Begin typing your search above and press return to search.

మే 24న పెను ప్రమాదం.. యుగాంతానికి కౌంట్ డౌన్ స్టార్ట్?

కొందరు శాస్త్రవేత్తలు సైతం ఈ గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తుండడంతో ఆందోళన అమాంతం పెరుగుతోంది.

By:  Tupaki Desk   |   21 May 2025 11:13 PM IST
మే 24న పెను ప్రమాదం.. యుగాంతానికి కౌంట్ డౌన్ స్టార్ట్?
X

ప్రపంచం అంతమయ్యే రోజు దగ్గరపడిందా.. యుగాంతానికి కౌంట్ డౌన్ ఇప్పటికే మొదలైందా? భూమి వైపు ఓ భారీ గ్రహశకలం అత్యంత వేగంగా దూసుకొస్తుందన్న వార్తలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. కొందరు శాస్త్రవేత్తలు సైతం ఈ గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తుండడంతో ఆందోళన అమాంతం పెరుగుతోంది.

100 అంతస్తుల బిల్డింగ్ అంత గ్రహశకలం

భూమి వైపు దూసుకొస్తున్న ఈ గ్రహశకలం పేరు '2003 H4'. దీని పరిమాణం దాదాపు 100 అంతస్తుల భవనం అంత ఎత్తు ఉంటుందని అంచనా. అంతేకాదు, ఇది గంటకు ఏకంగా 50 వేల కిలోమీటర్ల భయంకరమైన వేగంతో మన గ్రహం వైపు దూసుకువస్తోంది. ఈ వేగంతో ఇంత పెద్ద గ్రహశకలం భూమిని చిన్నగా ఢీకొట్టినా, అది పెను విధ్వంసం సృష్టించి భూమిని తునాతునకలు చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మే 24న భూమికి అత్యంత సమీపంగా

శాస్త్రవేత్తల తాజా అంచనాల ప్రకారం.. ఈ గ్రహశకలం మే 24న భూమిని అత్యంత సమీపంగా చేరుకోనుంది. సరిగ్గా సాయంత్రం 4 గంటల 7 నిమిషాల సమయంలో భూమికి పెను ప్రమాదం పొంచి ఉందని వారు చెబుతున్నారు. అంత పెద్ద గ్రహశకలం మనకు ఇంత దగ్గరగా రావడం ఆందోళన కలిగిస్తోంది.

నాసా అభయం.. శాస్త్రవేత్తల హెచ్చరిక

అయితే, ఈ విషయంలో నాసా (NASA) ఒక శుభవార్త చెబుతోంది. '2003 H4' గ్రహశకలం మే 24న భూమికి అత్యంత సమీపంగా వెళ్తుంది కానీ, భూమిని ఢీకొట్టే అవకాశం లేదని నాసా స్పష్టం చేసింది. ఇది భూమిని దాటి వెళ్లే సమయంలో ఆకాశం మరింత ప్రకాశవంతంగా మెరుస్తుందని కూడా నాసా వెల్లడించింది.

కానీ, కొందరు శాస్త్రవేత్తలు మాత్రం నాసా అభయాన్ని పూర్తిగా నమ్మలేమని అంటున్నారు. భూమికి అత్యంత సమీపంగా వచ్చినప్పుడు, భూమి గురుత్వాకర్షణ శక్తి (భూమ్యక్షరణ) ప్రభావం వల్ల గ్రహశకలం గతి మారే అవకాశం ఉందని, అది ఊహించని విధంగా భూమిని ఢీకొట్టే అవకాశాన్ని కొట్టిపారేయలేమని వారు చెబుతున్నారు. అందుకే మే 24న సాయంత్రం అందరూ అప్రమత్తంగా ఉండాలని, పరిస్థితిని నిశితంగా గమనించాలని హెచ్చరిస్తున్నారు. ఈ హెచ్చరికలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు, ఆందోళనకు దారితీస్తున్నాయి.