Begin typing your search above and press return to search.

పిల్లి కంటే పెద్ద ఎలుక.. 2.5 అడుగుల పొడవు, రెండు కిలోల బరువు.. ఎక్కడ దొరికిందంటే?

ఈ ప్రపంచంలో ఇప్పటికీ మనం చాలా జీవులను చూడలేదు. అలాంటి జీవులు మన కంట పడినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది.

By:  Tupaki Desk   |   24 May 2025 8:00 PM IST
Giant Rat Discovered in Papua New Guinea Leaves Scientists
X

ఈ ప్రపంచంలో ఇప్పటికీ మనం చాలా జీవులను చూడలేదు. అలాంటి జీవులు మన కంట పడినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటి ఆశ్చర్యం కలిగించే ఒక జీవి ఇప్పుడు వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం అలాంటి జీవి మరేదో కాదు ఒక ఎలుక. దీనిని ఇటీవలే కనుగొన్నారు. దీని సైజు నిజంగా ఒక పిల్లి కంటే పెద్దదిగా ఉంది. ఈ ఎలుకను చూసి శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోయారు. మొదటి చూపులోనే అసలు ఇంత పెద్ద ఎలుక ఉంటుందా అని ఆలోచనలో పడ్డారు.

2.5 అడుగుల పొడవు.. కత్తి లాంటి పళ్లు!

మిర్రర్ వెబ్‌సైట్‌లో వచ్చిన ఒక నివేదిక ప్రకారం.. ఈ ఎలుకలు పాపువా న్యూ గినియాలోని ఎత్తైన కొండ ప్రాంతాల్లో దొరికాయి. వీటి పొడవు 2.5 అడుగుల (సుమారు 76 సెంటీమీటర్లు) కంటే ఎక్కువ ఉంటుంది. వీటికి కత్తి లాంటి బలమైన పళ్లు, దట్టమైన బొచ్చు ఉన్నాయి. ప్రస్తుతం శాస్త్రవేత్తలు దీనికి 'సబ్-ఆల్పైన్ వూలీ ర్యాట్' (Subalpine Woolly Rat) అని పేరు పెట్టారు. డైలీ మెయిల్ అనే ఇంగ్లీష్ వెబ్‌సైట్‌లో వచ్చిన వార్త ప్రకారం.. ఈ ఎలుక మొదటిసారిగా ప్రపంచానికి కనిపించింది. అది ఆహారం కోసం వెతుకుతున్నప్పుడు. శాస్త్రవేత్తల ప్రకారం.. ఈ ఎలుక పాపువా న్యూ గినియాలోని మౌంట్ విల్‌హెమ్ శిఖరాల్లో కనిపిస్తుంది.

ఈ జీవిని ఎవరు కనుగొన్నారు?

మీడియా నివేదికల ప్రకారం.. ఈ ఎలుకను కనుగొన్న ఘనత ఫ్రాంటిసెక్ వెజ్మెల్కా అనే శాస్త్రవేత్తకు దక్కుతుంది. ఈయన చెక్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, చెక్ రిపబ్లిక్‌లోని సౌత్ బోహేమియా యూనివర్సిటీలోని బయాలజీ సెంటర్‌లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. ఈ జీవి గురించి ఆయన మాట్లాడుతూ.. "ఇప్పటివరకు ఈ జీవులను మ్యూజియంలలో బొమ్మల రూపంలోనే చూసేవాళ్ళం. అందుకే దీని గురించి ప్రజలకు పెద్దగా తెలియదు. అయితే, ఈ జీవిని చూస్తే ఉష్ణమండల పర్వతాల జీవవైవిధ్యం గురించి ఇంకా చాలా తెలుసుకోవాల్సి ఉందని అర్థమవుతుంది" అని అన్నారు.

రెండు కిలోల బరువు

"ఈ జీవి గురించి నాకు తెలిసిన వెంటనే, నేను వెంటనే దాని కోసం వెతుకుతూ బయలుదేరాను. ఆరు నెలల ట్రిప్‌లో వెజ్మెల్కా చాలా ఆదివాసీ తెగలతో కలిసి ఈ రహస్య జీవి గురించి సమాచారం సేకరించాడు. ప్రపంచం కోసం నేను దాని నిజమైన ఆవాస స్థలాల ఫోటోలను కూడా తీశాను. అది ప్రపంచానికి తెలిసినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు" అని అన్నారు. ఈ జీవి బరువు దాదాపు రెండు కిలోలు ఉంటుంది. ఇది రాత్రిపూట తిరిగే జీవి (నిశాచరి), చాలా రహస్యంగా జీవిస్తుంది. ప్రకృతిలో ఇంకా ఎన్నో వింతలు, విశేషాలు దాగి ఉన్నాయని ఈ ఆవిష్కరణ నిరూపిస్తుంది.