Begin typing your search above and press return to search.

శుభ్‌మాన్ గిల్ తో డేటింగ్.. షాకిచ్చిన సారా

టీం ఇండియా క్రికెటర్ శుభ్‌మాన్ గిల్‌తో డేటింగ్ పుకార్లపై బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ ఎట్టకేలకు స్పందించింది.

By:  Tupaki Desk   |   6 Nov 2023 1:30 PM GMT
శుభ్‌మాన్ గిల్ తో డేటింగ్.. షాకిచ్చిన సారా
X

టీం ఇండియా క్రికెటర్ శుభ్‌మాన్ గిల్‌తో డేటింగ్ పుకార్లపై బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ ఎట్టకేలకు స్పందించింది. ద‌ర్శ‌క‌నిర్మాత కరణ్ జోహార్ చాట్ షో `కాఫీ విత్ కరణ్ 8`లో త‌న‌పై పుకార్ల గురించి సారా వివ‌ర‌ణ ఇచ్చింది. అనన్య పాండేతో కలిసి సారా తాజా ఎపిసోడ్ లో క‌నిపించ‌నుంది. ఇంత‌లోనే తాజా ప్రోమోలో సారా అలీఖాన్ స్వ‌యంగా శుభ్‌మాన్ గురించి ప్ర‌స్థావించిన ప్రోమో అంతర్జాలంలో వైర‌ల్ గా మారింది.

ప్రోమోలో హోస్ట్ కరణ్ హాస్య చతుర‌త కామిక్ టైమింగ్ ఆక‌ట్టుకున్నాయి. అత‌డు సారా - అనన్యలను మండించే హీరోయిన్లు (మాజీ ప్రియుడి విష‌యంలో) అంటూ పరిచయం చేసాడు. ఆ త‌ర్వాత సారాను శుభ్‌మాన్ గిల్‌తో ఎఫైర్ పుకార్ల గురించి ప్ర‌శ్నించాడు. ``మీరు శుభ్‌మాన్ గిల్‌తో డేటింగ్ చేస్తున్నారనే పుకార్లు ఉన్నాయి`` అని కరణ్ నేరుగా సారాతో చెప్పాడు. దీనికి యువ‌హీరోయిన్ ఇచ్చిన స‌మాధానం ఆక‌ట్టుకుంది.

అబ్బాయిలు వెంట‌ప‌డే సారా వేరు. మీరు పొర‌బ‌డ్డారు. ప్ర‌పంచ‌మంతా వేరొక సారా వెంట‌ప‌డుతోంది! అని వ్యాఖ్యానించారు. నిజానికి శుభ్‌మాన్ గిల్ వెంట‌ప‌డే సారా వేరొక‌రు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ వెంట ప‌డుతున్నార‌ని చెప్పింది సారా అలీఖాన్. ఇటీవ‌ల వ‌ర‌ల్డ్ క‌ప్ 2023 సీజ‌న్ లో శుభ్ మాన్ ఆట‌తీరును ఆస్వాధిస్తూ, వీఐపీ గ్యాలరీ నుంచి క్లాప్స్ తో ఎంక‌రేజ్ చేస్తున్న సారా టెండూల్క‌ర్ కెమెరా క‌ళ్ల‌కు చిక్కుతోంది. సారా అలీఖాన్ తో సారా టెండూల్క‌ర్ కి మంచి స్నేహం ఉంది. ఆ ఇద్ద‌రూ క‌లిసి ఇంత‌కుముందు ఒక ప్ర‌క‌ట‌న‌లో కూడా న‌టించారు.

సారా అలీఖాన్ న‌టిగా, మోడ‌ల్ గా రాణిస్తోంది. సారా టెండూల్క‌ర్ మోడ‌ల్ గా రాణించే ప్ర‌య‌త్నాల్లో ఉంది. త్వ‌ర‌లోనే బాలీవుడ్ లో న‌టించే అవ‌కాశం లేక‌పోలేదు! అన్న గుస‌గుస‌లు వినిపించాయి. అందం, ప్ర‌తిభ‌, చురుకుద‌నంలో ఒక బాలీవుడ్ న‌టికి తీసిపోని ప్ర‌త్యేక‌త‌లు సారా టెండూల్క‌ర్ లో ఉన్నాయి. కానీ త‌న భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ ఏమిట‌న్న‌దానిపై ఎలాంటి స్ప‌ష్ఠ‌తా ఇంకా రాలేదు.