Begin typing your search above and press return to search.

నంబర్ బ్లాక్ చేశాడని ప్రియుడ్ని చంపేసిన ప్రియురాలి

మొబైల్ ఫోన్ లోని చాటింగ్ ను చూపించమని అడిగిన ప్రియురాలి మాట వినకపోవటమే కాదు.. ఆమె ఫోన్ నంబర్ ను బ్లాక్ చేసినందుకు ప్రాణాలు పోగొట్టటుకున్నాడో ప్రియుడు.

By:  Garuda Media   |   4 Feb 2026 10:19 AM IST
నంబర్ బ్లాక్ చేశాడని ప్రియుడ్ని చంపేసిన ప్రియురాలి
X

మొబైల్ ఫోన్ లోని చాటింగ్ ను చూపించమని అడిగిన ప్రియురాలి మాట వినకపోవటమే కాదు.. ఆమె ఫోన్ నంబర్ ను బ్లాక్ చేసినందుకు ప్రాణాలు పోగొట్టటుకున్నాడో ప్రియుడు. ఛత్తీస్ గఢ్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతం సంచలనంగా మారింది. అసలేం జరిగిందంటే.. పాతికేళ్ల ప్రసాద్ సూర్యవంశీ బిలాస్ పుర్ సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నాడు. ఇంట్లో అద్దెకు ఉంటూ హోటల్లో పని చేసే ఇతనికి ఒక యువతితో ప్రేమ వ్యవహారం నడుస్తోంది.

సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వీరిద్దరు కొంత కాలంగా రిలేషన్ షిప్ లో ఉంటున్నారు. ఒకరింటికి మరొకరు వచ్చి వెళుతూ ఉండేవారు. అయితే.. ఇటీవల కాలంలో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. దీంతో వీరి మధ్య గొడవలు జరిగేవి. ఇదిలా ఉంటే.. ఇటీవల సదరు యువతి ఫోన్ నంబర్ ను బ్లాక్ చేశాడు. దీంతో ఆమె తీవ్ర ఆగ్రహానికి గురైంది.

దీంతో ప్రసాద్ ఇంటికి వెళ్లిన ఆమె.. తన నంబర్ ను ఎందుకు బ్లాక్ చేశాడో ప్రశ్నించింది. అంతేకాదు.. అతడి మొబైల్ లో చాటింగ్స్ చూపించాలని కోరింది. ఇందుకు ప్రసాద్ ససేమిరా అన్నాడు. దీంతో.. వారిద్దరి మధ్య వాదనలు చోటు చేసుకున్నాయి. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె.. తన వెంట తెచ్చుకున్న కత్తితో ప్రియుడ్ని విచక్షణరహితంగా పొడిచేయటంతో తీవ్రగాయాలతో అక్కడికక్కడే మరణించాడు. ఈ విషయంపై సమాచారం అందుకున్నపోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.