2026 గోల్డ్: బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త..
బంగారం, వెండి ధరలు రోజురోజుకి గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. మంగళవారం రోజు బంగారం, వెండి ధరలు గరిష్ట స్థాయికి పెరిగాయి.
By: Madhu Reddy | 12 Nov 2025 10:53 AM ISTబంగారం, వెండి ధరలు రోజురోజుకి గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. మంగళవారం రోజు బంగారం, వెండి ధరలు గరిష్ట స్థాయికి పెరిగాయి. ఇకపోతే బంగారం ఎవరైతే కొనుగోలు చేయాలని అనుకుంటున్నారో వారికి ఇదే కరెక్ట్ సమయం అని చెప్పవచ్చు. ఎందుకంటే వచ్చే యేడాది ఈ బంగారం ధరలు భారీగా పెరగనున్నాయని.. ఎవరైనా బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు ఇప్పుడే కొనుగోలు చేయాలి అని.. లేకపోతే పెరిగిన ధరల కారణంగా భారీగా నష్టపోతారు అని నిపుణులు కూడా సూచిస్తున్నారు.
ఇక విషయంలోకి వెళ్తే.. అమెరికా ప్రభుత్వ షట్ డౌన్ ముగిసే అవకాశం ఉండడంతో ఆర్థిక డేటా విడుదలలు మళ్లీ ప్రారంభమవుతాయనే అంచనాల మధ్య ఇది ఆర్థిక మాంద్యాన్ని నిర్ధారించే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఇది యూఎస్ ఫెడరల్ రిజర్వ్ రేటు కోతకు అవకాశాలను కూడా పెంచుతుంది అని చెప్పవచ్చు. ఇక విశ్లేషకుల ప్రకారం చూసుకుంటే.. బంగారం ధరలు కొంత కాలం పాటు ఏకీకృతం కావచ్చు. ఆ తర్వాత మళ్లీ పెరగవచ్చు. వచ్చే ఏడాది బంగారం ధరలు ఔన్స్ కు $5,000ల కంటే ఎక్కువగా పెరుగుతాయని జేపీ మోర్గాన్ అనే ప్రైవేట్ బ్యాంకు అంచనా వేసింది. అంటే ఇది ప్రస్తుతం ఉన్న ధర కంటే 20 శాతం ఎక్కువ. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో డిసెంబర్ డెలివరీ కోసం కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.45% పెరిగి ఔన్స్ కి $4,140.75 కి చేరుకోగా.. వెండి భవిష్యత్తులో 0.08% పెరిగి ఔన్స్ కి $50.35 కి చేరుకుంటుంది. అని అంచనాలు వేసింది బ్యాంక్.
ఇకపోతే నేటి ధరల విషయానికి వస్తే.. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,23,830 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 1,13,510 గా ఉంది. అయితే వీటికి జీఎస్టీ మరియు మేకింగ్ చార్జీలు ఉండవు. ఇక వెండి కిలోకి 1,57,100 ఉంది..
ఈ బంగారం ధరల గురించి...కోటక్ సెక్యూరిటీస్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ కైనత్ చైన్వాలా మాట్లాడుతూ.." స్పాట్ గోల్డ్ సోమవారం దాదాపు 3% పెరిగి ఔన్స్ కు $4116.7 కి చేరుకుంది.దీనికి అమెరికా ప్రభుత్వ షట్ డౌన్ ముగింపు, ఆర్థిక డేటా విడుదలను మళ్లీ ప్రారంభిస్తుందనే అంచనాలు దోహదపడతాయి. చాలా కాలంగా ఆలస్యమైన ఆర్థిక డేటా మందగమనాన్ని నిర్ధారించే అవకాశం ఉంది. ఇది ఫెడరల్ రిజర్వ్ రేట్ కోతలను మరింత పెంచే అవకాశాలను పెంచుతుంది.
అక్టోబర్ లో వరుసగా చైనా PBOCతన నిల్వలకు 74.09 మిలియన్ ఔన్స్ లను జోడించింది. అయితే ప్రపంచ కేంద్ర బ్యాంకు ను Q3లో 220 టన్నులను కొనుగోలు చేశాయి. ఇది Q2కంటే 28% ఎక్కువ. గ్లోబల్ గోల్డ్ ఇటీఎఫ్ లు వరుసగా ఐదవ నెలలో కూడా పెట్టుబడులు పెరిగాయి. అక్టోబర్లో 54.9 టన్నులు పెరిగాయని" ఆయన చెప్పుకొచ్చారు. జనవరి 30 వరకు ప్రభుత్వానికి నిధులు సమకూర్చే సెనేట్ ఆమోదించిన స్వల్పకాలిక ప్రభుత్వ నిధుల బిల్లుపై బుధవారం నాటికి ఔన్స్ ఓటింగ్ కోసం మార్కెట్లు ఎదురు చూస్తున్నాయి.. ఆగ్ మౌంట్ లో హెడ్ రెనీషా చైనాని మాట్లాడుతూ.. బంగారం ధరలు 1,25 వేలకు చేరుకున్నాయి.ధరలు పెరగడానికి ముందు కొంతకాలం ఓ దగ్గర స్థిరపడతాయని అన్నారు.
జేపీ మోర్గాన్ ప్రైవేట్ బ్యాంకు.. బంగారం బలమైన పెరుగుదల వచ్చే ఏడాది ఔన్స్ కు $5000 దాటి ధరలని పెంచుతుందని అంచనా వేస్తోంది. 2026 చివరి నాటికి బంగారం ధరలు $5200 మరియు$ 5300 మంది పెరగవచ్చునని.. ప్రస్తుతం కంటే 20%ఎక్కువగా పెరుగుతుందని ప్రపంచ అధిపతి అయినటువంటి అలెక్స్ వోల్ఫ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ లెక్కన చూసుకుంటే బంగారం ధరలు 2026 చివరినాటికి కచ్చితంగా భారీ స్థాయిలో పెరుగుతాయి. అందుకే బంగారం కొనాలి అనుకునే వారికి ఇప్పుడే మంచి సమయం. ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిదని అంటున్నారు విశ్లేషకులు.
