులను, అటు ధనికులను ఆశ్చర్యపరుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు బంగారం ధరల సంగతి అటు ఉంచితే వెండి ధరలు కూడా ఆకాశాన్ని తాకుతూ సామాన్యుడికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఒకప్పుడు 10 గ్రాముల వెండి కొనుగోలు చేయాలంటే.. కేవలం రూ.100 లేదా రూ.200 చెల్లించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏకంగా రూ.1300 నుండి రూ.1500 వరకు చెల్లించాల్సిన పరిస్థితి వస్తోంది. ముఖ్యంగా కేజీ వెండి ధర ఏకంగా ఆల్ టైం రికార్డ్ సృష్టించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. బంగారం ధరలు రోజురోజుకీ తగ్గుతున్న నేపథ్యంలో.. అటు వెండి ధరలు మాత్రం ఆకాశాన్ని అంటుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇది చూసిన సామాన్యులు కూడా బంగారం కళకళ.. వెండి విలవిల అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ , విశాఖపట్నంతో పాటు మరికొన్ని ప్రాంతాలలో నేటి బంగారం, వెండి ధరలు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. పెళ్లిళ్లు, శుభకార్యాలు పండుగలు అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది బంగారమే. అటు పెట్టుబడి పెట్టాలనుకునే వారికి కూడా బంగారం ఒక మంచి సాధనం. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా బంగారం ధరలు పెరిగిపోతుండగా గత రెండు మూడు రోజులుగా ఇప్పుడు స్వల్పంగా తగ్గుతూ సామాన్యులకు ఊరట కలిగించాయి. కానీ వెండి ధరలు మాత్రం రోజురోజుకు పెరిగిపోతున్నాయి.
ఇక నేడు నమోదైన ధరల వివరాల విషయానికొస్తే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 110 రూపాయలు తగ్గగా.. 22 క్యారెట్ల బంగారం పై 100 రూపాయల మేరా తగ్గింది. కానీ వెండి ధర భారీగా పెరిగిపోయింది. కిలో వెండి పై ఏకంగా 1000 రూపాయలు పెరిగింది.
రెండు తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు..
రెండు తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరల విషయానికొస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 93,050 వద్ద కొనసాగగా.. 24 క్యారెట్ల ధర రూ.1,01,510 వద్ద కొనసాగుతోంది.
ఢిల్లీ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.93,200 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,660 కి చేరుకుంది.
ముంబై , బెంగళూరు, చెన్నై వంటి నగరాలలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 93,050 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,01,510 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరల విషయానికి వస్తే..
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో వెండి ధర భారీగా పెరిగిపోయింది. కిలో వెండి ధర రూ.1,31,000 వద్ద కొనసాగుతోంది.
ఇటు చెన్నైలో కూడా కిలో వెండి ధర రూ.1,31,000 కొనసాగుగా.. ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాలలో రూ.1,21,000 వద్ద కొనసాగుతోంది. మరి ఈ వెండి ధరలు ఎప్పుడు తగ్గుముఖం పడతాయో చూడాలి.
