Begin typing your search above and press return to search.

గంజాయి ప్రియుడు సూసైడ్.. వేదనతో ప్రేయసి ఆత్మహత్య

ఈ విషాద ఉదంతం గురించి విన్నంతనే.. ఇదేం ప్రేమ అన్న బాధతో కూడిన వేదన వ్యక్తం కావటం ఖాయం

By:  Tupaki Desk   |   22 Aug 2023 6:08 AM GMT
గంజాయి ప్రియుడు సూసైడ్.. వేదనతో ప్రేయసి ఆత్మహత్య
X

ఈ విషాద ఉదంతం గురించి విన్నంతనే.. ఇదేం ప్రేమ అన్న బాధతో కూడిన వేదన వ్యక్తం కావటం ఖాయం. ప్రేమించిన యువకుడు గంజాయికి బానిస కావటం ఒక ఎత్తు.. చిన్న కారణానికి తీవ్రమైన ఆవేశంతో ఆత్మహత్య చేసుకుంటే.. ప్రియుడి లేని జీవితం తనకు లేదన్న వేదనతో సూసైడ్ చేసుకున్న ప్రియురాలి వైనం షాకిచ్చేలా మారింది. యానాంలో చోటు చేసుకున్న ఈ ఉదంతంపై వస్తున్న స్పందనలు చూసినప్పుడు.. ప్రేమ తప్పు లేదు కానీ.. ఆ పేరుతో ఇలాంటి చర్యలు సరికాదన్న మాట వినిపిస్తోంది.

యనాంలోని యూకేవీ నగర్ కు చెందిన 22 ఏళ్ల మౌనికకు ఒక అక్క.. చెల్లి ఉన్నారు. పదేళ్ల క్రితమే వీరి తల్లిదండ్రులు చనిపోయారు. తాళ్లరేవు మండలంలో నర్సింగ్ చదువుతున్న ఆమె అక్కచెల్లెళ్లకు పెళ్లిళ్లు అయిపోయాయి. వారిద్దరు అత్తారింట్లో ఉంటున్నారు. మౌనిక ప్రస్తుతం మేనమామ ఇంట్లో ఉంటున్నారు. ఆమె రెండేళ్లుగా చిన్నా అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నారు.

గంజాయికి బానిస అయిన చిన్నా.. రెండు నెలల క్రితం రూ.500 ఇవ్వాలంటూ తన సోదరుడ్ని అడగటం.. ఆయన ఇవ్వనని చెప్పటంతో తీవ్ర ఆగ్రహానికి గురై.. ఒంటికి నిప్పు అంటించుకున్నాడు. తీవ్ర గాయాలైన అతడు కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ప్రియుడు మరణించిన వైనంతో వేదన చెందిన మౌనిక కాలేజీకి వెళ్లటం మానేసి.. తీవ్రమైన డిప్రెషన్ కు లోనైంది. సోమవారం ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకొని చనిపోయింది. గంజాయికి బానిసై.. ఏ మాత్రం బాధ్యత లేకుండా సూసైడ్ చేసుకున్న ప్రియుడిని మర్చిపోలేక అర్ధంతరంగా జీవితాన్ని చాలించిన మౌనిక ఉదంతం విషాదంగా మారింది.