Begin typing your search above and press return to search.

చరిత్ర సృష్టించనున్న గోల్కొండ బ్లూ డైమండ్ వేలం.. ఎన్ని వందల కోట్లు పలకనుందంటే ?

వేలం తేది: మే 14 వేదిక: క్రిస్టీస్ జ్యువెలరీ షోరూమ్, జెనీవా అంచనా ధర: రూ. 300 కోట్ల నుంచి రూ. 430 కోట్లు ఈ వజ్రం వేలం ప్రపంచవ్యాప్తంగా వజ్రాల ప్రేమికులను, చరిత్రకారులను ఆకర్షిస్తోంది.

By:  Tupaki Desk   |   14 April 2025 6:26 PM IST
చరిత్ర సృష్టించనున్న గోల్కొండ బ్లూ డైమండ్ వేలం.. ఎన్ని వందల కోట్లు పలకనుందంటే ?
X

గోల్కొండ గనుల నుండి వెలికితీసిన అరుదైన బ్లూ డైమండ్ మళ్లీ వేలానికి సిద్ధమైంది. 23.24 క్యారెట్ల బరువున్న ఈ అపురూపమైన వజ్రపు ఉంగరాన్ని అమెరికాలోని న్యూయార్క్ నగరానికి చెందిన క్రిస్టీస్ ఆభరణాల దుకాణం మే 14న జెనీవాలోని తమ షోరూమ్‌లో వేలం వేయనుంది. ఈ ఉంగరం ఒకప్పుడు ఇందౌర్ మహారాజు యశ్వంత్ రావు హోల్కార్ కి చెందినదని క్రిస్టీస్ ఇంటర్నేషనల్ జువెలరీ హెడ్ రాహుల్ కడాకియా తెలిపారు. ఈ తరహా ఉంగరం ఇప్పటివరకు వేలానికి రాలేదని ఆయన వెల్లడించారు. ఈ వేలంలో ఈ ఉంగరం ధర రూ. 300 కోట్ల నుంచి రూ. 430 కోట్ల వరకు పలకవచ్చని అంచనా వేస్తున్నారు.

గోల్కొండ వజ్రాల చరిత్ర

గోల్కొండ గనులు వజ్రాలకు ప్రసిద్ధి చెందినవి. ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధమైన కోహినూర్ వజ్రం కూడా గోల్కొండ గనుల్లోనే లభించింది. గోల్కొండ వజ్రాలు వాటి స్వచ్ఛత, రంగు, కాంతికి ప్రసిద్ధి. ఈ గనులలో లభించిన వజ్రాలు ప్రపంచవ్యాప్తంగా రాజులు, రాణులు, ధనవంతుల ఆభరణాలలో స్థానం సంపాదించుకున్నాయి. 19 వ శతాబ్దం చివరి వరకు, ప్రపంచంలోని అతిపెద్ద అత్యుత్తమమైన వజ్రాల వాణిజ్యకేంద్రాలలో గోల్కొండ మార్కెట్ ఒకటిగా గుర్తించబడింది. ఆ విధంగా 'గోల్కొండ డైమండ్' అనే పురాణ పేరు గోల్కొండకు పర్యాయపదంగా మారింది.

ఈ బ్లూ డైమండ్ ప్రత్యేకతలు

ఈ వజ్రం 23.24 క్యారెట్ల బరువు కలిగివుంది. ఇది అత్యంత అరుదైన నీలి రంగు వజ్రం. దీని పూర్వపు యజమాని ఇందౌర్ మహారాజు యశ్వంత్ రావు హోల్కార్. ఈ రకమైన వజ్రం ఇంతకు ముందు ఎప్పుడూ వేలం వేయలేదు. ఈ వజ్రానికి క్లారిటీ, కట్‌, క్యారెట్‌ అనే మూడు అంశాల్లో ఎంతో విశిష్టత వుంది. హైదరాబాద్ చరిత్రకారుడు ముహమ్మద్ సఫిల్లా గోల్కొండలోని అన్ని గనుల నుండి జరిగిన ఉత్పత్తి 12 మిలియన్ క్యారెట్లు వుంటుందని అంచనా వేశాడు. 1923లో గుర్తింపు ఈ వజ్రం అసలైన మూలం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా కొల్లూరు అని చెబుతున్నారు. గతంలో ఇందౌర్ మహారాజా యశ్వంత్ రావు హోల్కర్-II వద్ద ఈ వజ్రం ఉండేది. 1923లో ఆయన తండ్రి ఈ వజ్రాన్ని ఓ బ్రాస్‌లెట్‌లో గుర్తించారు. అనంతరం ఆభరణాల పునర్నిర్మాణం సమయంలో దీనిని ఇందౌర్ పియర్ వజ్రాలతో తయారుచేసిన నెక్లెస్‌లో అమర్చారు.

వేలం వివరాలు

వేలం తేది: మే 14 వేదిక: క్రిస్టీస్ జ్యువెలరీ షోరూమ్, జెనీవా అంచనా ధర: రూ. 300 కోట్ల నుంచి రూ. 430 కోట్లు ఈ వజ్రం వేలం ప్రపంచవ్యాప్తంగా వజ్రాల ప్రేమికులను, చరిత్రకారులను ఆకర్షిస్తోంది. 1947లో ప్రఖ్యాత న్యూయార్క్ ఆభరణాల వ్యాపారి హ్యారీ విన్స్టన్ ఈ వజ్రాన్ని కొనుగోలు చేశాడు. అనంతరం ఇది బరోడా మహారాజు వద్దకు చేరి, ఇప్పుడది మళ్లీ ప్రపంచ వేదికపై వెలుగు చూడనుంది.