Begin typing your search above and press return to search.

అక్షయ తృతీయకు ముందే లక్ష్మీ కటాక్షం..కుప్పకూలిన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి కొనుగోలు చేసే వారికి నిజంగా ఇది శుభవార్తే. అక్షయ తృతీయ పండుగ సమీపిస్తున్న తరుణంలో పసిడి, వెండి ధరలు ఒక్కసారిగా దిగిరావడంతో మార్కెట్‌లో సందడి నెలకొంది.

By:  Tupaki Desk   |   28 April 2025 3:32 PM IST
Gold and Silver Prices Drop
X

బంగారం, వెండి కొనుగోలు చేసే వారికి నిజంగా ఇది శుభవార్తే. అక్షయ తృతీయ పండుగ సమీపిస్తున్న తరుణంలో పసిడి, వెండి ధరలు ఒక్కసారిగా దిగిరావడంతో మార్కెట్‌లో సందడి నెలకొంది. గత కొన్ని రోజులుగా తగ్గుతున్న ధరలు నేడు మరింతగా పతనమవడంతో కొనుగోలుదారులు ఆనందంతో మునిగి తేలుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ కూడా కావడంతో ఈ ధరల తగ్గుదల మరింత ఊతమిచ్చేలా ఉంది. అసలు బంగారం, వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? ప్రస్తుత ధరలు ఎలా ఉన్నాయి? కొనుగోలుదారులకు ఇది మంచి సమయమేనా? వివరంగా తెలుసుకుందాం..

బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా దిగిరావడంతో కొనుగోలుదారులకు పండగ వాతావరణం నెలకొంది. గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు, నేడు ఏకంగా తులంపై రూ. 620కి పైగా పతనమయ్యాయి. వెండి ధర కూడా భారీగా తగ్గింది. దీంతో అక్షయ తృతీయ పండుగకు ముందుగానే ధరలు కుప్పకూలడంతో, ఇది కొనుగోలుదారులకు నిజంగా అదృష్టంగా భావిస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్ కూడా కావడంతో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని భారీగా కొనుగోళ్లు చేసేందుకు సిద్ధమవుతున్నారు. గత వారం రోజుల్లోనే బంగారం ధర దాదాపు రూ.1000కి పైగా తగ్గడం విశేషం. ఇక వెండి ధర ఒక్కరోజే రూ.1400 మేర తగ్గింది.

మరికొన్ని రోజుల్లో అక్షయ తృతీయ రాబోతోంది. ఈ రోజున బంగారం లేదా ఇతర విలువైన లోహాలు కొనడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. బంగారం ధరలు ఇప్పటికీ రికార్డు స్థాయిలో ఉన్నప్పటికీ, గత వారం నుండి క్రమంగా తగ్గుతూ వస్తోంది. అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనడం అనేది భారతదేశంలో శతాబ్దాలుగా వస్తున్న ఆచారం. ఈ ఏడాది అక్షయ తృతీయ ఏప్రిల్ 30న వస్తోంది. బంగారం ధరలు తగ్గుతున్న ఈ తరుణంలో కొనుగోలుదారులు ఆచితూచి వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు.ఇదే ట్రెండ్ కొనసాగితే బంగారం ధర రూ.56,000 స్థాయికి చేరుకోవచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుత ధరల ప్రకారం 22 క్యారెట్ల బంగారం ఒక గ్రాము ధర రూ. 62 తగ్గి రూ. 8,940కి చేరింది. 24 క్యారెట్ల బంగారం ఒక గ్రాము ధర రూ. 68 తగ్గి రూ. 9,753 వద్ద ఉంది. ఈ లెక్కన 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 89,400 (నిన్నటి ధర రూ. 90,020), 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 97,530 (నిన్నటి ధర రూ. 98,210),10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ. 73,150 (నిన్నటి ధర రూ. 73,660) వద్ద ట్రేడవుతోంది.

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం, అమరావతిలలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. వెండి ధరల విషయానికి వస్తే.. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కేజీ వెండి ధర రూ. 1,00,500 ఉండగా, చెన్నై, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లో కేజీ వెండి ధర రూ. 1,11,000గా ఉంది.