Begin typing your search above and press return to search.

ఫ్రీ బస్సు కారణంగా వెక్కి వెక్కి ఏడ్చిన అమ్మాయి.. ఎందుకో తెలుసా?

జగిత్యాలకు చెందిన ఒక యువతి ప్రతీ రోజూ కాలేజ్ కు వెళ్తుంది. అయితే.. తనకు నిత్యం సీటు దొరకడం లేదని కన్నీళ్లు పెట్టుకుంది.

By:  Tupaki Desk   |   19 Dec 2023 7:36 AM GMT
ఫ్రీ బస్సు కారణంగా వెక్కి వెక్కి ఏడ్చిన అమ్మాయి.. ఎందుకో తెలుసా?
X

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణ వసతిని కల్పించింది. కాంగ్రెస్ 6 హామీల్లో భాగంగా మొదటగా ప్రారంభించిన పథకం. దీంతో రాష్ట్ర ప్రజల్లో భిన్నమైన అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు ఇది రాష్ట్రానికి నష్టం తీసుకస్తుందంటే.. మరి కొందరు మాత్రం ఇది మంచి పథకం అంటూ ప్రభుత్వాన్ని కీర్తిస్తున్నారు. కీర్తించడమే కాదు.. రేవంత్ ప్రభుత్వం మొదటి పథకమే భారీగా సక్సెస్ కావడంతో ఆకాశానికెత్తుతున్నారు.

అయితే ఈ పథకంలో ఇబ్బందులు మెల్ల మెల్లగా బయటకు వస్తున్నాయి. ఫ్రీ జర్నీ కావడంతో యువతలు ఆటోలు, క్యాబ్ లకు పూర్తిగా వీడ్కోలు పలికారు. దీంతో పాపం వారు విలపిస్తున్నారు. ఏ చిన్నపాటి పని ఉన్నా ఫ్రీ జర్నీ కాబట్టి ఆర్టీసీ బస్సుల్లో వెళ్తున్నారు. దీంతో ఆర్టీసీకి నష్టమనేది పక్కన పెడితే.. డబ్బులు చెల్లించి జర్నీ చేసే వారికి తీవ్రంగా ఇబ్బంది ఎదురవుతుంది.

మొన్నటికి మొన్న ఒక వ్యక్తి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఓ వ్యక్తి ఆందోళనకు దిగాడు. బస్సులో పురుషులకు ఒక్క సీటు కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలా సీట్లన్నీ మహిళలు ఆక్రమిస్తే తాము ఎలా జర్నీ చేయాలని ప్రశ్నించాడు. బస్సుకు అడ్డంగా నిలబడి నిరసన తెలిపాడు. ఉచిత ప్రయాణంను ఎవరూ వ్యతిరేకించరని.. కానీ పురుషులకు సీట్లు ఇవ్వకపోవడంపై మండిపడ్డాడు.

ఇక ఈ రోజు ఒక యువతి బస్టాండ్ లో వెక్కి వెక్కి ఏడ్వడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జగిత్యాలకు చెందిన ఒక యువతి ప్రతీ రోజూ కాలేజ్ కు వెళ్తుంది. అయితే.. తనకు నిత్యం సీటు దొరకడం లేదని కన్నీళ్లు పెట్టుకుంది. రోజూ దాదాపు 40 నిమిషాలకు పైగా ప్రయాణం చేయాలి. అంటే కాలేజీకి వెళ్లడం 40 నిమిషాలు, రావడం మరో 40 నిమిషాలు ఇలా గంటకు పైగా బస్సులో నిలబడాల్సి వస్తుందని ఏడ్చింది.

రోజూ కాలేజీకి సమయానికి వెళ్లలేకపోతున్నామని ఆందోళన చెందింది. 'బస్సు ఫ్రీ చేసి మాలాంటి వాళ్లు ప్రయాణించకుడా చేస్తున్నారు. మా ఊరికి ఇదే లాస్ట్ బస్సు, మాకు కొత్త బస్సు కావాలి ఇప్పుడు' అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. అయితే ఆ యువతి ఎక్కే బస్సు నిండిపోయి ఫుడ్ బోర్డ్ పై కూడా మహిళలు ప్రయాణం చేయడం కనిపించింది.

అవసరానికి ఫ్రీ జర్నీ ఉపయోగించుకుంటారని ప్రభుత్వ పెద్దలు అనుకుంటే కథ అడ్డం తిరిగినట్లు అనిపిస్తుంది. ప్రతీ ఒక్కరూ ఫ్రీ జర్నీకి అలవాటు పడడంతో డబ్బులు పెట్టి వెళ్లేవారికి సీట్లు దొరకడం లేదు. ఇక డబ్బులు పెట్టి వెళ్లేవారు కూడా ఆటోలు, క్యాబ్ లను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.