ఈరోజు భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధర.. ఏకంగా వెయ్యి రూపాయల వరకు..12 ఏళ్ల తర్వాత మొదటిసారి ఇలా!
బంగారం కొనుక్కోవాలి అన్న వాళ్లకు శుభవార్త.. ఈరోజు బంగారం ధర భారీగా తగ్గనుంది.. ఒకటి, రెండు రూపాయలు కాదు ఏకంగా వెయ్యి రూపాయల వరకు..
By: Priya Chowdhary Nuthalapti | 22 Oct 2025 8:45 AM ISTGold Rate Reduced
బంగారం కొనుక్కోవాలి అన్న వాళ్లకు శుభవార్త.. ఈరోజు బంగారం ధర భారీగా తగ్గనుంది.. ఒకటి, రెండు రూపాయలు కాదు ఏకంగా వెయ్యి రూపాయల వరకు ఈ రోజు బంగారం ధర తగ్గనుంది అని వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఇంతలా బంగారం ఎందుకు తగ్గనుంది అనే విషయాన్ని వెళితే..
Gold Price Today
ఈరోజు బంగారం ధరలు భారీగా పడనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఒక్క రోజులోనే బంగారం రేటు 6 శాతం కంటే ఎక్కువగా తగ్గింది. ఇది 2013 తర్వాత వచ్చిన అతి పెద్ద పతనంగా.. నిపుణులు చెబుతున్నారు. బంగారం ధర ఔన్స్‌కు 4,381 డాలర్ల గరిష్ట స్థాయి నుంచి 4,082 డాలర్ల వరకు పడిపోయింది. అంటే ఒక్క రోజులోనే సుమారు వెయ్యి రూపాయల తగ్గుదల కనిపించింది.
Gold Price Crash
ఈ భారీ పతనానికి ప్రధాన కారణం లాభాల స్వీకరణ. గత కొన్ని వారాలుగా బంగారం ధరలు నిరంతరం పెరుగుతూ రావడంతో..పెట్టుబడిదారులు తమ లాభాలను సేఫ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అంతేకాక..అమెరికా డాలర్ బలపడటంతో బంగారం విలువ కిందికి జారింది. డాలర్ బలంగా ఉండడం వలన బంగారం.. వెండి వంటి లోహాలను కొనడం ఇతర దేశాల వారికి ఖరీదుగా మారుతుంది.
Silver Rate Today
ఇక అమెరికా–చైనా వాణిజ్య సంబంధాల్లో సానుకూల పరిణామాలు రావడంతో ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు తగ్గాయి. దీనివల్ల పెట్టుబడిదారులు బంగారం వంటి సేఫ్ హావెన్ ఆస్తుల నుంచి బయటకు వచ్చి..షేర్ మార్కెట్ల వంటి రిస్క్ అసెట్‌లపై దృష్టి పెట్టారు. దీనివల్ల బంగారం డిమాండ్ తాత్కాలికంగా తగ్గిపోయింది.
Silver Rate Reduces
వెండి ధర కూడా బంగారంలాగానే.. పడిపోయింది. ఔన్స్‌కు సుమారు 7 శాతం తగ్గి 47 డాలర్ల స్థాయికి చేరింది. ఇతర విలువైన లోహాలు ప్లాటినం, పల్లాడియం కూడా 6 నుండి 7 శాతం వరకు తగ్గాయి. అయితే..మార్కెట్ నిపుణులు చెబుతున్న దాని ప్రకారం ఇది తాత్కాలిక సరిదిద్దింపు మాత్రమే.. బంగారం ధరల్లో ఈ తరహా హెచ్చుతగ్గులు సహజమేనని వారు చెబుతున్నారు. దీర్ఘకాలంలో బంగారం ఇంకా మంచి పెట్టుబడి సాధనంగానే ఉంటుంది.
Gold and Silver Price
కాబట్టి ఇప్పుడే పెట్టుబడులు పెట్టిన వారు భయపడాల్సిన అవసరం లేదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి ధర పతనాలు కొత్త పెట్టుబడిదారులకు కొనుగోలు చేసే మంచి అవకాశం అని వారు అంటున్నారు. ప్రస్తుతం అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో మార్పులు..ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, రాజకీయ ఉద్రిక్తతలు బంగారం ధరలను ప్రభావితం చేసే ప్రధాన అంశాలు. కాబట్టి..బంగారం పెట్టుబడిదారులు త్వరిత నిర్ణయాలు కాకుండా దీర్ఘకాల దృష్టితో వ్యవహరించాలి.
