Begin typing your search above and press return to search.

గోదావరి వంతెనపై ఘోరం... పైపును పట్టుకొని ప్రాణాలు దక్కించుకున్న చిన్నారి!

కన్నతండ్రి కాటేస్తాడని భావించని ఆ పిల్లలు అక్కడ నిలబడ్డారు. తర్వాత ఒక్కసారిగా వారందరినీ నదిలోకి తోసేసి కారు ఎక్కి వెళ్లిపోయాడు

By:  Tupaki Desk   |   7 Aug 2023 8:28 AM GMT
గోదావరి వంతెనపై ఘోరం... పైపును పట్టుకొని ప్రాణాలు దక్కించుకున్న చిన్నారి!
X

ఒళ్లు గగుర్పాటుకు గురిచేసే భయానక స్థితిలో 13 ఏళ్ల బాలిక ఎంతో ధైర్యం చూపింది. తన తల్లిని నమ్మించిన వ్యక్తే అందరినీ నడి గోదారిలోకి తోసేయగా.. ఆ చిన్నారి మాత్రం సమయస్ఫూర్తితో తనను తాను కాపాడుకుని ప్రాణాపాయం నుంచి బయటపడింది. పెద్దలే నిస్సహాయులయ్యే పరిస్థితిలో ఆ చిన్నారి ఎంతో చాకచక్యంగా వ్యవహరించడంపై పోలీసులు ఆశ్చర్యపోయారు.

అవును... రావులపాలెంకు చెందిన 13 ఏళ్ల తెలుగు అమ్మాయి కీర్తన.. గోదావరి వంతెనపైనుంచి అద్భుతంగా బయటపడింది. గొట్టం పట్టుకుని కష్టమైన సమయంలో ఆమె తన ధైర్యాన్ని ప్రదర్శించింది. ఆమె మరో చేత్తో పైపును పట్టుకున్నప్పటికీ 100కి డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించింది.

వివరాళ్లోకి వెళ్తే... గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన మహిళ (36) భర్తతో విభేదాలతో విడిపోయింది. కూలిపని చేసుకుంటూ కుమార్తె తో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో ఆమెకు రెండేళ్ల క్రితం ప్రకాశం జిల్లా దర్శికి చెందిన వ్యక్తితో పరిచయం ఏర్పడడంతో ఆయనతో సహజీవనం చేస్తోంది. వీరికి ఒక పాప (1) జన్మించింది.

ఇలా సాగిపోతున్న సమయంలో ఇటీవల సదరు మహిళకు, ఆ వ్యక్తికీ మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో... ఆమెను, పిల్లలను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ఆ వ్యక్తి పథకం పన్నాడు. ఈ నేపథ్యంలో రాజమండ్రిలో బట్టలు కొనుక్కుందామంటూ ముగ్గురినీ తీసుకొని కారులో బయలుదేరాడు. దీంతో సదరు మహిళా, పిల్లా హ్యాపీగా ఉన్నారు.

ఈ సమయంలో రాత్రంతా వివిధ ప్రాంతాల్లో తిప్పి తెల్లవారుజామున 4 గంటలకు రావులపాలెంలోని గౌతమి పాత వంతెనవద్దకు తీసుకొచ్చాడు. అక్కడ సెల్ఫీ తీసుకుందామని చెప్పి పిల్లలతో సహా రెయిలింగ్‌ వద్ద పిట్టగోడపై నిలబెట్టాడు. కన్నతండ్రి కాటేస్తాడని భావించని ఆ పిల్లలు అక్కడ నిలబడ్డారు. తర్వాత ఒక్కసారిగా వారందరినీ నదిలోకి తోసేసి కారు ఎక్కి వెళ్లిపోయాడు.

ఈ సమయంలో సదరు మహిళ, ఏడాది వయసున్న పాప గోదావరిలో పడిపోయారు. అయితే 13ఏళ్ల కీర్తన మాత్రం వంతెన పక్కగా వేసిన కేబుల్‌ పైపు చేతికి అందడంతో దానికి గట్టిగా పట్టుకుంది. ఒక చేత్తో పైపును పట్టుకొని వేలాడుతూనే తన జేబులో ఉన్న మొబైల్ ఫోన్ తీసి 100కు డైల్ చేసింది. తన పరిస్థితిని వివరించింది.

దీంతో రావులపాలెం ఎస్‌.ఐ. వెంకటరమణ సిబ్బందితో కలిసి హుటాహుటిన అక్కడకు చేరుకుని బాలికను రక్షించారు. ఈ సమయంలో సుమారు అరగంటపాటు చీకట్లో పైపు ఆధారంతో వేలాడుతూ ఉండడమే కాకుండా... ఫోన్‌ చేసి తమకు చెప్పిన వైనాన్ని తెలుసుకుని పోలీసులు ఆశ్చర్యపోయారు.

ఈ సమయంలో గోదావరి నదిలో తప్పిపోయిన మహిళ, చిన్న పాపను కనుగొనడానికి ఒక బృందం, నిందితుడి కోసం వెతకడానికి మరొక బృందం గాలింపు చర్యలు చేయట్టాయని తెలుస్తుంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.